Friday, March 30, 2018

రంజింపచేసిన రంగస్థలం


రంజింపచేసిన రంగస్థలం

వారేవ్వా చిట్టిబాబు
నీ నటన లా జవాబు

తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు
మన మెగా వారసుడు

చూసాం మెగా పవర్ స్టార్ నట విశ్వరూపం
ప్రతి సన్నివేశం ఎంతో అపురూపం

చూపించాడు తన నటనలోని Variations
మించాడు అందరి Expectations
  
80వ దశకంలోకి తీసుకోని వెళ్తుంది సినిమా రంగస్థలం
ప్రతి ఒకరి అద్భుత నటన ఈ సినిమా బలం

పక్కా పల్లేటూరు వాతావరణంలోకి తీసుకోని వెళ్తాడు దర్శకుడు సుక్కు
చేసాడు ప్రతి ఒకరి నుండి మైమరిపించే నటన రాబట్టే మ్యాజిక్కు

రామలక్ష్మీగా అలరిస్తుంది సాం
లవ్లీ నటనతో తేచ్చుకుంటుంది బహూత్ నాం

విలనిజం పతాకస్థాయిలో చూపుతాడు మన జగపతి
హీరో వల్లే తెలుస్తుంది తన పేరు ఫణీంధ్ర భూపతి

రంగమత్తలా వచ్చి అనసూయ చూపింది తన నటన స్థాయి
మన హీరోతో తన ప్రతి సీన్ కలిగిస్తుంది ఎంతో హాయి

ప్రతి పాట ఎంతో చూడ చక్కగ ఉన్నది
ఆ క్రేడిట్ అంతా మన మెగా మ్యూజిక్ డైరక్టర్ దేవీది  
      
ఆది పినిశేట్టి, అన్న పాత్రలో అవ్వాలనుకుంటాడు ఊరికి నాయకుడు     
తనను కనురెప్పల కాపాడు కోవటానికి ప్రయత్నిస్తాడు మన చిట్టిబాబు లక్ష్మణుడు     

చాలా ప్రయత్నించిన కూడా తన అన్నను కోల్పోతాడు    
తన అన్న చావుకు కారణం అయిన వాళ్ళా అంతు చూస్తాడు

ఈ సినిమా ఫార్ములాకు అతీతం
అద్భుతమైన విజయం ప్రతి ఒకరి కష్ట ఫలితం
 
విభిన్నమైన కధలకు ఈ సినిమా తీసింది డోర్
ఈ లాంటి సినిమాలను కోరుకుంటున్నారు ప్రతి తెలుగు ప్రేక్షకుడు మోర్

ఇలాంటి సినిమాలు వస్తే ఆదరణ పెంచుకుంటుంది వెండితెర
మెగా అభిమానులకి ఈ సినిమా  ఒక మెగా పండుగ జాతర

జి.సునిల్
మెగా ఫ్యాన్

Saturday, March 17, 2018

అన్నప్రాసన ఆహ్వానం



అన్నప్రాసన ఆహ్వానం


నూతన సంవత్సరం నాడు పలికాం మా గోకర వారి ఆహ్వానం
మీ ఆత్మియ హృదయాలతో నిండాలని మా మేడిపల్లి నివాస ప్రాంగణం


అక్కడ వేచి ఉన్నది మా హిమశ్రీ చిన్నారి
మీ ప్రేమమయ ఆశిర్వాదం కోరి

మీ సమక్షంలో చేసుకోవాలి అనుకుంటున్నది తన అన్న ప్రాసన మహోత్సవం
తనకు ఉండదు మీ రాకను మించిన ఆనందం

తన జీవితంలో జరగనుంది ఒక ముఖ్యమైన పండుగా
మీ రాకతో అవుతుంది కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా

తను ఆన్నపూర్ణమ్మ కృపతో ఆన్నం ముట్టే సమయం
మీ రాకతో తన జీవితంలో ఎప్పుడూ ఆష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటుంది ఆ చిన్ని హృదయం   
   
అందుకోండి పెద్ద పండుగ నాడు ఈ చిరు ప్రాయంలో అందిస్తున్న పెద్ద స్వాగతం
మీ ఆశిర్వాదంతో కోరుకుంటున్నది తన జీవితంలోని ప్రతి అడుగులో జయం

మీ రాకతో కొంచమైన తీర్చుకోవాలని అనుకుంటున్నది ప్రసాద్ తాత లేని లోటు
రాకుండ చేయకండి పసి హౄదాయాన్ని గాయ పరిచే పోరపాటు

మీ సమక్షంలో ఆన్నం ముట్టించటం
అనుకోండి మా చిన్నారికి జీవితంలో కావాల్సిన ప్రతిది అందిచటం


మీ రాకకై
రవి  సుచిత్ర