Saturday, April 30, 2022

రివ్యూలకు అతీతం ....మా అభిమానం

 

రివ్యూలకు అతీతం ....మా అభిమానం


మేము చేస్తున్నాం జరుగుతున్న రివ్యూలను బేకాతరు

మాకు చాలు తెరపై ఉన్న మా చిరు


మెగా పవర్ స్టార్ మాకు బోనస్ కనువిందు

రెండు కనులు చాలలేదు చూడటానికి వారి ఇరువురి చిందు

 

కనిపించింది ఈ వయసులో కూడా జోరు తగ్గని మా బాస్ శ్రమ 

నెగటివ్ రివ్యుతో ఆ జోరు తగ్గించవచ్చు అనుకుంటే అది వారి భ్రమ

 

మాకు మా అభిమాన హిరోల నటవిశ్వరూపం కలిగించింది పండుగ

రానున్న రోజుల్లో గుణపాఠం పోందనున్నారు ఎవరైతే చేస్తున్నారో దగ

 

మా హిరోలు, అభిమానులను ఆనందపరచాలనుకుంటారు ప్రతి ఫ్రేంలో

సినిమా నచ్చుతుంది, వారు మన కోసం పడే కష్టాన్ని చూసే కోణంలో

 

ఇరువురు అయ్యారు చిరుతపులి

కాపాడారు ధర్మస్థలి

 

ధన్యవాదములు తల్లి ఘట్టమ్మ

మీ వల్ల తెరపై కనిపించింది మా మెగా హీరోల బొమ్మ

 

జయ అపజయాలకు అతీతంగా సాగేదే మా అభిమానం

ఎవరు ఎన్ని అన్నా మారదు ఈ వైనం


నెవర్ కేర్ నెగటివ్ టాక్స్

మెగా హీరోస్ వల్లే సాధ్యం బద్దలు కోట్టాలంటే బాక్స్

 


జి.సునిల్

మెగా ఫ్యాన్

Wednesday, April 20, 2022

నాన్నా మిస్ యూ

                                               నాన్నా మిస్ యూ


 నీ జీవితాన్ని చేసావు నిర్లక్ష్యం

చేకూర్చాలని నీ పిల్లలకు బంగారు భవిషత్తు లక్ష్యం

 

నిరంతరం తపించావు మా బాగోగులు

ధైర్యంగా ఎదుర్కున్నావు జీవితంలోని కష్టాలు

 

భావించావు పిల్లల భవిష్యత్తే  నీ భవిష్యత్తు

ఎన్ని ఆటుపోట్లు ఎదురు అయినా చేర్చావు నీ పిల్లల్ని ఎంతో ఎత్తు

 

నీ కష్టానికి పిల్లల బంగారు భవిషత్తుతో అవుతుంది అనుకున్నావు సుఖాంతం

అంతలోనే మమ్మల్ని విడిచి, చేసావు మమ్మల్ని ఏకాంతం

 

ఎన్నీ ఉన్నా మాకు ఎవరూ భర్తీ చేయలేరు నీ చోటు

మాకు ఎప్పుడూ ఉంటుంది నీలా ధైర్యాన్ని అందించే లోటు 

 

నీ చెంత చేరేవాడిని కష్టం వచ్చిన మరు క్షణం

ఇప్పుడు అర్దం కావట్లే ఎటు వెళ్ళలో వస్తే అటువంటి తరుణం

 

ఎవరూ పూడ్చలేనిది నీ స్థానం

ఎవరూ చేయలేరు నీలా నిస్వార్థ ప్రేమ వైనం

 

నాన్నా మిస్ యూ

ఎప్పటికీ పై నుంచి నీ చల్లని ఆశీర్వాదంతో అందించు మా పై నీ వ్యూ

 

 

జి.సునిల్

(Written on 20.04.22)

Friday, April 9, 2021

ప్రజా పక్షాన పవర్ఫుల్ వకీల్ సాబ్


ప్రజా పక్షాన పవర్ఫుల్ వకీల్ సాబ్


పవర్ఫుల్ వాదనతో న్యాయంకోసం దద్దరిల్లింది ప్రజా కోర్టు

పవర్ స్టార్ అద్బుత నటన  చూసి ఉత్సాహంతో ఉంది ప్రతి ఫ్యాన్ హార్టు

 

మన పవర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్

బలంగా వాడారు బలహీనులకు న్యాయం అందించే  ప్రతి సెక్షన్

 

ప్రజల  పక్షాన పోరాడారు మన వకీలు

ఆలోచింపచేసినది తను వాదించిన ప్రతి రీలు

 

గాయపడిన ముగ్గురు మహిళల కోసం నిలుస్తాడు అండగా

బదులిస్తాడు నంద ప్రతి వాదనకు దీటుగా

 

ఆ మహిళల గురించి వదిలేస్తారు మందు మెడిసిన్

వాదన గెలిచి ఆ మహిళలకి అవుతాడు పునర్జన్మ ఇచ్చిన  వ్యాక్సిన్

 

ఇటువంటి వకీల్ల వల్ల పెరుగుతుంది న్యాయ వ్యవస్థ మీద గౌరవం

న్యాయం కోసం నిరీక్షించే ప్రతి ఒక్కరికీ కలుగుతుంది జీవం

 

తన చిరకాల స్వప్నాన్ని అద్బుతంగా సాకరం చేసుకున్నారు మన దిల్ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఒక సాదారణ అభిమానిగా సంబరాలు చేసుకున్న రోజు

 

పవర్ స్టార్  సినిమా డైరెక్షన్, వేళ్తే వేణు శ్రీరామ్ వంటి అభిమాని చేతుల్లో

ప్రతి సన్నివేశం ఎప్పటికీ నిలుస్తాయి ప్రజల గుండెల్లో

 

సూపర్ మ్యూజిక్ తో ఇరగతీసాడు తమన్

తన అభిమాన హీరో కోసం పెట్టాడు సినిమా మీద తన పూరా మన్

 

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అంటున్నారు సూపర్ వకీల్ సాబ్

మీ నటన లా జవాబ్

జి.సునిల్

Friday, September 25, 2020

మూగబోయిన మా బాలు గారి స్వరం

మూగబోయిన మా బాలు గారి స్వరం 

ఊహించాలంటే లేరని మన గాన గంధర్వుడు

తట్టుకోలేకపోతున్నాడు ఏ సంగీత ప్రేమికుడు 


బాలు గారు అంటే ప్రతీ భారతీయుడికి ఎనలేని ప్రేమ

తన మధుర స్వరం ఇక లేదని కుమిలి పోతుంది చిత్ర పరిశ్రమ


ఈ సంగీతపు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది మీ కంటూ

మేము పెరిగాం మీ మధుర పాటలు వింటూ 


బాలు గారు నిలిచారు తరాల మధ్య వారధి

మేము ఏమీ నేరం చేసామని మా నుంచి మిమ్మల్ని తీసుకెళ్లింది ఆ విధి


మా బాలు గారు మధుర గాన సముద్రం

మా నుంచి దూరం చేసిన ఆ విధాతపై ప్రతి ఒకరు చూపుతున్నారు రౌద్రం


ఎన్నో మధురమైన పాటలతో మా మదిని చేసారు మ్యాజిక్కు

ఇప్పుడు సినీ సంగీత ప్రపంచానికి లేకుండా అయింది పెద్ద దిక్కు


మా జీవితంలో మీ పాట అయ్యింది మమేకం

మీతోనే సాధ్యమయింది స్వరానికి అపురూపమైన అభిషేకం


లేదని తలుచుకోవాలంటే మా బాలు గారి స్వరం

మా మనసులకి కలిగిస్తున్నది ఎవరికి తెలుపలేని భారం


మీమల్ని మా నుంచి దూరం ఈ రోజు మాకు చీకటి రోజు

ఈ రోజు మాకు లెకూండా చేసింది మా పాటల రారాజు


మీరు సాధించారు ప్రతి సంగీతపు మజిలీ

మా అందరి ప్రార్థన మీ ఆత్మకు శాంతి చేకూరాలి


అందుకోండి మా ఘన నివాళి సంగీతపు లెజండ్

మా మదిలో మీకు, మీ పాటలకు ఎప్పుడూ ఉండదు ఎండ్(END) 

  

మీ అభిమాని

జి.సునిల్

Saturday, September 12, 2020

అదిరిపోయే మన జీవిత క్లైమాక్స్ (Written Inspired by Director #PuriMusings)

 అదిరిపోయే మన జీవిత క్లైమాక్స్


మన జీవితంలో ఏ విషయంలో పడవద్దు రాజీ
అప్పుడు ఈ చరిత్రలో మనకంటూ  ఉంటుంది ఒక పేజీ

వయసులో మనం చూపగలిగితే సాధించాలనే కసితో పనితనం
అపుడు ఎవరీ మీద ఆధారపడకుండా హాయిగా ఉంటుంది ముసలితనం

 మనం ఎవరికీ  కాకూడదు భారం
మనతో గడపాలని ఉత్సాహపడాలి మన తర్వాతి తరం

ఆ వయస్సు కాదు చదవటానికి భగవద్గీత
ఆ వయస్సులో నువ్వు అందరినీ ఉత్తేజపరిచి అవ్వాలి జీవితంలో విజేత

ఆ వయస్సు కాదు మూలకు కూర్చోని లేకుండా ఎటువంటి కదలిక
నీ పిల్లలు నీ కోసం చూసేలా చేయాలి నీ రాక 
    
ముసలితనం కాదు కృష్ణా రామా అనుకునే వయస్సు
ప్రపంచాన్ని చేధించి ఉత్సాహ పడాలి మన మనస్సు

ఉండొద్దు అనుకునేలా వీడికి వృధా అన్నం పెట్టే కంచం 
ఉండాలి వీడు మనతో  అనుకునేలా ఈ ప్రపంచం

అనుకుంటున్నా ప్రతీదీ సాధించు
నీ క్లైమాక్స్  ఎంత విలాసంగా ఉంటుందొ చూపించు

చావు గురించి నువ్వు చూడొద్దు క్లాక్
నువ్వు ఇచ్చే క్లైమాక్స్ అవ్వాలి అందరికి మైండ్ బ్లాక్

జి.సునిల్

Wednesday, May 13, 2020

ఇకపై స్వదేశీ వస్తువులు

ఇకపై స్వదేశీ వస్తువులు

పెంచుకోవాలి స్వదేశీ వస్తువులపై అభిమానం
అప్పుడు అభివృద్ధి పథంలో దేశం చేస్తుంది పయనం

గుర్తిద్దాం మన వారి శ్రమ
పెంచుకుందాం ఇక్కడ తయారు అయ్యే వస్తువులపై ప్రేమ

మోదీ గారి పలుకులను స్వాగతిద్దాం
మన దేశం పై ప్రేమ చూపిద్దాం

ప్రస్తుత  పరిస్థితులలో మన కంపెనీలే వచ్చాయి మనకు అండగా
వారి వస్తువులు కొనడమే ఉండాలి ఇక మన అజెండా

 మన వస్తువులు కొంటే మళ్ళీ తోర్పడుతాయి మన దేశ అభివృద్ధికి
మన శ్రేయస్సు చేసే ఆ పనికి ఆలోచన దేనికి???

పెంచుకుందాం స్వదేశీతనం
తగ్గిద్దాం విదేశీ కంపెనీల పెత్తనం 

మన  స్లోగన్ మేడ్ ఇన్ ఇండియా
మన సత్తా చూడాలి ఈ దునియా

జి.సునిల్

Monday, May 4, 2020

గోవిందా గోవిందా (Written After Seeing Que at Bar Shops Today)

గోవిందా గోవిందా 
(Written After Seeing Que at Wine Shops Today)

అంటాం కాపాడు గోవిందా గోవిందా..
వచ్చినప్పుడు మనకు ఆపద....

ఇప్పుడు కాన రావట్లేదు ఆ ఏడుకొండల స్వామి దేవుడు..
ఏనాడైనా అనుకున్నామా వస్తుందని అలాంటి నేడు....

తిరుపతిలో అనువనువు పొందేవాళ్ళం భక్తి పారవశ్యం..
కరోనా మహమ్మారి వలన  లేకుండా అయింది నేడు మనకు ఆ దృశ్యం....

ఓ దేవా..
ఈ కరోనా నుండి మాకు ఎమైన నేర్పాలని అనుకున్నావా??....

అలా ఎలా మారుతాము అనుకున్నావు ప్రభువా..
45 రోజుల శ్రమ ఒక మందు దొరకడంతో మార్చుకున్నాం మా తోవా....

కరోనా కరోనా అంటూ ఇన్ని రోజులు పడ్డాం భయం..
మందు దొరుకుతుంది అంటే ప్రతీది అయింది మాయం....

 దొరికితే చాలు అనుకున్నాం బీరు ..
కరోనా కూడా చేసాం భేకాతరు....

మా ముందు చెల్లవు నీ మాయజలం..
ఎందుకంటే  మేము అనుకుంటాం, మేము ఎదురులేని మానవులం....

చావు మా ముందు దాడి చేయటానికి రేడిగా ఉన్నా నేర్చుకోము.. 
కొద్ది క్షణాల తృప్తి కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలని వదులుకుంటాము....

నీ వల్లే కాకపోతే ఎవరి వల్ల అవుతుంది ఏడు కొండల వాడా..
మమల్ని క్షమించి ఎప్పుడూ మాకు కల్పించు నీ నీడ....

ఎవరికీ లేదు ఇందరి కష్టాన్ని తృణప్రాయంగా వృధా చేసే హక్కు..
మనని మనం కాపాడు కోవడం తప్ప లేదు ఎటువంటి  వేరే మ్యాజిక్కు....

ఆశీస్తున్నాము ప్రతి ఒకరు మారుతారని..
త్వరలో ఈ సమస్య పోయి నిన్ను తిరుపతిలో దర్శించుకోవాలి గోవిందా గోవిందా అని....

జి.సునిల్

Sunday, May 3, 2020

నవ్వుతూ బతకాలిరా (WRITTEN FOR LAUGHTER DAY)

నవ్వుతూ బతకాలిరా (WRITTEN FOR LAUGHTER DAY)

ఎవరో అన్నారు సంతోషం సగం బలం
అలా నవ్వుతూ బతకడం ఆనంద జీవితానికి మూలం

ఈ  జీవితం మూణ్ణాళ్ళ ముచ్చట
ప్రతీది అతిగా తీసుకోకుండా వేసుకుందాం ఆనందాల బాట

ఎవరికీ ఉండదు సమస్యలు లేని జీవితం
సమయస్ఫూర్తి  పరిష్కారంతో తగ్గుతుంది నీపై వాటి ప్రభావం

ప్రతీది క్లిష్టంగా భావిస్తే దొరకదు దేనికీ నీకు సమాధానం
ఆత్మవిశ్వాసంతో జయించు ఈ జీవన మైదానం

ఆనందం తీసుకెళ్తుంది నీ లక్ష్యం వైపు ముందుకి
పెంచుతుంది నీవు భయపడాల్సిన అవసరం లేదు దేనికి

అప్పుడు నీవు అనుకున్నది అవుతుంది నీ ముందు ప్రత్యక్షం
ప్రపంచంలోని ప్రతీది అవుతుంది నీ పక్షం

ఎంతగా నీ జీవితంలో భాగం అయితే ఆహ్లాదం
అంతగా తగ్గుతుంది నీ జీవితంలో వచ్చే ప్రమాదం

నవ్వుతూ బ్రతకమని ఈ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు
అర్థం చేసుకుంటే అసలైన జీవితాన్ని అనుభవిస్తాడు ప్రతి జీవుడు

ఇకనైనా మార్చుకుందాం మన నైజం
మన సంతోషపు పలుకులు ఇతరుల్లో కూడా నింపుతుంది ఉత్తేజం

అందరితో గడుపుదాం ఆనందంగా
మార్చుకుందాం ప్రపంచాన్ని ఆనంద నిలయంగా

జి.సునిల్

Saturday, May 2, 2020

ఎవరూ పట్టించుకోని మధ్య తరగతి



ఎవరూ పట్టించుకోని మధ్య తరగతి 


ఎవరికీ చెప్పలేకున్నారు మధ్య తరగతి.. 
ప్రస్తుత్తం వారు అనుభవిస్తున్న పరిస్థితి....

కరోనా గడప దాటనివ్వకుండా చేసింది రాకుండా సంపద..  
తప్పకుండా వచ్చే ఖర్చులకు డబ్బులేక పడుతున్నారు వారు బాధ....

ఒకటో తారీకు వచ్చే జీతంతో చక్కగా చేసుకునేవారు ప్లానింగ్.. 
ఇప్పుడు పని చేసుకోలేని వారి స్థితిపై ఎవరూ చేయటం లేదు కేరింగ్....

అన్ని ఉంటేనే చాల కష్టం మధ్య తరగతి బాధ్యత.. 
ఎమీ లేని ఈ సమయంలో జీవనం అనుకోవాలి విధి రాసిన రాత....

వచ్చిన సంపద సరిపోక ఎదరు అయ్యేవి ఎన్నో సమస్యలు.. 
ఆత్మాభిమానం అడ్డు వస్తున్నది చేయాలంటే ఇప్పుడు అప్పు ప్రయత్నాలు....

పేదవారికి కనీసం ప్రభుత్వ చేయూత కొంచెం ఆధారం.. 
కాని వీరికి మాత్రం ఎవరూ చూపడంలేదు ఎటువంటి పరిష్కారం....

అనిపిస్తుంది ఎటుకాకుండా ఎందుకు పొందాము ఈ మధ్యతరగతి పుట్టుక.. 
ఎవరికి తెలుపలేక తోందరపాటుతో కొందరు అనుకుంటారు ఈ జీవితం చాలు ఇక....

ఆ తొందర  నిర్ణయాలు తీసుకోవద్దని మనవి.. 
మంచి రోజులు వస్తాయి అని ప్రతి ఒక్కరం అవ్వాలి ఆశాజీవి....

ఎవరు పట్టించుకోని వారి పరిస్థితి నిజంగా పాపం.. 
ఆశీస్తున్నా ఈ సమస్య త్వరగా సమసిపోయి, పొందాలి వారి జీవన ఆశాదీపం ....

జి.సునిల్