మా గురువు రమణ ....ఒక చెరగని ఆదరణ
వారి బోధనలు
అయ్యాయి మా జీవితానికి కొండంత బలం
ఒత్తిడి లేకుండా
ప్రతి విద్యార్థికి చేరాలనుకున్నారు విద్యా సరస్వతి
ఆ సంకల్పం దిశగా
ఉండేది వారి బోధనా పద్ధతి
మీ బోధన సరళత్వం
మాకు అర్థం
అయ్యేలా చేసింది ప్రతి అంశంలోని అసలైన తత్వం
మాకు ఉత్తేజం
పరిచింది మీరు మాకు చెప్పిన మాటలు
ఆ ఉత్సాహమే మాకు
వేసాయి బంగారు బాటలు
ప్రతి
విద్యార్థిని సమానంగా చూసే గురువు
ఏ విద్యార్థి
అయినా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు మీలా చెప్తే చదువు
మీ బోధన
మార్చింది నిత్య జీవితంలో సమస్యను చూసే విధానం
సమస్య అర్థం
చేసుకుని సాధిస్తున్నాము పరిష్కార సమాధానం
ఎప్పుడూ మరువలేము
మాకు బంగారు బాట ఇచ్చిన మీ శిక్షణ గది
చిరస్థాయిగా
మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది మా మది
మా మనసుల్లో
నిలిచిపోయాయి మీరు రాసిన ప్రతి అక్షరం
మా ఇప్పటి ఉన్నత
స్థితికి మీ చదువే ఆధారం
నిజంగా మీ లాంటి
గురువు దొరకటం మా వరం
మీరు
ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము మేము అందరం

No comments:
Post a Comment