Monday, January 30, 2017

కొంచెం మధురం కొంచెం భారం



కొంచెం మధురం కొంచెం భారం

వచ్చిందంటే వారాంతం
మనసు చెందుతుంది
కొంచెం మధురం కొంచెం భారం

శనివారం సాయంత్రం ప్రారంభం అవుతుంది వరంగల్ వైపు పరుగు
మనసు తపన పడుతుంది చూడాలని ఇద్దరి కూతుర్ల ఆనందాల వెలుగు

రాత్రి వెల్కం నాన్న , అని చిన్న కూతురు పలకరిస్తుంది
తనకు నిద్ర వచ్చే అంత వరకు తన నవ్వులతో అలరిస్తుంది

తెల్లవారి జామున గుడ్ మార్నింగ్ అంటూ లేపుతుంది పెద్ద కూతురు
మా షెడ్యుల్ ప్రారంభించాలని అని ఇద్దరం అవుతాం దనదన తయ్యారు

ఇద్దరం వెళ్తాం  వరంగల్ లొ ప్రతి వారం కొత్త ఆలయం
కోరుకుంటాం కలిగించాలని మాకు ప్రతి పనిలొ జయం

తర్వాత అవుతుంది షురు
మా ఇద్దరి వరంగల్ లొ ఎదొ ఒక ప్రదేశానికి షికారు

ఇంటికి వచ్చాక కొంచం సమయం హని స్కూల్ కబుర్లు
మరో పక్క సూదీక్షతొ ఆటలు



కొంచం సమయం వినటానికి మంజుల ముచట్లు
తెలపటానికి తను పిల్లతో పడుతున్న పాట్లు

హని, బై నాన్న పలకరింపుతో అవుతా హైదరబాద్ పయనం
రోజంత ఆనందం, వెళ్ళేటపుడు మనసుకు భారంలా వుంటుంది ఆదివారం అనుభవం   

అందుకే కొంచెం మధురం కొంచెం భారం


జి.సునిల్ 


Friday, January 27, 2017

ఆత్మియతతో శతమానం భవతి

ఆత్మియతతో శతమానం భవతి

బంధాలకు దూరం చేస్తున్నది యాంత్రిక జీవనం
ప్రతి ఒకరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మన పెరిగిన వైనం


మన ఎదుగుదలకు కారణం పుణ్య దంపతుల వెన్నుదన్ను
నేడు మన రాక కొరకు వేచి చూస్తుంది వారి కన్ను


మన శ్రేయస్సు కోరకు కష్టపడిన తల్లిద్రండ్రులు
నేడు అంటున్నారు వారు ఉన్నారు అని గ్రహిస్తే చాలు


వారు ఆలోచించు ఉంటే స్వార్దంగా
మనం బ్రతక కలిగేవాలమ ఇంత ఉన్నతంగా?  
  
మన శ్రేయస్సు కోరకే శ్రమించారు వారి ప్రతి జీవన భాగం
నేడు కోరుకుంటున్నారు మన నుంచి కొంత వారిపై అనురాగం 

వారు అడగటం లేదు ఆస్తులు
మన పలుకులతో ఇవ్వమంటున్నారు వారికి మధుర జ్ఞాపకాలు


సమయం లేదు తెలిపితే కారణం
ఉండదు నీ గురించి బ్రతికిన వారిపై అంత కంటే దారుణం

వారికి అందించటం ఆత్మియత 
మన అందరి భాధ్యత

మనం వారి కోరకు కేటాయించగలిగితే కొంచం సమయం
వారి వ్యధ అవుతది మాయం

ఆప్యాయతతొ ఉండాలి ప్రతి లొగిలు
అపుడు ప్రేమతొ ఉంటుంది అన్ని బంధాలు

మన రాకతో కలిగిద్దాం తల్లిదండ్రులకు మరుపురాని అనుభూతి
వారి ప్రేమతొ కూడిన ఆశిస్సులే ప్రతి ఒకరికి అవుతుంది శతమానం భవతి

జి.సునిల్

Wednesday, January 11, 2017

మెగా అభిమానుల మదిని అలరించిన ఖైది



మెగా అభిమానుల మదిని అలరించిన ఖైది 

ఎప్పుడప్పుడా అని నిరీక్షించింది ప్రతి అభిమాని  హృదయం
ఈ రోజు వచ్చింది ఆ మెగా సమయం

తెరపై బాస్ బొమ్మ పడింది
బాక్స్ ఆఫిస్ రికార్డ్స్ తొ మోగింది

వచ్చాడు బాస్ మన కోసం
కొనసాగించాడు బాక్స్ ఆఫిస్ వద్ద తన రాజసం 

డాన్స్ తొ మొదట వచ్చింది రత్తాలు 
బాస్ గ్రేస్ చూసిన అభిమాని అనుకున్నాడు ఈ మనసుకు ఇది చాలు 

అదిరింది బాస్ గ్లామర్
కొనసాగించాడు తన టైమింగ్ ఉన్న హ్యూమర్  

కిక్ ఎక్కే స్టెప్పులతొ వచ్చింది సుందరి
తన అందాలతో అలరించింది కాజల్ మంజరి 

సమాజంలో ఆదిపత్యాన్ని చూపిస్తుంది కార్పోరేట్ 
కాలరాస్తున్నది అన్నదాత ఫేట్  

రైతుల పక్షాన నిలవాలనేది శంకర్ ఆశయం
కార్పోరేట్ దిగ్గజాల ఎదుట లభించదు తనకు జయం

అప్పుడు తన ప్లేస్ లొ  వస్తాడు కత్తి శ్రీను
వినిపించటాని రైతుల టొను 

తెలుపుతాడు సినియర్ సిటిజన్స్ ఎప్పుడూ కాదు సమాజానికి బరువు
తట్టుకోలేరు ఎవరు, వారు చూపిస్తే వారి బాధతో దరువు 

చాటి చోప్తాడు నోప్పులు పడుతున్నది ఊరి తల్లి గర్బం
రైతు కంట నీరు తుడవందే పొందలేం మనం స్వర్గం

వారి భాదలను తీర్చటానికి పడుతాడు ఆరాటం
చేస్తాడు వారి తరుపున పోరాటం 

ఆదురుతుంది తన ఆవేదన తెలిపే మీడియా సమావేశం 
తెలుపుతాడు రైతుల పక్షాణ వారి సందేశం  

వారి పక్షాణ అండగ నిలుస్తాడు ఈ సిం హం
MNC ఆదిపత్యాని చేస్తాడు విద్వంసం 


రౌడిలను కోట్టే సమయంలో ఆలి విసురుతాడు కాయన్  
అప్పుడు పోరాట సన్నివేషాలలొ విజృంభిస్తాడు  మన మెగా లయన్  

అమ్మడు పాటలో అలరిస్తుంది మెగా జోడి 
చేస్తుంది అభిమానులపై స్వీట్ దాడి 

బాస్ ప్రతి సన్నివేశాని అనిపించాడు కిరాక్
బాక్స్ ఆఫిస్ వద్ద చేస్తున్నాడు రికార్డ్స్ ను హైజాక్


బాస్ చేరారు తన దినియ
మళ్ళీ ఈ కళామతల్లి ముద్దు బిడ్డ చూపించనున్నారు తన మెగా మానియ



ఇలాగే తన మెగా వినోదాని తెరపై దంచాలి
బాస్ మాకు మెగా ఆనందాని పంచాలి


B...Box
     O... Office
   S...Super
                           S...Star                          
I....In
   S...Style
       B...Bounces
A...And
         C.. Comeback
K..Keka

ఆశిస్తు
సునిల్ 
మెగా ఫ్యాన్
http:sunil-megafan.blogspot.com 

9848888317 

SMALL HISTORY OF MY POEMS:

1. Wrote first poem in 1998 during my intermediate on boss

2. Wrote poem on boss political entry in 2007 before boss announced

3.More than 50 Poems on Boss Political yaatras and Journey.

4.More than 30 poem on mega family members Films and Functions.

5.My Dream Day with Boss

6. My Participation in Railu Yaatra


7.Poem On Boss Birthday 
  

8. Poem Written on Boss to come back to movies in 2010


9. Against requests for Entry in 2011


10. More than 75 poems on social events and my family members and occasions.