Monday, May 16, 2011

పెరుగుతున్న దరలు------- ఎగసిపడే మంటల సెగలు


పెరుగుతున్న దరలు------- ఎగసిపడే మంటల సెగలు

కొనలేక పోతున్నాం పెట్రోలు
ఎందుకంటే వాటి దరలు ఔట్ ఆఫ్ కంట్రోలు

పోయించుకోలేక పోతున్నాం డీజిలు
దాని లీటర్ దర చూస్తే చేదిరిపొతున్నది కళ్ళు

ఇక వంట గ్యాసు
కొనటానికి లేదు చాన్సు

సామాన్యుడు జీవనం గడుపుతున్నాడు అంటు "బ్రతుకు జీవుడా"
అంటున్నాడు ఇక నువ్వే మాకు రక్ష ఓ దెవుడా

కొనలెం అంటున్నారు ఇందనం
వాటి దరలకు పలుకుతున్నారు వందనం

దిక్కుతొచని మధ్యతరగతి
దరలు చూస్తుంటే వారి జీవనం అర్దం కాని పరిస్థితి

పేదవాడికి ఈ దరలు, అందుకొలేని గగనం
చింతపడుతున్నాడు ఎలా సాగించాలని జీవనం

ఈ దరలు చూసి సామాన్యుడు అనుకుంటున్నాడు ఎలా సాగించాలిరా ఈ బ్రతుకు
ఈ దరల వళ్ళ భయపడుతున్నాడు దొరకదేమోనని ఇప్పుడు దొరికే ఆ మెతుకు

ఇక వాహనాల మీద వెళ్ళటం ఇక చెల్లు
ఈ దరలతొ మనకు శరణ్యం ఇక సైకిళ్ళు

ఈ దరలతొ దూరం అవ్వాల్సి వస్తుంది రుచికరమైన వంట
కర్రలతోనే తెచ్చుకొవాల్సి వస్తుంది పొయిమంట

తలుచుకుంటే పాలక రాజ్యం
ఈ సమస్య పరిష్కారం అవుతుంది సుసాద్యం

సామాన్యుడి మీద పడకుండ సమకుర్చుకొవోచ్చు వనరులు
వారు సరిగ్గా అలొచ్చిస్తే దొరుకుతాయి దారులు

అలాగని పూర్తిగా ప్రభుత్వం మీద నింద వెయటం కాదు బావ్యం
మనం కూడ పొదుపుగా వాడుకోని నిర్వర్తించాలి మన కర్తవ్యం

అందుకే ఓ సామాన్యుడా ఎలెక్షన్ లొ మాటలు చొప్పే వారిని నమ్మకు

నీ ఓటు వారికి అమ్మకు

చేతలు చేయకలిగినవాడికి వెయ్యి నీ ఓటు

మార్చుకొ నీ ఫేటు

అప్పుడు ఆనందపు వసంతం

అవుతుంది మన సొంతం
జి.సునిల్
జనంలొ ఒక్కడు
9848888317

No comments: