Friday, December 2, 2016

పార్లమెంట్.....రోజుకో స్టంట్



పార్లమెంట్.....రోజుకో స్టంట్  

ఎంతో గొప్ప ప్రదేశం పార్లమెంటు
అక్కడ జరిపే చర్చలో ఉండేలా చూడండి కొంచం కంటెంటు

ఎప్పూడూ చూసిన పడుతుంది వాయిద
అలా ఉంటే ప్రజలకు ఏంటీ ఫాయిద?

మీ చర్యల వళ్ళ ప్రతి భారతీయుడు పడుతున్నాడు భాద
ఎంతో విలువ అయిన ప్రజాధనం అవుతున్నది వృద 

గుర్తుంచుకోండి ప్రజలపై మీకున్న భాధ్యతలు
జరపండి అర్దవంతమైన, ప్రజలకు ఉపయోగపడే చర్చలు

ప్రభుత్వాన్ని ప్రశ్నిచటం మీ హక్కు
దానిని వాడుకోండి పార్లమెంట్లొ వినిపించి ప్రజల వాక్కు

సమయం వృధా చేయటం వళ్ళ కలగదు దేశానికి బంగారు భవిషత్తు
కొంచం అర్దవంత చర్చకు చేయండి కసరత్తు

ఇకనైన ఆపండి వాకౌటు
పరిష్కారలు వేతికి ప్రజలకు చేయండి లేకుండా ఎటువంటి లోటు   

మీ ఈగొలను పక్కన పెట్టండి
ప్రజల శ్రేయస్సు కొరకు నడుం కట్టండి

ఇకనైన ఆపండి గొడవపడే పంచాయతి
దయచేసి వినండి మా వినతి

మా కొరకు ఆలోచించే ఏ నేతను వెనక్కి నేట్టం
మా హృదయాల్లో పెట్టుకోని కడతాం పట్టం

ఇకనైనా మారుతుంది ఆశిస్తు

జి.సునిల్   

No comments: