Sunday, September 4, 2016

ఆచార్యదేవోభవ

ఆచార్యదేవోభవ
సంబంధిత చిత్రం

మన జీవితంలో ఎంతో ప్రధానము గురువు
ఎందుకంటే తను ఇస్తాడు మన బంగారు భవిషత్తు అందించే చదువు
 
అందుకే ఆచార్యదేవోభవ అని వర్ణిస్తాం
తల్లి దండ్రుల తరువాత తననే పూజిస్తాం 

మనం తన దెగ్గర చేరిన తరుణము
తల్లిదండ్రులు భావిస్తారు తనని తమ పిల్లల భవిషత్తు ఆశాకిరణము

తను మనకి ఉండాలని  బంగారు భవిషత్తు
చేస్తాడు తల్లిదండ్రుల కన్న ఎక్కువ కసరత్తు

సరిదిద్దుతాడు మనం వేస్తే తప్పటడుగులు
ముందే  భోదిస్తాడు జీవితం లొ ఎదురేయ్యే ఓడిదొడుకులు


తను మనకు ఏ బంధం లేకపోయిన మన కోసం కష్టపడే మనిషి
మనకు అన్ని విద్యలు నేర్పే  మహా ఋషి

కొన్ని సందర్బాలలొ మనపై ఉంటారు కఠినం
మన బంగారు భవిషత్తు కోసమే అందుకు కారణం 
 
సాదించేలా చేస్తాడు మన కన్న కలలు
తీర్చిదిద్దుతాడు మనని మంచి దేశ పౌరులు   

మనం విజయాలు సాదించినప్పుడు పడుతాడు గర్వం
తల్లిదండ్రులతో సమానముగా అవుతాడు ఆనంద పర్వం

మా కోరకు శ్రమించే ఓ మాస్టారు
అందుకోండి మా హృదయపూర్వక జోహారు

మాకు అందించారు మా జీవితానికి కావలసిన శిక్షణ
మీ రుణం తీర్చుకోలేము అందించిన ఏ గురుదక్షిణ


జి.సునిల్
      
 

No comments: