Sunday, December 3, 2017

కూతుర్ల సందడి






కూతుర్ల సందడి



మోన్నటి వరకు అలరించాయి హని కేరింతలు
ఇప్పుడు ఆరు (Aaradhya) రాకతో అవి అయ్యాయి రెండు ఇంతలు 
    
ఒక పక్క ప్రవర్తిక హుషారు
మరో పక్క కెరింతలతో ఆరు

ఇరువురు వళ్ళ ఇల్లు అయ్యింది అల్లరి కోలాహలం
మాకు ఆనందం అందించే కోండంత బలం

ప్రేమ వాత్సల్యం ఉంది వారి మాటల్లొ
వారి ప్రతి పలుకులు పరవల్లు ప్రాయం అవుతుంది మా గుండలోతుల్లొ

నాన్న నాన్న అంటు ఆకట్టుకుంటుంది చిన్నది
ఆమే ప్రేమ పలుకులు వర్ణించటానికి చాలవు మాటలు పరిది

చక్కటి బొమ్మలతో చూపిస్తున్నది హని తన నైపుణ్యం
కోరుకుంటున్న ఇలానే కొనసాగించాలి తన ప్రావిణ్యం

పాట వస్తే స్టెప్పులతొ మోతమోగిస్తున్నాం మా త్రయం
మంజుల వళ్ళ అవటం లేదు తట్టుకోవటం ఈ గోల మయం
 
చాల అణ్యోయంగా ఉంటున్నారు అక్కాచెల్లెళ్లు  
వారి ప్రేమ వర్ణించటానికి రావటం లేదు మాటలు



కోనసాగించాలి కోరుకుంటున్న వారి చురుకు
దేవుడిని కోరుకుంటున్నా వాళ్ళకి కావలసిన సమకుర్చే శక్తి ఇవ్వమని మాకు



తీర్చ కలిగితే వారి ఆశలు
ఈ జన్మకి అదే చాలు



జి.సునిల్

Thursday, October 5, 2017

ప్రేమ మూర్తి మా అమ్మమ

ప్రేమ మూర్తి మా అమ్మమ


 కేసముద్రం వెళ్తున్నాం అంటే ఎప్పుడూ కలిగేది మాకు చెప్పలేని ఆనందం
అక్కడ దొరికేది మా అమ్మమ మరియు మా అమ్మ తోబుట్టువులు అభిమానం
మా అమ్మమ పేరు అనసూర్య
అందరు బాగుండాలి అని ఆలొచిస్తుంది తను ప్రతి ఘడియ

ఆమే మా మల్లేశం తాతకు దొరికిన బంగారు దీపిక
ఎవరికి లేదు ఆమేకు ఉన్న అంత ఓపిక

మా తాత ఏలాడంటే సారా సామ్రాజ్యం
అందుకు కారణం వెనుక ఉండి మా అమ్మమ ఇచ్చిన దైర్యం 
 
ఒక పక్క అందరికి అందించేది మురిపాలు
మరో పక్క వంటి చేత్తో నడిపించేది ఇంటి కార్యకలపాలు

అమేకు ఉండేది భూదేవికి ఉండే సహనం
ఆ ఓర్పు వల్లే సాఫిగా సాగింది అంత పిల్లలతో కూడ జీవనం
  
ఎంత పని చేసిన మా అమ్మమ శ్రమ అని అనుకోలేదు ఏ నిమిషం
అమే శ్రమను మరిపించేలా చేసేది తన పిల్లలు పొందే సంతోషం

అండగా నిలిచింది ఎప్పుడైన తన పిల్లలు పడుతుంటే పాట్లు
వేసింది తన పిల్లలు పైకి ఎదగటానికి మెట్లు
ఆమే వల్లే ఇల్లు అయ్యింది ఆనందాల హరివిల్లు
ఆమే వల్లే ఇంట్లో ఎప్పుడూ ఉండేది సిరిజల్లు

ఎప్పుడూ మా అమ్మమది ప్రేమ అందించే మనస్తత్వం
అందుకే వారి పిల్లలు కూడ అంది పుచ్చుకున్నరు ఆ ప్రేమ అందించే వారసత్వం

పరిపూర్ణ మాతృమూర్తికి మా అమ్మమ ప్రతీక
అమేతో మేము గడిపిన ప్రతి క్షణం మా అందరి జీవితంలొ ఒక మధుర జ్ఞాపిక 

మా అందరి అదృష్టం దొరికినందుకు తన బందనం
అమే అందించిన ప్రేమకు వహిస్తున్నాం సిరస్సు వంచి వందనం

జి.సునిల్

Saturday, August 12, 2017

గుండెల్లో అలజడి


గుండెల్లో అలజడి

లేదు ఇంట్లొ నా కుతుర్ల హడవుడి
గుండెల్లొ మొదలు అయ్యింది అలజడి

మనసు అంటుంది చల్
పరుగులు తీయి వరంగల్

కాని వెళ్ళకుండ చేసింది వృత్తి పరిమితి 
ఇధే విధి ఆడే వింత పరిస్థితి

కనబడుట లేదు డ్యాన్స్ చేసే ప్రవర్తిక 
మళ్ళీ వచ్చే అంత వరకు ఇంట్లో సందడి లేదు ఇక  

నాన్న నాన్న అంటుందంట చిన్న సుందరి
మిస్ అవుతున్నా మా రోజు వారి సంగితపు కచేరి

ఇంక రోండు రోజులు 
చూడాలంటే నా ప్రేమ కలిగిన అల్లరి అమ్మాయిలు 

ఘనంగా చేసుకోబోతున్నాం  మన పంద్ర ఆగష్ట్ మహోత్సవము
ఆ రోజు  కలగనుంది ఈ బాధ నుంచి నాకు కూడ స్వాతంత్ర్యము   

జి.సునిల్  

Saturday, July 22, 2017

ఆత్మియ బంధము "మా ఆరాధ్య"



ఆత్మియ బంధము "మా ఆరాధ్య"

మా జీవితంలోకి ప్రవేశించింది ఆరాధ్య
తన అక్క లాగా మాకు ఆనందంతొ చేసింది మరింత సయోధ్య

అప్పుడే ఒక సంవత్సరం పూర్తి అయ్యిందా అని కలుగుతుంది మాకు ఆశ్చర్యము 
అలా మమ్మల్ని మైమరిపించేలా చేసింది తన ప్రేమతోకూడిన స్వరము  
 
పొందింది తన అక్కతో పాటు సమానమైన స్థానము
ఎంతో ప్రేమతో ఉంటుంది తను చూపే ఆత్మియము

ఆరాధ్య ఆఫిస్ నుంచి వచ్చే నాకు ఇస్తుంది హార్దిక స్వాగతము
తన చిరు నవ్వు చూసిన వెంటనే నా భాదలు అవుతాయి అంతము

తను మాకు దొరికిన గాన కోకిల
రోజు మా ఇంట్లొ వినిపిస్తుంది సంగితపు గల గల

తన అక్కతో పోల్చుకుంటే చాలా విషయాల్లో తను చూపుతుంది మోనము
అలా అని అనుకునేలోపలే కొన్ని విషయాల్లో నేగ్గించుకుంటుంది తన పంతము

ఇంట్లో ఎక్కడ చూసిన కనిపిస్తుంది తన ఆందించే ఆనందపూ ప్రవాహము
మమ్మల్ని ఎంతో ఉత్తేజ పరుస్తుంది తను చూపే ఉత్సాహము

తన అక్కకి తన చెల్లి అంటే చాల ఇష్టము
ఒకరికోకరు మంచి స్నేహితులు అవుతారు అనేది చాల స్పష్టము


ఇంట్లో పాట మోదలు అయ్యింది అంటే స్టార్ట్ అవుతాయి మా ముగ్గిరి స్టెప్పులు
మా ముగ్గిరి గోలతో తప్పవు మంజులకి తిప్పలు 


మాకు దొరికిన ఇరువురు కూమార్తేలు
మాకు రెండు కనులు


ఎంతో ఆనందంతో చేసాము మా జీవితంలో ఇరువురిని ఆహ్వానము
ఆశిస్తున్నాము వారు జీవితంలో ప్రతి విషయంలో పొందితారు విజయ మార్గము


మా అదృష్టం మాకు దొరికిన ఈ ఇరువురి బంధము
మాకు ఒకటే కోరిక వారి జీవితంలో ఎప్పుడూ అవ్వాలి ఆనందం శాశ్వతము


ఈ రోజు తనను ఆశిర్వదించిన ప్రతి ఒకరికి దన్యవాదము
మీ ప్రతి ఒకరి దీవేనలు అవ్వాలి తన జీవితంకి కోడంత బలము


జి.సునిల్

Sunday, June 25, 2017

రైతు సంక్షేమ నేత కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు (Written on request of my colleague)

 రైతు సంక్షేమ నేత కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు

కెసిఆర్ గారు రైతుల గురించి ఆలోచిస్తారు అనునిత్యం
ఇది మన అందరికి తెలిసిన సత్యం

కెసిఆర్ గారికి ప్రాణం రైతన్న
వారికి అందివాలి అనుకున్నారు ఎల్లప్పుడూ రైతులకు అభయంగా ఉండే అన్న

వారు ఎంచుకున్నారు కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారి లాంటి రైతు ప్రేమి
రైతు కష్టాలు తీర్చే వారి రాకతో ఆనందంతొ ఉప్పోంగిపొతుంది తెలంగాణ భూమి 

ఎంతో నమ్మకంతో వారికి ఈ బాధ్యతలు ఇచ్చారు మన తెలంగాణ రధసారధి
కెసిఆర్ గారికి నమ్మకం వారు ఖచ్చితంగా అవుతారు ప్రభుత్వాని రైతులకు మధ్య నమ్మకమైన వారధి

ఉద్యమనేతకు  ఇచ్చారు కెసిఆర్ గారు సముచిత స్థానం
కష్ట పడ్డ ప్రతి ఒకరిని కెసీర్ గారు మరువరు అనటానికి మరొక్క నిదర్శనం  
 
22 సంవత్సరాలు అందించారు సహకార సంఘం అధ్యక్షుడిగా సేవలు
ప్రతి నిమిషం శ్రమించారు రైతు మొఖంలొ చూడటానికి చిరునవ్వులు 
 
కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు రైతు సమస్యలు తెలిసిన రైతు బిడ్డ
ఎప్పుడూ కొరుకుంటారు పసిడి పంటలతో ఉండాలని తెలంగాణ గడ్డ

ఎల్లప్పుడూ కోరుకుంటారు రైతు సంక్షేమం
రైతు కళ్ళలో ఆనందం చూడటమే వారి జీవిత ద్యేయం   

మీ నాయకత్వం లొ రావాలి రైతు కష్టాలను పరిష్కరించే దారులు
రైతులు పండించాలి సిరులు 

బంగారు తెలంగాణ  ఆ మహా నేత లక్ష్యం
మీ లాంటి నాయకుల సహకారంతొ త్వరగా మన ముందు అవ్వాలి ప్రత్యక్షం  

మీపై నమ్మకంతొ కెసిఆర్ గారు అందించారు ఈ మహోన్నతమైన బాధ్యత
కోరుకుంటున్నాం రైతు కష్టాలు తీర్చిఅవ్వాలి  మీరు  విజేత

మీ రాకతొ మారలి రైతుల తలరాత
సుఖంగా ఉండాలి మన తెలంగాణ అన్నదాత

అందుకోండి మా అందరి హృదయ పూర్వక శుభాకాంక్షలు
రైతు సంక్షేమం చేసి అందుకోండి  వారి చల్లని ఆశిస్సులు  


ఇట్లు
మీ శ్రేయోభిలాషులు

Tuesday, April 4, 2017

మా పెదన్న సోంతిల్లు....ఆనందాల హరివిల్లు


మా పెదన్న సోంతిల్లు....ఆనందాల హరివిల్లు
సొంత ఇంటి గురించి ప్రతి ఒకరు కంటారు ఎన్నో కలలు
 రోజు  కలను నిజం చేసుకుంటున్న మా చంద్రన్నకు మా హృదయపూర్వక అభినందనలు
  
చిన్నపట్టి నుంచి పడ్డాడు ఎంతో శ్రమ
కాని ఎప్పుడూ తనలొ ఉంచుకున్నాడు తను విజయం సాదిస్తా అనే ధీమ
 కల  శ్రమ, ధీమ ఫలితం
సంతోషంగా ఉంది మా మనసున్న పెద్దన్నకు అయిన్నందుకు  మధుర క్షణాలు అంకితం
తనకు తోడయ్యింది కుటుంబ సభ్యుల సహకారం
 తోడు అయ్యేటట్టు చేసింది  కలను సాకారం
పాత ఇంట్లోనే తన పెద్ద కోడుక్కి మా పెద్దనాన్న పెద్దమ్మ వేశారు  అడుగులు
ఇప్పుడు  గృహప్రవేశంతో చేందుతుంది వారి మనసులు ఆనందంతో పరుగులు
మా అన్నకు దేవుడు జత చేసాడు అర్దం చేసుకునే రాధిక వదిన జోడు
చాలా అండగా నిలిచింది మా అన్నకు తన తోడు
అన్నకు దొరికాడు ఎప్పుడూ అండగ నిలిచే సోదరుడు
తన విజయానికి మరోక్క కారకుడు

అన్నకు కుతుర్ల రూపంలో ఎప్పుడో దొరికింది లక్ష్మి దేవి కటాక్షం
అందుకే నేడు తన కల కళ్ళ ముందు అయ్యింది ప్రత్యక్షం
తనకు దొరికాడు బావ వెన్నట్టు ఉండే బావమరిది
అందరి సహకారంతో, శ్రేయోభిలాషుల ఆశిస్సులతో  ముఖ్య గట్టంలొ అయ్యాడు విజయసారధి
అన్న,  లక్ష్యాన్ని పొందావు ఎంతో ప్రణాలిక బద్దంగా
మా అందరికి నమ్మకం ఉంది నువ్వు సాదిస్తావ్ నీ మిగిత జీవిత లక్షాలను ఎంతో అవలీలగా
క్రమబద్ధ జీవితానికి తను మారు పేరు

కోరుకుంటున్న  దేవుడునిని చేయాలని తనకు ప్రతి కల యొక్క విజయాన్ని ఖరారు


అభినందలనతో

నీ సోదరుడు
సునిల్

Monday, March 6, 2017

ఎన్నడూ మరువలేం మా అమ్మ పుట్టినిల్లు


ఎన్నడూ మరువలేం మా అమ్మ పుట్టినిల్లు

వెళ్తున్నాము అంటే కేసముద్రం
మా మనసు చేందింది ఎంతో ఆనందం

అది మా అమ్మ పుట్టిన్నిల్లు
సెలవల్లో అక్కడికి వెళ్తున్నాం అంటే ఖమ్మంలోనే మోదలు అయ్యేవి మా చిందులు  

అక్కడ నివసిస్తారు మా అమ్మ తోబుట్టువులు  
ఎల్లప్పుడూ మా శ్రేయస్సు కోరే బంధువులు

మా అమ్మ పుట్టినింట్టి పేరు దూశెట్టి
వారి చూపించే ప్రేమ అందరి అనిపిస్తుంది ఎంతో చూడ చక్కట్టి

వెళ్ళాక గడిపిన ప్రతి క్షణం గుర్తుకోచ్చాయి
మదికి కలిగించింది ఎంతో హాయి

మళ్ళీ కళ్ళ ముందు కనిపించింది మా సార సేట్ మల్లేశం తాత సమ్రాజ్యం
అటువంటి హవా నడిపించటం తనకే సాద్యం

మళ్ళీ కనింపించింది మా అనసూయమ్మమ ఓర్పు
అమే సంసారం నడిపించిన తీరులో కనిపిస్తుంది ఎంతో నేర్పు

అక్కడే మేము చూసాం సంప్రదాయ పండుగ హంగులు
మళ్ళీ  మా జీవితంలొ రావు ఆ క్షణాలు

మరో సారి ఉప్పలమ్మ చేసింది మా అందరి కలయిక
అలానే ఆనందంగా జరిగింది పుట్టిన రోజుల వేడుక

చిన్నప్పుడు అత్తలు, బావమరుదులు  మమ్మల్ని అనే పదం "పడకు సిగ్గు"
మొత్తానికి మేము చేసాం ఆ మాటకు బ్రేకు
 
చాలా రోజుల తర్వాత జరిగిన ఈ కలయిక మా అందరికి ప్రత్యేకం
ఆలరించింది ఆనందంతో సాగిన నాట్యం

బావలను ప్రసన్నం చేసుకోటానికి చాల కష్ట పడ్డాడు మా రవి బావమరిది
దోచుకున్నాడు మా అందరి మది

యాంత్రిక జీవనంకి బిన్నంగ గడిపిన ఈ రోజు మా మదిని పులకరింప చేసింది
గడిపిన ప్రతి ఒకరికి ఒక తీపి గుర్తు అందించింది

అప్పుడప్పుడు జరగాలని కోరుకుంటున్నా ఇలా అందరిని కలిపే సంబరం
ఇంతే ఆప్యాయంగా ఎల్లప్పూడు సాగాలి మన బందం

జి.సునిల్ 

Monday, January 30, 2017

కొంచెం మధురం కొంచెం భారం



కొంచెం మధురం కొంచెం భారం

వచ్చిందంటే వారాంతం
మనసు చెందుతుంది
కొంచెం మధురం కొంచెం భారం

శనివారం సాయంత్రం ప్రారంభం అవుతుంది వరంగల్ వైపు పరుగు
మనసు తపన పడుతుంది చూడాలని ఇద్దరి కూతుర్ల ఆనందాల వెలుగు

రాత్రి వెల్కం నాన్న , అని చిన్న కూతురు పలకరిస్తుంది
తనకు నిద్ర వచ్చే అంత వరకు తన నవ్వులతో అలరిస్తుంది

తెల్లవారి జామున గుడ్ మార్నింగ్ అంటూ లేపుతుంది పెద్ద కూతురు
మా షెడ్యుల్ ప్రారంభించాలని అని ఇద్దరం అవుతాం దనదన తయ్యారు

ఇద్దరం వెళ్తాం  వరంగల్ లొ ప్రతి వారం కొత్త ఆలయం
కోరుకుంటాం కలిగించాలని మాకు ప్రతి పనిలొ జయం

తర్వాత అవుతుంది షురు
మా ఇద్దరి వరంగల్ లొ ఎదొ ఒక ప్రదేశానికి షికారు

ఇంటికి వచ్చాక కొంచం సమయం హని స్కూల్ కబుర్లు
మరో పక్క సూదీక్షతొ ఆటలు



కొంచం సమయం వినటానికి మంజుల ముచట్లు
తెలపటానికి తను పిల్లతో పడుతున్న పాట్లు

హని, బై నాన్న పలకరింపుతో అవుతా హైదరబాద్ పయనం
రోజంత ఆనందం, వెళ్ళేటపుడు మనసుకు భారంలా వుంటుంది ఆదివారం అనుభవం   

అందుకే కొంచెం మధురం కొంచెం భారం


జి.సునిల్ 


Friday, January 27, 2017

ఆత్మియతతో శతమానం భవతి

ఆత్మియతతో శతమానం భవతి

బంధాలకు దూరం చేస్తున్నది యాంత్రిక జీవనం
ప్రతి ఒకరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మన పెరిగిన వైనం


మన ఎదుగుదలకు కారణం పుణ్య దంపతుల వెన్నుదన్ను
నేడు మన రాక కొరకు వేచి చూస్తుంది వారి కన్ను


మన శ్రేయస్సు కోరకు కష్టపడిన తల్లిద్రండ్రులు
నేడు అంటున్నారు వారు ఉన్నారు అని గ్రహిస్తే చాలు


వారు ఆలోచించు ఉంటే స్వార్దంగా
మనం బ్రతక కలిగేవాలమ ఇంత ఉన్నతంగా?  
  
మన శ్రేయస్సు కోరకే శ్రమించారు వారి ప్రతి జీవన భాగం
నేడు కోరుకుంటున్నారు మన నుంచి కొంత వారిపై అనురాగం 

వారు అడగటం లేదు ఆస్తులు
మన పలుకులతో ఇవ్వమంటున్నారు వారికి మధుర జ్ఞాపకాలు


సమయం లేదు తెలిపితే కారణం
ఉండదు నీ గురించి బ్రతికిన వారిపై అంత కంటే దారుణం

వారికి అందించటం ఆత్మియత 
మన అందరి భాధ్యత

మనం వారి కోరకు కేటాయించగలిగితే కొంచం సమయం
వారి వ్యధ అవుతది మాయం

ఆప్యాయతతొ ఉండాలి ప్రతి లొగిలు
అపుడు ప్రేమతొ ఉంటుంది అన్ని బంధాలు

మన రాకతో కలిగిద్దాం తల్లిదండ్రులకు మరుపురాని అనుభూతి
వారి ప్రేమతొ కూడిన ఆశిస్సులే ప్రతి ఒకరికి అవుతుంది శతమానం భవతి

జి.సునిల్

Wednesday, January 11, 2017

మెగా అభిమానుల మదిని అలరించిన ఖైది



మెగా అభిమానుల మదిని అలరించిన ఖైది 

ఎప్పుడప్పుడా అని నిరీక్షించింది ప్రతి అభిమాని  హృదయం
ఈ రోజు వచ్చింది ఆ మెగా సమయం

తెరపై బాస్ బొమ్మ పడింది
బాక్స్ ఆఫిస్ రికార్డ్స్ తొ మోగింది

వచ్చాడు బాస్ మన కోసం
కొనసాగించాడు బాక్స్ ఆఫిస్ వద్ద తన రాజసం 

డాన్స్ తొ మొదట వచ్చింది రత్తాలు 
బాస్ గ్రేస్ చూసిన అభిమాని అనుకున్నాడు ఈ మనసుకు ఇది చాలు 

అదిరింది బాస్ గ్లామర్
కొనసాగించాడు తన టైమింగ్ ఉన్న హ్యూమర్  

కిక్ ఎక్కే స్టెప్పులతొ వచ్చింది సుందరి
తన అందాలతో అలరించింది కాజల్ మంజరి 

సమాజంలో ఆదిపత్యాన్ని చూపిస్తుంది కార్పోరేట్ 
కాలరాస్తున్నది అన్నదాత ఫేట్  

రైతుల పక్షాన నిలవాలనేది శంకర్ ఆశయం
కార్పోరేట్ దిగ్గజాల ఎదుట లభించదు తనకు జయం

అప్పుడు తన ప్లేస్ లొ  వస్తాడు కత్తి శ్రీను
వినిపించటాని రైతుల టొను 

తెలుపుతాడు సినియర్ సిటిజన్స్ ఎప్పుడూ కాదు సమాజానికి బరువు
తట్టుకోలేరు ఎవరు, వారు చూపిస్తే వారి బాధతో దరువు 

చాటి చోప్తాడు నోప్పులు పడుతున్నది ఊరి తల్లి గర్బం
రైతు కంట నీరు తుడవందే పొందలేం మనం స్వర్గం

వారి భాదలను తీర్చటానికి పడుతాడు ఆరాటం
చేస్తాడు వారి తరుపున పోరాటం 

ఆదురుతుంది తన ఆవేదన తెలిపే మీడియా సమావేశం 
తెలుపుతాడు రైతుల పక్షాణ వారి సందేశం  

వారి పక్షాణ అండగ నిలుస్తాడు ఈ సిం హం
MNC ఆదిపత్యాని చేస్తాడు విద్వంసం 


రౌడిలను కోట్టే సమయంలో ఆలి విసురుతాడు కాయన్  
అప్పుడు పోరాట సన్నివేషాలలొ విజృంభిస్తాడు  మన మెగా లయన్  

అమ్మడు పాటలో అలరిస్తుంది మెగా జోడి 
చేస్తుంది అభిమానులపై స్వీట్ దాడి 

బాస్ ప్రతి సన్నివేశాని అనిపించాడు కిరాక్
బాక్స్ ఆఫిస్ వద్ద చేస్తున్నాడు రికార్డ్స్ ను హైజాక్


బాస్ చేరారు తన దినియ
మళ్ళీ ఈ కళామతల్లి ముద్దు బిడ్డ చూపించనున్నారు తన మెగా మానియ



ఇలాగే తన మెగా వినోదాని తెరపై దంచాలి
బాస్ మాకు మెగా ఆనందాని పంచాలి


B...Box
     O... Office
   S...Super
                           S...Star                          
I....In
   S...Style
       B...Bounces
A...And
         C.. Comeback
K..Keka

ఆశిస్తు
సునిల్ 
మెగా ఫ్యాన్
http:sunil-megafan.blogspot.com 

9848888317 

SMALL HISTORY OF MY POEMS:

1. Wrote first poem in 1998 during my intermediate on boss

2. Wrote poem on boss political entry in 2007 before boss announced

3.More than 50 Poems on Boss Political yaatras and Journey.

4.More than 30 poem on mega family members Films and Functions.

5.My Dream Day with Boss

6. My Participation in Railu Yaatra


7.Poem On Boss Birthday 
  

8. Poem Written on Boss to come back to movies in 2010


9. Against requests for Entry in 2011


10. More than 75 poems on social events and my family members and occasions.