Wednesday, March 9, 2022

థాంక్యూ కేసీఆర్ సార్

 థాంక్యూ కేసీఆర్ సార్


తన పట్టుదలతో  చేకూర్చారు తెలంగాణకు జలం

అయ్యారు తెలంగాణకు కొండంత బలం

 

2022 మార్చ్ తొమ్మిది

కేసీఆర్ గారి ప్రకటన దోచింది ప్రతి నిరుద్యోగి మది

 

ఉద్యోగాలకు తెరుచుకుంది తెర

ఎవరూ ఊహించని ఈ కొలవుల జాతర

 

కేసీఆర్ గారు చేసారు ఈ కసరత్తు

పోందుపర్చాలని వారికి బంగారు భవిష్యత్తు

 

లెక్కచేయలేదు పడినా రాష్ట్ర ఖజానాపైన భారం

చేకుర్చాలనుకున్నారు 91,142 కుటుంబాలకి జీవనాధారం

 

ఫలించింది నిరుద్యోగుల నిరీక్షణ

ఇక, ప్రతి ఒక్క నిరుద్యోగి జాబ్ తెచ్చుకునేందుకు చేయాలి కార్యాచరణ

 

తెలంగాణ అభివృద్దిలో వీరు అవ్వనున్నారు భాగం

తెలంగాణ ప్రగతి పొందనుంది మరింత వేగం

 

పొందినందుకు ఈ వరాలు

తెలంగాణ నిరుద్యోగులు చేసుకున్నారు సంబురాలు

 

మన తెలంగాణకు కేసీఆర్ సారు

మన ప్రతి కలను తీర్చే స్టారు

 


జి.సునిల్