Sunday, December 23, 2018

నాన్న నువ్వు ఉండీ ఉంటే బాగుండు


నాన్న నువ్వు ఉండీ ఉంటే బాగుండు
నాన్న నేడు నూతన గృహంలో పెడుతున్నాను పాదం
కోరుకుంటున్నాను నీ చల్లని ఆశిర్వాదం

ఎప్పుడూ అలోచించే వాడివి ఉండాలి మనకంటూ ఒక గూడు
నేటితొ నీ ఇరువురు కుమారులు సాదించిన వేళా....

నాన్న నిజంగా నువ్వు ఉంటే బాగుండు

నాన్న నేడు మా ముందు ఉంది నీ కలల ప్రతిరూపం
నిజంగా నువ్వు ఉండి ఉంటే, నేటి ప్రతి క్షణం అయ్యేది ఎంతో అపురూపం

అయినా నిన్ను మా నుంచి దూరం చేయలేకపోయింది చావు
కనిపిస్తున్న ఇంటిలో నువ్వే కనిపిస్తున్నావు నాన్న ప్రతి అనువు   

మా మధ్యలోనే నువ్వు ఉండి చూస్తున్నావు అనే అభిప్రాయం మా అందరికి కలుగుతుంది 
అందుకే శుభకార్యం జరుగుతున్న ప్రదేశం ఆనందంతో వెలుగుతుంది

కల సాకారంలో మాకు అనిపించలేదు శ్రమ
అందుకు కారణం ఎక్కడ ఉన్న నువ్వు మాపై కురిపించే ప్రేమ

నేడు విచ్చేసే అందరు తమ చల్లని ఆశిస్సులతో దీవించండి నా ప్రయత్నం
మీ అందరికి పలుకుతున్నా నా హృదయపూర్వక స్వాగతం

ఇట్లు
మీ సునిల్


Wednesday, December 12, 2018

అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

 

అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు
నెరవేరాలి మీ జీవితంలో అన్ని ఆకాంక్షలు 

మీరు ఉంటారు ఎప్పుడూ మా గుండేల్లో 
మా ప్రతి అడుగు ఉంటుంది మీరు చూపే దారిలో

మీరు ఉన్నారు మా గుండెల నిండ
మేము ఉంటాం ఎప్పుడూ మీకు అండ 

అన్న, గెలుపు ఓటములు సహజం
స్వచమైన మన బందం మాత్రం నిజం 

అన్న మన బందం ఎంతో దృడమైనది 
ఎన్ని వచిన్నా తట్టుకొని గెలిచే అంత బలమైనది 

తప్పక సాద్దిదాం మన ఆశయం
తప్పక ఉంటుంది మా అందరి సహాయం

కలిసిగట్టుగా సాగుదాం ముందుకు అన్న
మాకు ఎవరు కాదు ఎక్కువ మీ కన్న

మన బందాన్ని ఇలాగే సాగించటం ముఖ్యం 
తప్పక మనం చేరుకుందాం మన లక్ష్యం 

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో
మీ అభిమానులు 

Thursday, November 22, 2018

మా అభయ హస్తం శ్రీనన్న

 



మా అభయ హస్తం శ్రీనన్న

మా అన్న ఇంటి పేరు కాటా

ప్రజల కోరకే ఉంటుంది తన ప్రతి మాటా 

ప్రజా శ్రేయస్సు పనులతోనే నడుస్తుంది తన ప్రతి పూటా  

తన మనస్సు ప్రజా సంక్షేమాల కోటా

సమస్యలు దరి చేరవు తను ఉన్న చోటా

మా అన్న అభయ హస్తం అవరోదలను దరి చేర్చని తూటా

ప్రజా సమస్యలపైనే ఉంటుంది తన పోరాట వేటా  

ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని తీస్తాడు తాటా 

ఎప్పుడూ నమ్మిన సిద్దాంతాలకు చెప్పలేదు అన్న టాటా

అన్నే గెలుస్తాడు ఇప్పుడు వినిపిస్తుంది అందరి నోటా 

ఇక ప్రజా ప్రయోజనాలతో వెలగనుంది మా  పేటా

వాగ్దానం చేస్తున్నం అన్నా మేము ఎప్పుడూ ఉంటాము మీ వెంటా 


ఇట్లు

అన్న అభిమానులు 


Tuesday, October 16, 2018

వెల్ డన్ శ్రవణ్



                            వెల్ డన్ శ్రవణ్

తన ఆలోచనని అద్బుత దృశ్యంగా చూపాలని ప్రయత్నిస్తాడు ప్రతి డైరక్టర్ 
తను జీవించిన తరువాతే తేరకేక్కిస్తాడు ప్రతి క్యారెక్టర్

అలా జీవించిన తరువాతే ప్రారంబించాడు శ్రవణ్ తన డ్రీం ప్రాజెక్ట్
చాలా మంచి సినిమాతో ప్రయత్నిచాడు అవ్వాలని ప్రతి ఒకరిని కనెక్ట్


తొలి చిత్రంతో ఎవరూ చేయరూ సందేశం ఇచ్చే డేరు 
కాని అలా ప్రయత్నించిన శ్రవణ్ సినిమా మన మదిలో ఎప్పటికి ఉంటుంది స్టొరు  
 
ప్రతి పాటలో ఉంది చాలా గొప్ప బావం
అవీ సినిమాకి ఇచ్చింది చాలా మంచి జీవం

ఎక్కడా తగ్గలేదు మాటల్లొ పదును
ప్రతి మాట మంచి సందేశం అందించే జోను

అందరూ కొత్త నటులతో చేసాడు చాల మంచిగా హాండిల్
ఇప్పటి నుంచే కొత్త వారికి అవకాశం ఇచ్చి చూపాడు తన మంచి దిల్

తన పరిదిని కొంచెం కుదించింది బడ్జెట్ లోటు
ఇంకా కొంచెం ఆర్దిక స్వేచ్చ ఉండుంటే సినిమా ఉండేది ఎవరికి అందని చోటు

అలా అని ఎక్కడా ఇవ్వలేదు తన ఆలోచనని తగ్గించే ఆస్కారం
తన ప్రయత్నానికి తప్పక అందుతుంది అందరి పురస్కారం

సినిమా తయారు చేయటం కోసం పెట్టాడు తన సర్వస్వం 
ఇప్పుడు ఆర్దిక ఇబ్బందుల వళ్ళ తన కలను చూసుకోవటంలో అవ్వుతుంది కొంచెం జాప్యం

ఆశిస్తున్నా త్వరగా దాటుతాడు ఈ కష్టాల గట్టు
రానున్న రోజుల్లో ఉన్నత స్తాయిలో ఉంచనుంది తనకు సినిమ మీద ఉన్న పట్టు

తనకు ఉంది అన్ని శాకల్లో మంచి ప్రావిణ్యం
అందుకు నీదర్శనమే తనను సిని లోకానికి పరిచయం చేస్తున్న సినిమ సైన్యం


సినిమా అందించింది చాల మంచి సందేశం
శ్రవణ్, అందరూ గర్వ పడే స్తాయికి తప్పక తీసుకెళ్తుంది నీ ఈ సిని ప్రవేశం


నీకు ఉన్నాయి నీ తల్లిదండ్రుల ఆశిస్సులు
తప్పక జీవితంలో నేరవేరుతాయి నీ అన్ని ఆశలు



వెల్ డన్ శ్రవణ్
ఆశిస్తున్నాం రానున్న రోజుల్లో అవ్వాలి సిని ప్రపంచాన్ని ఏలే నంబెర్ వన్
 
MOVIE TRAILER:

నీ శ్రేయోభిలాషి
జి.సునిల్   

Monday, October 15, 2018

రాజకీయ ప్రక్షాళణ కోసం జనసైనికుల కవాతు


రాజకీయ ప్రక్షాళణ కోసం జనసైనికుల కవాతు
జనసేన వైపే ఉన్నారు ప్రజలు యావత్తు
రుజువు చేసింది నేడు సత్తా చాట్టిన కావాతు 

జనసేనికులతో నిండిపోయింది దవళేశ్వరం
మోగించారు పవర్ఫుల్ సమరం

జనసైనికులు తల్లి భారత ముద్దు బిడ్డలు
దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కోదమసింహాలు 

కవాతులో జరిగింది అశేష జనసైనికుల ప్రభంజన
సమాయుక్తం అయ్యారు చేయటానికి అవినీతి ప్రక్షాళన

సగటు రాజకీయ వ్యవస్థ అవుతున్నది నిర్వీర్యం
ఒక విప్లవం తెచ్చి కవాతు ద్వార ఇవ్వాలి అనుకున్నారు ప్రజలకి దైర్యం

కవాతు ద్వార జనసైనికులు అయ్యారు సిద్దం
చేయాటానికి కుల్లి పోయిన రాజకియ వ్యవస్థపై యుద్దం

కవాతు ముఖ్య ఉద్దేశంపై ఇచ్చారు క్లారిటీ
తెలిపారు జనసైన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టి

భాద్యతాయుత పదవికి కావాలి అనుభవం
అనుభవజ్ఞుడికి మద్దత్తు ద్వారా 2014 లో చేయాలనుకున్నారు మంచి ప్రభావం 

ఓట్లు చీలకుండా ప్రజా సంక్షేమం కొరకు చేసారు నిస్వార్ద సహాయం
కాని ఆ ప్రయత్నం నేరవేర్చలేదు తన ద్యేయం

వారసత్వంతో రాజకీయ ప్రవేశంకీ పడలేదు బీజం
సి.యం అవ్వాలనే ప్రజల స్వచ్చమైన కోరిక అవుతుంది నిజం


జనసైనికులు తెలుగు జాతిని గౌరవించే వాళ్ళం 
అవమానాలు ఎక్కువ అయితే తాట తీస్తాం

పంచాయితి ఎన్నికలు పేడితే చూపుతాం మా సత్తా చాటుతాం
ప్రజలకు అందవలసిన సంక్షేమ పదకాలు అందేలా చేస్తాం



ప్రజా సంక్షేమం అనే బలమైన ఆలోచనతో ముందుకు వెళ్దాం
దౌర్జన్యమైన వ్యవస్థ ముళ్ళును ముళ్ళుతోనే తాట తీద్దాం

కావాతు  జయప్రదంచేసిన ప్రతి జనసైనికుడికి దన్యవాదము
సమిష్టి కృషితో గెలిచి జనసేన పాలనలో వేద్దాము అభివృద్ది వైపు పాదము

జి.సునిల్ 

Thursday, October 11, 2018

ద్వీతియ సంవత్సరములోకి మా చిన్నారి హిమశ్రీ

ద్వీతియ సంవత్సరములోకి మా చిన్నారి హిమశ్రీ

హిమశ్రీ, నీవు మా జీవితంలోకి వచ్చి నేటితో ఒక సంవత్సరం
గ్రహించి ఉంటావు నీకు కింద రాసిన అందరు నీ సొంతం  

నీకు ఉన్నాడు నాన్న పెంచటానికి అల్లారు ముద్దుగా
నీ కోసం అన్ని సమకూర్చటానికి ఆకాశమే హద్దుగా
నీకు ఉన్నది అమ్మ ప్రేమ లాలన
మంచి మార్గదర్శం అందించే ఆమే పాలన

నీకు ఉంది ఎప్పుడూ మీ అందరిపై ప్రాణం పెట్టుకునే నాని
మీ అందరి అల్లరి కదలికలే అమే అందరికి చేప్పుకునే అందమైన కహాని

నీకు ఉంది ప్రేమ అందించే అమ్మమ
నీకు ఉన్నాడు తాత ఎప్పుడూ అలోచించే ఎమీ చేస్తున్నది నా చిట్టి బొమ్మ

నీకు ఉన్నాడు అండగా ఉండే అన్న
ఎవరూ కాదు తనకు నీకన్న మిన్న

నీకు ఉన్నారు ఇద్దరు ప్రేమించే అక్కలు
మీ ముగ్గురు మార్చాలి ఆడ పిల్లలపై ఉన్నచులకనపు లెక్కలు

నీకు దొరికింది రోజు నిన్ను చూడందే నిద్రపోని మేనత్త
ప్రాణం ఊరుకోదు రోజు హల్లొ చేప్పించుకోకపోతే నీ చేత

నీకు ఉన్నాము మేమందరం
మేము అందించే ఆశిస్సులతో నీవు ఎక్కాలి ఉన్నత శిఖరం

నీకు ఈ  సంవత్సరంలో ఖచ్చితంగా గ్రహించి ఉంటావు ఒక లోటు
కానీ గ్రహించు ప్రసాద్ తాతది ఎప్పుడూ మన మనసుల్లో చేరిగిపోని మరచిపోలేని చోటు
 

నాకు ఎల్లపుడూ నచ్చేది  ఎప్పుడూ కనిపించే నీలోని ప్రశాతంత
ఆ లక్షణమే  ఉంచుతుంది విజయం ఎప్పుడూ నీ చెంత


ఎల్లపుడూ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యములతో సుఖ సంతోషాలతో వర్ధిలాలి అని ఆశిస్తూ

పుట్టినరోజు శుభాకాంక్షలతో

నీ పెద్దనాన్న
సునిల్

Monday, October 8, 2018

వైభవంగా జరగనున్న బతుకమ్మ పండుగ


వైభవంగా జరిగిన బతుకమ్మ పండుగ 

బతుకమ్మలతొ ముస్తాబు అయ్యాయి తెలంగాణ లొని ప్రతి ఊరు
గుర్తు తెచ్చాయి చిన్ననాటి జ్ఞాపకాలు మరొ మారు 

అంగ రంగ వైభవంగా జరిగింది తెలంగాణ బతుకమ్మ
చల్లగ చూడాలి మమ్మల్ని అని, ప్రజల పూజలు అందుకుంది అమ్మ గౌరమ్మ

తమ కష్టాలను తొలగించి సాఫిగా తమ జీవితం సాగాలని ప్రతి ఒకరు చేసారు ప్రార్దన
ఆ గౌరమ్మ తల్లిని వేడుకున్నారు వినాలని తమ వేదన 

అమ్మ, జీవితం బతుకమ్మలా రంగుల సువాసనల పూల వలె, అందంగా ఉండాలని దీవించు 
నీ చల్లని ఆశిస్సుల కోసమే చాల భక్తి శ్రద్దలతొ పూజించింది తెలంగాణ ఆడపడుచు 

వివిధ రంగుల, వివిధ సువాసనల పూలతో బతుకమ్మలను చేసారు  అలంకారం 
ప్రతి పేదవాడికి అందుబాటలో ఉండి ఈ పండుగా వారికి కలిగించదు ఎటువంటి భారం 

కలిసినప్పుడు భాదలొ ఉన్న సోదరికి, తొడు ఉన్నవారు ఇచ్చారు అభయం
చేస్తారు ఆ బాధ తొలగించే సాయం

బతుకమ్మలొని వాడే పూలు కలుషితం కాకుండ చూస్తాయి చేరువులొని నీళ్ళు
దీని బట్టి తెలుస్తుంది, ఒక అర్దం ఉంటుంది ఎది చేసిన మన పెద్దవాళ్ళు 

    బతకమ్మ వేడుకల్లొ చాల కమ్మగా వినిపించింది మా ఆడపడుచుల స్వరం
ఘనంగా జరగాలి ఈ పండుగ ప్రతి సంవత్సరం

తెలంగాణ సాంప్రదాయన్నికి ఈ పండుగ ఒక ప్రతీక…..
చూపుతుంది మా ఆడపడుచుల కలయిక 

మన సంప్రదాయలే మన బలం………
                                             వాటిని మనం చేసుకుందాం పదిలం                                                        

 మీ సునిల్ 

Sunday, October 7, 2018

రాజకియాల్లో నర్సింగ్ అన్న



రాజకియాల్లో నర్సింగ్ అన్న

రాజకియంగా ఉండాలి అనుకున్నారు ప్రజలు ఒక తోడు
ఎల్లపుడూ వారికి చేరువలో ఉండే నాయకుడు 


ఉండాలి అనుకున్నారు వారి బాధలు తెలిసిన మనోడు 
ఆ ఆలోచన వచ్చినపుడు అందరికి గుర్తు వచ్చింది నర్సింగన్న చేదోడు

అందుకే తన రాకకు అందరు పలికారు సమ్మతం
చేసారు ఘన స్వాగతం

అందరికి తెలుసు తన సహాయ తత్వం
కావాలి అనుకున్నారు అటువంటి నాయకత్వం

తను నమ్మిన ప్రజల కొరకు నర్సింగ్ అన్న చేసారు తనలోని నాయకుడిని ఆవిష్కరణ
చేయటానికి తన వంతు సహకారం పొందేటందుకు బంగారు తెలంగాణ 

యువకుల్లో ఆనందం నింపింది తన అన్న రాజకీయ ఆరంగేట్రం
వారికి తెలుసు వారి కొరకే ఉండనుంది తన అన్న ప్రతి ప్రయత్నం

అందుకే వేసారు మెగా దరువు
ఫుల్ జొష్ తో నింపారు పటాన్ చేరువు

తన సత్తా చాటనుంది రానున్న ఎన్నికలు
ఖచ్చితంగా తీర్చనుంది ప్రజల కలలు

తనను నమ్మిన ప్రతి ఒకరు ఎప్పటికి ఉంటారు తన వెం
రానున్న ఎన్నికల్లో ఉండనుంది ఓట్ల పంట

తన రాకతో అయ్యింది టి.ఆర్.ఎస్ వైపు గెలుపు స్వింగు
గర్వంగా ప్రాంతం అంతా నిండనుంది గులాబీ రంగు 

తన రాకా మహీపాల్ అన్నకు పెంచింది మరింత బలం
ఎన్నికల గెలుపుతో ఇరువురు రానున్న రోజుల్లో ఎక్కనున్నారు అందలం

రాజకియాలో మన నర్సింగ్ గౌడ్
చేయన్నునాడు మన అందరిని ప్రౌడ్

with wishes, your maama
G.Sunil


Saturday, July 21, 2018

రెండు సంవత్సరాల ఆరాధ్య




రెండు సంవత్సరాల ఆరాధ్య

ఆ..ఆనంద
రా.రాగాల
ధ్య..ధ్యానం

అప్పుడే ఈ నాన్న కుట్టి
రెండు సంవత్సరాలు పూర్తీ అయ్యింది మా జీవితంలో రాబట్టి

సమయం తెలియకుండా గడిపేలా చేసింది తన అల్లరి
మా జీవితంలో ఆనందమయ బంధం ఈ చిన్నారి

మాకు దొరికిన ఒక అద్భుతమైన ముసిముసి నవ్వుల అందమైన ఆత్మీయం
ఆమేతో ప్రతి క్షణం ఎంతో రమణీయం

ప్రవర్తికకు దోరికిన ఒక చేదోడు నేస్తం
వారు ఇరువురు కలిస్తే మరచిపోతారు లోకాన్ని సమస్తం

ఆమేలో కూడా ఉంది గోకర ఆడపడుచు పౌరుషం
ఏమైన అంటే సహించదు ఒక నిమిషం

ఇక చూడాలి మా ఇద్దరి బుజ్జగింపు
కూల్ అయ్యాక మళ్ళీ చేస్తుంది తన చిరు నవ్వుల ప్రేమను కొనసాగింపు

ఆమే స్వరం మనకి అందని ఊహలు
ఆశ్చర్యం కలగ తప్పదు పాట తగ్గ ఆమే తీసే రాగాలు

తప్పక ఈ గాన కోకిల
ఆశిస్తున్నాం అవుతుందని మా అందరి గర్వపడే మేరిసే జ్వాల

ఆమే మాటలు మా అందరికి ముద్దు
ఆమేతో సరదాగా గడపనిదే మాకు పోదు పొద్దు

మా జీవితంలో వచ్చినపటినుంచి ఈ అమ్మడు
సరదా వీడియోలతో చేస్తున్నాం కుమ్ముడు

మా ఇరువురి కుమార్తలు చూపే మమతలు
మరిచేలా చేస్తాయి జీవితం ఎటువంటైన కలతలు

కూతుర్లతో గడిపినా ప్రతి క్షణం ఎంతో రమ్యం
ఈ జీవితానికి చాలు చేర్చగలిగితే వారి ఇరువురిని వారి జీవిత గమ్యం

జి.సునిల్

Friday, June 29, 2018

మిస్ యు బ్రదర్

మిస్ యు బ్రదర్ 

నీవు లేవనే వార్త వినగానే తమ్ముడు
నిజంగా అనిపించింది ఉన్నాడా ఆ దేవుడు

ఇంత కష్టపడిన నీకు చేస్తాడు అనుకున్నాం సాయం
కలలో కూడా అనుకోలేదు చేస్తాడు ఇంతటి అన్యాయం

నీ పోరాట పటిమ చూసి అనుకున్నాం అవుతావు విజేత
కాని ఆ దేవుడు తన కఠొర హృదయంతో పాటించమన్నాడు విది రాత

నీ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టింది మాతృత్వం
చివరికి ఆ త్యాగానికి  లేకుండా చేసాడు ఆ దేవుడు ఫలితం

ఈ వయస్సులో ఆసర అవుతావు అనుకున్నాడు బాబాయి
ఇప్పుడు తట్టుకోలేకున్నాడు బాధ, లేనందుకు ఇక తన సహయపడే ఒక చేయి

నిజంగా జోహార్లు పలకాలి నీ సహదర్మచారిణికి
భూమి కూడా తల వంచక తప్పుదు ఆమే సహనానికి


అనుకున్నది నువ్వు ఉంటే చాలు
ఆమే కష్టానికి ఫలితం దొరికితే నిజంగా ఉండేది ఎంతో మేలు


ఎల్లపూడూ నువ్వు కోలుకోవాలని శ్రమించారు తోబుట్టువులు
ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకొని నయం అవ్వాలని ప్రార్ధించారు బందువులు

 అర్దం అవ్వటం లేదు ఎందుకు వినలేదు ఇందరి గోడు
విని ఉంటే నిజంగా ఎంత బాగుండేదో నేడు

అనిపిస్తుంది నిన్ను తన దెగ్గరికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు చూపాడు తన స్వార్దం
మంచి వాడివేన నిన్ను తన దెగ్గర ఉంచుకోవాలని మా అందరికి మిగిల్చాడు ఈ అనర్దం

మేము అనుకున్నం నీ ఉద్యోగంలో చేరుతావు ఉన్నత స్తితి
కాని అనుకోలేదు చూడవలసి వస్తుందని నీ చితి

మాకు ఎప్పుడూ మనస్సులో గుర్తు ఉంటుంది నీ నిస్వార్థ చిరు నవ్వు
ఎవరూ మరిపించలేరు నువ్వు చూపిన  అందరిపై ఆప్యాయమైన లవ్వు

మిస్ అవుతాం నీ సవాసం
ఆత్మ సాంతి చేకూర్చాలని దేవుడిని కోరుతాం నీ కోసం

జి.సునిల్ 

Sunday, May 13, 2018

భరత్ లాంటి సి.యం దోరికితే

భరత్ లాంటి సి.యం దోరికితే

మొదలుపెడుతాడు ప్రజలకు మేలు చేసే నూతన శకం
చూపుతాడు ప్రజలకు కొత్త బంగారు లోకం

ఒక సారి చేసాడంటే ప్రామిస్
తన ప్రాణం పోయిన అవ్వనివ్వడు అది ప్రజలకు మిస్

చేస్తాడు ప్రతి ఫనిని అంత:కరణ శుద్దితో
ప్రతి పని నడుస్తాడు ప్రజా హితం అనే ఆలోచనతో

అవ్వుతారు ప్రజలు బాధ్యత కలిగిన పౌరులు
వేసుకోగలుగుతారు ప్రజలు తమ హితం చూపే దారులు


ప్రజలకు ఉండదు అంధకారం
ప్రజలకి ఇస్తాడు అధికారం

అభివృద్ది ప్రతి ఒకరి దెగ్గర చేరు
సిరుల నేల అవుతుంది పల్లేటూరు 

బలహీనులకు నింపుతాడు ఉత్తేజం
సహాయం ఇస్తాడు వారి కలలను చేసేటందుకు నిజం

ప్రజల చిరునవ్వుకి అవుతాడు కారకుడు
పాలకుడి కంటే అవుతాడు ప్రజల సేవకుడు

అతను అవ్వుతాడు ప్రజలు మెచ్చే నాయకుడు
నిజంగా ప్రజల అదృష్టం దోరికితే అటువంటి జాతకుడు

అటువంటి నాయకుడిని ప్రజలే కాపాడుకుంటారు దెగ్గరుండి
కట్టుకుంటారు తమ గుండేల్లొ వారి శ్రేయస్సు కోరే దేవుడికి గుడి 


ప్రజలు ఎప్పుడూ ఆశాజీవి
ఆశిద్దాం  ప్రస్తుత ప్రతీ నాయకుడు అవ్వాలని భరత్ లా ప్రజల ప్రేమి

జి.సునిల్

Friday, May 11, 2018

మళ్ళీ అంటున్న చలో వరంగల్


మళ్ళీ అంటున్న చలో వరంగల్

వస్తుందంటే వరంగల్ చేరుగా
కలుగుతుంది నా మనస్సు పట్టలేని హాయిగా

చెయలేను మనసును ఏ మాత్రం నియంత్రణ
ఎందుకంటే ఈ క్షణం కోసం చేస్తా వారమంత నిరీక్షణ 
 
అక్కడ కలవబోతున్నా నా బంగారాలు
చూడ కలుగుతా వారు నాన్న కోసం చూపే ఆనందమయ నవ్వుళ్ళు

పెద్ద అమ్మాయితో షికార్లు
చిన్న పాపతో కబుర్లు

గడిచిపోతుంది రోజు ఒక క్షణంలా
తిరుగు ప్రయాణం ఆలోచనతో పడుతుంది మనసు డీలా  

కాని వెళ్తా మధుర జ్ఞాపకాలు మోస్తూ
మళ్ళీ వచ్చే సండే కోసం ఎదురు చూస్తూ 


మళ్ళీ అంటాకి కారణం, ఇంతకు ముందు ఒక సంవత్సరం గడిపా అలా చలో వరంగల్  అంటు, అప్పటి జ్ఞాపాకాలు కిందవి

https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post_30.html

https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post.html




        https://sunil-megafan.blogspot.in/2016/05/blog-post.html



జి.సునిల్ 

Friday, March 30, 2018

రంజింపచేసిన రంగస్థలం


రంజింపచేసిన రంగస్థలం

వారేవ్వా చిట్టిబాబు
నీ నటన లా జవాబు

తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు
మన మెగా వారసుడు

చూసాం మెగా పవర్ స్టార్ నట విశ్వరూపం
ప్రతి సన్నివేశం ఎంతో అపురూపం

చూపించాడు తన నటనలోని Variations
మించాడు అందరి Expectations
  
80వ దశకంలోకి తీసుకోని వెళ్తుంది సినిమా రంగస్థలం
ప్రతి ఒకరి అద్భుత నటన ఈ సినిమా బలం

పక్కా పల్లేటూరు వాతావరణంలోకి తీసుకోని వెళ్తాడు దర్శకుడు సుక్కు
చేసాడు ప్రతి ఒకరి నుండి మైమరిపించే నటన రాబట్టే మ్యాజిక్కు

రామలక్ష్మీగా అలరిస్తుంది సాం
లవ్లీ నటనతో తేచ్చుకుంటుంది బహూత్ నాం

విలనిజం పతాకస్థాయిలో చూపుతాడు మన జగపతి
హీరో వల్లే తెలుస్తుంది తన పేరు ఫణీంధ్ర భూపతి

రంగమత్తలా వచ్చి అనసూయ చూపింది తన నటన స్థాయి
మన హీరోతో తన ప్రతి సీన్ కలిగిస్తుంది ఎంతో హాయి

ప్రతి పాట ఎంతో చూడ చక్కగ ఉన్నది
ఆ క్రేడిట్ అంతా మన మెగా మ్యూజిక్ డైరక్టర్ దేవీది  
      
ఆది పినిశేట్టి, అన్న పాత్రలో అవ్వాలనుకుంటాడు ఊరికి నాయకుడు     
తనను కనురెప్పల కాపాడు కోవటానికి ప్రయత్నిస్తాడు మన చిట్టిబాబు లక్ష్మణుడు     

చాలా ప్రయత్నించిన కూడా తన అన్నను కోల్పోతాడు    
తన అన్న చావుకు కారణం అయిన వాళ్ళా అంతు చూస్తాడు

ఈ సినిమా ఫార్ములాకు అతీతం
అద్భుతమైన విజయం ప్రతి ఒకరి కష్ట ఫలితం
 
విభిన్నమైన కధలకు ఈ సినిమా తీసింది డోర్
ఈ లాంటి సినిమాలను కోరుకుంటున్నారు ప్రతి తెలుగు ప్రేక్షకుడు మోర్

ఇలాంటి సినిమాలు వస్తే ఆదరణ పెంచుకుంటుంది వెండితెర
మెగా అభిమానులకి ఈ సినిమా  ఒక మెగా పండుగ జాతర

జి.సునిల్
మెగా ఫ్యాన్

Saturday, March 17, 2018

అన్నప్రాసన ఆహ్వానం



అన్నప్రాసన ఆహ్వానం


నూతన సంవత్సరం నాడు పలికాం మా గోకర వారి ఆహ్వానం
మీ ఆత్మియ హృదయాలతో నిండాలని మా మేడిపల్లి నివాస ప్రాంగణం


అక్కడ వేచి ఉన్నది మా హిమశ్రీ చిన్నారి
మీ ప్రేమమయ ఆశిర్వాదం కోరి

మీ సమక్షంలో చేసుకోవాలి అనుకుంటున్నది తన అన్న ప్రాసన మహోత్సవం
తనకు ఉండదు మీ రాకను మించిన ఆనందం

తన జీవితంలో జరగనుంది ఒక ముఖ్యమైన పండుగా
మీ రాకతో అవుతుంది కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా

తను ఆన్నపూర్ణమ్మ కృపతో ఆన్నం ముట్టే సమయం
మీ రాకతో తన జీవితంలో ఎప్పుడూ ఆష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటుంది ఆ చిన్ని హృదయం   
   
అందుకోండి పెద్ద పండుగ నాడు ఈ చిరు ప్రాయంలో అందిస్తున్న పెద్ద స్వాగతం
మీ ఆశిర్వాదంతో కోరుకుంటున్నది తన జీవితంలోని ప్రతి అడుగులో జయం

మీ రాకతో కొంచమైన తీర్చుకోవాలని అనుకుంటున్నది ప్రసాద్ తాత లేని లోటు
రాకుండ చేయకండి పసి హౄదాయాన్ని గాయ పరిచే పోరపాటు

మీ సమక్షంలో ఆన్నం ముట్టించటం
అనుకోండి మా చిన్నారికి జీవితంలో కావాల్సిన ప్రతిది అందిచటం


మీ రాకకై
రవి  సుచిత్ర

Sunday, February 25, 2018

అతిలోక సుందరి



అతిలోక సుందరి 

స్వర్గం నుంచి వచ్చి నేడు స్వర్గానికి వెళ్ళారు మన అభిమాన శ్రీదేవి

ఓదార్చలేని బాధలో మునిగిపోయారు ప్రతి సిని అభిమాన జీవి 


నిజంగానే బ్రహ్మ దేవుడు మన కొంప ముంచాడు 

లేక పోతే షాకింగ్ న్యూస్ తో నిద్ర లేపాడు నేడు


ఆమే మనకు దొరికిన ఎప్పటికి మన మనుసుల్లో నిలిచే వజ్రం
అలాంటి నటి మళ్ళీ మనం చూడలేం అనేది నిజం

 

ఆమే మనకు దొరికిన అందాల ఏంజిల్
మనను అలరింప చేసింది అమే నటనలోని ప్రతి యాంగిల్

 

అందంతో పాటు అమేది ఎవరిని నొపించని గుణం
ఆమే జీవితం, నటనతో సాగింది క్షణం-క్షణం 

 

మనతో పాటు, బాలివూడ్ ని కూడా ఏలింది మన చాందిని
అందూకే యావత్ దేశం బాధ పడుతుంది ఆమే మరణ వార్త విని
 

ఆమే ప్రతి ఒకరి హృదాయలను దోచుకున్న అతిలోక సుందరి
అందరికి స్పూర్తిదాయకం ఆమే అనుసరించిన జీవితంలోని ప్రతి దారి

 

ఆమే పిల్లలకు ఉండాలనుకుంది బంగారు భవిష్యత్తు
ఫలించకుండాపోయింది ఆమే ప్రారంబించిన కసరత్తు

 

ఎంతో కష్టపడి జయించింది జీవితంలోని ప్రతి వార్
అందుకే అయింది సినిమా లోకం ఏలిన ఎకైక సూపర్ స్టార్

 

నమ్మలేని నిజం మనకు ఇక లేరని మన మకుటం లేని మహారాణి
ఎప్పటికి మన మనసుల్లో ఉంటుంది "అచ్చిక బుచ్చిక" అని పలికిన కమ్మనైన వాణి

 

ఆమే ఎప్పటికి మన మనసుల్లో నిలిచే అందమైన జ్యోతి
కోరుకుందాం దేవుడిని అందివాలని ఆమే ఆత్మకు శాంతి

 

జి.సునిల్