Tuesday, September 14, 2010

మాతృత్వం లేని అమ్మ(A POEM ON TODAY INCIDENT ON LITTLE GIRL)

మాతృత్వం లేని అమ్మ

ఈ రొజు టి.వి చానెల్స్ చూపించాయి జరిగిన మహా ఘోరం
అమ్మ అనే పదంకి తేచ్చింది ఒక మహిళ తీరని ఆవమానం

ఆ పసిపాప పేరు నర్తన
దేవుడా ఎందుకు కలిగించావ్ ఆ పసికందుకు ఇటువంటి వేదన

తల్లిలా ఆ మహిళ పాప మీద చూపించలేదు మమకారం
వాతలతొ అమే ఆ పసికందు మీద చుపించింది అత్యంత కౄరం

ప్రేమతొ ఆ పసిపాపకు ఇవ్వలేక పొయింది ఆ మహిళ బంగారు రాత
బదులుగా ఆ పాపకు బహుమానంగా ఇచ్చింది వాత

ఆ మహిళ, రాక్షస రూపం లొ ఉన్న కసాయి
అమే వళ్ళ నరకం పొందింది ఆ బుజ్జి పాపయి

సమాజం భరించ లేక పొయింది ఈ ఆకృత్యం
రుజువు చెసింది రోజు రోజుకి మానవత విలువలు తగ్గుతున్నాయి అనే సత్యం

దేవుడా అలాంటి అమ్మను మళ్ళి పుట్టించకు
ఈ భువిపై అలాంటి వాళ్ళని పుంపించకు

ఆ పసికందుకు మానవత వాదులు ముందుకు వస్తున్నారు, ఇవ్వటానికి రక్ష
కఠినాతి కఠినంగా పొందాలి ఆ మహిళ శిక్ష

తద్వార అలాంటి మాతృత్వం లేని తల్లి
కనిపించ వద్దు  ఈ భూమిపై మళ్ళి

ఆ పాపకు అంతా మంచే జరగాలని కొరుకుంటు


మీ సునిల్     

No comments: