Tuesday, January 27, 2026

మా గురువు రమణ ....ఒక చెరగని ఆదరణ

 


మా గురువు రమణ ....ఒక చెరగని ఆదరణ

 గర్వంగా చెప్పుకుంటాం మేము రమణ సార్ శిష్యులం

వారి బోధనలు అయ్యాయి మా జీవితానికి కొండంత బలం

 

ఒత్తిడి లేకుండా ప్రతి విద్యార్థికి చేరాలనుకున్నారు విద్యా సరస్వతి

ఆ సంకల్పం దిశగా ఉండేది వారి బోధనా పద్ధతి

 

మీ బోధన సరళత్వం

మాకు అర్థం అయ్యేలా చేసింది ప్రతి అంశంలోని అసలైన తత్వం

 

మాకు ఉత్తేజం పరిచింది మీరు మాకు చెప్పిన మాటలు

ఆ ఉత్సాహమే మాకు వేసాయి బంగారు బాటలు

 

ప్రతి విద్యార్థిని సమానంగా చూసే గురువు

ఏ విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు మీలా చెప్తే చదువు

 

మీ బోధన మార్చింది నిత్య జీవితంలో సమస్యను చూసే విధానం

సమస్య అర్థం చేసుకుని సాధిస్తున్నాము పరిష్కార సమాధానం

 

ఎప్పుడూ మరువలేము మాకు బంగారు బాట ఇచ్చిన మీ శిక్షణ గది

చిరస్థాయిగా మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది మా మది

 

మా మనసుల్లో నిలిచిపోయాయి మీరు రాసిన ప్రతి అక్షరం

మా ఇప్పటి ఉన్నత స్థితికి మీ చదువే ఆధారం

 

నిజంగా మీ లాంటి గురువు  దొరకటం మా వరం

మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము మేము అందరం

 VVC 96-97 విద్యార్దులు ప్రేమతో

Wednesday, January 14, 2026

మా శివశంకర వరప్రసాద్ గారు

                                  

              మా శివశంకర వరప్రసాద్ గారు 

మాకు తెలిసిన మెగాస్టారు

ఈ మన శంకర వర ప్రసాద్ గారు

 

ఇలాంటి సినిమా చూడాలని ప్రతి అభిమాని అభిలాష

తమకు  కావాల్సిన సినిమా రావటంతో, ఆనందభాష్పాలే అయ్యాయి వారి భాష

 

బాస్ సినిమాలతో జరిగింది మా జీవిత ప్రయాణం

ఈ సినిమా మాకు రుచి చూపింది మా బాస్ సినిమా అసలైన ప్రమాణం

 

ఇది కదా మా బాస్ ను చూపించాల్సిన విధానం

ఇలా చూపిస్తే అభిమానులు ప్రేమతో ఇస్తారు రికార్ద్స్ తో బహుమానం

 

ఇప్పుడు ఉన్న ప్రతి జమానా

చూసింది మా బాస్ అసలైన స్టామినా

 

ప్రతి సన్నివేశం చేసింది కనువిందు

అందుకే ప్రతి ఒక్కరు థియేటర్లో వేస్తున్నారు చిందు

 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పండుగ అయింది బాస్ మయం

అన్ని వర్గాల ఆధరణతో పొందనుంది ఎవరు ఊహించని విజయం

 

మా మధిలోని బాస్ ని మళ్ళీ ఆవిష్కరించారు అనిల్ రావిపూడి

మీకు మెగా అభిమానులు తమ గుండెల్లో చేసుకూంటారు గుడి

 

దన్యవాదములు బాస్

మాకు  ఇచ్చినందుకు మళ్ళీ మా హ్యాపీ మెగా డెస్

 

జి.సునిల్ 

మెగా ఫ్యాన్


Wednesday, October 29, 2025

మా జీవిత ప్రయాణంలో ప్రియమైన ప్రవర్తిక

 

మా జీవిత  ప్రయాణంలో ప్రియమైన ప్రవర్తిక

మా జీవితంలోకి వచ్చాక ప్రవర్తిక

మొదలైంది మా జీవితంలో అసలైన కదలిక

 

మా కలలకు పోసింది ఊపిరి

                                              అయింది మా జీవిత సిరి                                                   

 

తనకు తెలుసు ఎప్పుడూ మేము ఉంటాం తన వెనుక

ఆ ధైర్యంతో ముందుకు సాగుతూ మాకు ఇస్తుంది సంతోష పరిచే కానుక

 

అనుకున్నాము మేము  ఉంటే చాలు ప్రతి విషయంలో తనకి తోడు

తను అయింది మమ్మల్నే ఉత్తేజ పరిచేలా నేడు

 

తన లక్ష్యాలకు  తనే వేసుకుంటుంది ప్రణాళిక

మేము కేవలం అవుతున్నాం తను  వేసుకున్న దారికి కావాల్సిన  ఏర్పాటు చేసే వేదిక

 

అన్ని విషయాల్లో తోడు ఉంటూ న్యాయం చేస్తుంది  పెద్ద కూతురు పాత్ర 

కొన్ని విషయాలలో అయింది మాకు దిశ చూపే నేత్ర

 

తనకు తానే పెంచుకుంది చిత్రాలను వేసే కళా

మాకు ఎంతో సంతోషంగా ఉంది, అందరు తనని అంటుంటే భళా

 

తన పలుకు మార్చింది మా జీవిత ప్రయాణం ఎంతో ఆహ్లాదం

ఛేదించేలా చేసింది జీవితంలోని ప్రతీ అవరోధం

 

ప్రవర్తిక, నిజంగా నువ్వు మా కుటుంబ సభ్యురాలు అవ్వటం మా అదృష్టం

ఈ కవితతో మేము తెలియజేస్తున్నాము ప్రవర్తిక నీపై మా  ఇష్టం

 

పుట్టినరోజు శుభాకాంక్షలతో

నీ  కుటుంబసభ్యులు


Wednesday, September 24, 2025

ప్రతి అభిమాని ఎదురుచూసిన క్షణం OG

 


ప్రతి అభిమాని ఎదురుచూసిన క్షణం OG


పవర్ స్టార్ మాకు ఒక వ్యసనం

తన ప్రతి చర్య మాకు ఉత్తేజపరిచే ఇంధనం

 

వేచి చూసాం పవర్ స్టార్ స్టామినా చూపే  సినిమా కొరకు

ఒక అభిమాని ఇవ్వగలిగాడు అందరి అభిమానులకు కావాల్సిన సరుకు

 

ప్రతి ఫ్రేమ్ లో చూపాడు సుజిత్ తన టాలెంట్

చూపాడు తన అభిమాన స్టార్ అసలైన కంటెంట్

 

చూసాం మా పవర్ స్టార్ నట విశ్వరూపం

ప్రతి సన్నివేశం ప్రతి అభిమానికి అనిపించింది ఎంతో అపురూపం

 

ఇకపై అనాలి కొణిదెల తమన్

మా కోసం ప్రాణం పెట్టి గెలిచాడు ప్రతి అభిమాని మన్

 

నేడు ఆవిష్కరించింది తెలుగు వెండితెర

మా పవర్ఫుల్ ఓజస్ గంభీర

 

OG తో బాక్స్ ఆఫీస్ కి వచ్చింది తూఫాన్ హెచ్చరిక

ఇక ఉన్న రికార్డులు కావాలి, ఇక కదలిక

 

THEY CALL HIM OG ( Original Gangster)

సృష్టించబోతున్నాడు రికార్డుల నూతన పేజీ

 

OG సినిమా పవర్ స్టార్ సత్తా మళ్ళీ చూపింది

ప్రతి అభిమాని ఆకలి తీర్చింది

 

OG టీం అందుకోండి ప్రతి అభిమాని గ్రీట్

అందించినందుకు మాకు కావలసిన ట్రీట్

 

జి.సునిల్

      https://sunil-megafan.blogspot.com/


Friday, June 6, 2025

ఓ అభిమాని ….ఇది నీకు తగునా

 


ఓ అభిమాని ….ఇది నీకు తగునా

నీ  వెలకట్టలేని అభిమానం

నువ్వు ఆరాధించే వారికి నిజంగా ఒక బహుమానం

 

మీ ఇరువురిలో ఆ ప్రేమ చేస్తుంది ఉత్సాహం

పరిధిలో ఉంచుకో కలిగితే జీవితాంతం ఉంటుంది ఆ ప్రేమ ప్రవాహం

 

కాని నీ అభిమానం దాటుతుంది హద్దు

నీ జీవితాన్ని అర్దాంతరంగా చేస్తున్నది రద్దు

 

నిన్ను ఆరాధించే ప్రతి ఒకరిని బాధిస్తున్నావు

వారిని జీవితాంతం వేదిస్తున్నావు

 

నీ రాక కొరకు  వారు సాగిస్తున్నారు వారి ఆయువు

అందరాని లోకానికి వెళ్తున్నావు భువి మీద వదిలి నీ తనువు

 

నీ పై పెట్టుకున్నారు వారు ప్రాణం

నువ్వు వేస్తున్నావు వారిపై జీవితాంతం బాధ పెట్టే బాణం

 

నీ గురించి రెండు రోజులు చర్చించుకుంటది ఈ సమాజం

తరువాత నీ వాళ్ళు తప్ప ఎవరు గుర్తుచేసుకోరు, ఇది  నిజం

 

ఇకనైన మేలుకో

నీ జీవితం విలువైనది , అది తెలుసుకో


ఇకనైనా తగ్గించు నీ ఆవేశం

నీ అభిమానం ఉండాలి సాధించేలా  నీ జీవిత దిశానిర్దేశం

 

నువ్వు అభిమానించే వారు కూడా నిన్ను చూసి గర్వపడేలా ప్రయత్నించు

అభిమానానికి  నిజమైన అర్థం  సమాజానికి చూపించు

 

జి.సునిల్

Tuesday, June 4, 2024

జనబలంతో జయించిన జనసేనాని

 





జనబలంతో జయించిన జనసేనాని  

విజయఢంకా మోగించారు మన జనసేనాని

 రాజకీయాలలో రచించారు కొత్త కహాని

 

అపజయంకి కుంగిపోకుండా వహించారు ఓర్పు

అందుకున్నారు తిరుగులేని తీర్పు

 

ప్రజల పక్షాన కొనసాగించారు పోరాటం

ప్రజా మద్దతుతో  అయ్యారు ఎవరూ ఆపలేని కెరటం

 

రచించారు తన శక్తికి తగ్గట్టు వ్యూహం

లభించింది 100% స్ట్రైక్ రేట్ గెలుపుతో ప్రజా మద్దతు ప్రవాహం

 

 మార్పు రాకపోతే, గ్రహించారు రాష్ట్ర భవిష్యత్తు పడనుంది డేంజర్

అద్బుత ఫలితంతో అయ్యారు గేమ్ చేంజర్

 

రాష్ట్ర బంగారు భవిషత్తే ఎప్పుడూ తన విధానం

తన గెలుపుతో ఎన్నో ప్రశ్నలకు ఇచ్చారు సమాధానం

 

ప్రచారంలో ప్రజలకు మేలు చేసే ప్రతి పనిని చేస్తాను అని చేసారు శపథం

అందుకే జన నాయకుడి హామీతో జనం పలికారు బ్రహ్మరథం

 

తెలిపారు తన ప్రతి అడుగు జనహితం

నిస్వార్థ రాజకీయాలే తన అభిమతం

 

పిఠాపురం ఎమ్మెల్యేగా  చేస్తున్న ఈ అవతారం

అవుతుంది ప్రజలకు మేలు చేసే ఆధారం

 

ప్రజలకు కృతజ్ఞత తెలిపారు ఇచ్చినందుకు అపూర్వ ఆదరణ

క్షణం ఆలస్యం చేయకుండా చేస్తా అన్నారు తన ప్రజలకు ఇచ్చిన పనుల కార్యాచరణ

 

ఇది ప్రతి కార్యకర్త  వేచిన సమయం

ఎప్పుడూ జనసేనాని తోడుగా నిలిచి, ప్రతి పనిని చేస్తాం జయం


Waiting: కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ...


జి.సునిల్

Monday, August 14, 2023

రివ్యూతో మాకు పనేటి

 

రివ్యూతో మాకు పనేటి



మా మెగాస్టార్ మాకు తెరపై కనిపిస్తే మాకు కోటి

అలాంటిది మాకు రివ్యూలతో పనేటి

 

మా బాస్ ఉంటే చాలు ప్రతి సీను

ఎప్పుడూ బోర్ అనించదు చూసే స్క్రీను 

 

అభిమానులు అంటే మా బాస్ కు ఎంతో ఇష్టం

వాళ్ళ గురించి చేస్తారు ఎంతటికైనా కష్టం

 

తనను ప్రేమించే వాళ్ళ గురించి  అన్ని చేసే భోళా శంకరుడు

మేము మేచ్చే మా మెగా కథానాయకుడు

 

4 దశాబ్దాలుగా చూస్తుంది ఈ జమానా

మా మెగాస్టార్ స్టామినా

 

ఒకరు తగ్గించాలి అనుకుంటే తగ్గేది కాదు ఆ మెగా ఇమేజ్

ఎప్పటికీ కొనసాగుతుంది స్చ్రీన్ పై మా బాస్ రామ్పేజ్

 

భోళా శంకర్ లో కూడా మాకు నచ్చింది బాస్ స్పార్క్

అందుకే ప్రతి అభిమాని వేసారు బాస్ కు 100 మార్క్

 

నెగిటివ్ రివ్యూలు రాసే వారికి తాత్కాలిక ఆనందం

ఎవరు ఎన్ని రసినా  విడి పోనిది మా బంధం

 

కట్టె కాలే అంత వరకు మేము మెగాఫ్యాన్

దేవుడిని ప్రార్దిస్తున్నాం అందించాలని బాస్ కు లాంగ్ లైఫ్ స్పాన్ 

 

అభిమానులే బాస్ కు ప్రోత్సాహం

వారి కోసం బ్యాక్ అయి తీర్చుకుంటారు  నటనా దాహం

 

అందుకోండి మెగాస్టార్ మా పుట్టినరోజు గ్రీటీంగ్

మీ నెక్స్ట్ మూవీ కోరకు ప్రతి అభిమాని  వెయిటింగ్ 

  

జి.సునిల్

మెగా ఫ్యాన్

9848888317

                                                             

Saturday, July 29, 2023

చాలా పవర్ ఫుల్ నీ జీవిత ఘడియలు

 


చాలా పవర్ ఫుల్ నీ జీవిత ఘడియలు

మయం విలువ తెలిస్తే  ఉండదు నీ జీవితంలో ఎటువంటి బ్లో

తెలుసుకో ఈ జీవిత సత్యం బ్రో

 

నీ జీవితంలో సమయం గడిస్తే మళ్ళీ అవ్వదు ప్రత్యక్షం

అందుకే చేయకు నిర్లక్ష్యం

 

జీవితంలోని ప్రతి క్షణాన్ని చేసుకో మెరుగు

అప్పుడు అవసరం ఉండదు జీవితపు పరుగు

 

ఎంతో విలువైనవి నీ జీవిత ఘడియలు

నీ వలన పొందాలి బంగారు భవిష్యత్తు రానున్న భావితరాలు

 

నీ తుది శ్వాస అప్పుడు చాలా ప్రశాంతంగా ఉందంటే నీ హృదయం

చాలా అమూల్యంగా గడిపినట్టే నీ జీవితపు సమయం

 

సమయం వృధా కానివ్వకుండా  ఇకనైన చేయి శ్రీకారం

సార్ధకం చేసుకో నీ జీవిత గడియారం


సమయం విలువ చక్కగా చూపించింది బ్రో మూవీ

మన పవర్ స్టార్ సందేశాన్ని పాటించాలని ఆశిస్తున్నా  భూమ్మీద  ఉన్న ప్రతి జీవీ

 BRO, LIFE IS SHORT

WITH YOUR TIME PLANNING, WIN EVERY HEART

TIME:

B...BRINGS R….REAL OOUTPUT IN LIFE PROPERLY PLAN IT

B...BECOMES R….REAL OOPPURTUNITY OF LIFE  IF UTILISED PROPERLY


జి.సునిల్

9848888317