Friday, January 27, 2017

ఆత్మియతతో శతమానం భవతి

ఆత్మియతతో శతమానం భవతి

బంధాలకు దూరం చేస్తున్నది యాంత్రిక జీవనం
ప్రతి ఒకరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మన పెరిగిన వైనం


మన ఎదుగుదలకు కారణం పుణ్య దంపతుల వెన్నుదన్ను
నేడు మన రాక కొరకు వేచి చూస్తుంది వారి కన్ను


మన శ్రేయస్సు కోరకు కష్టపడిన తల్లిద్రండ్రులు
నేడు అంటున్నారు వారు ఉన్నారు అని గ్రహిస్తే చాలు


వారు ఆలోచించు ఉంటే స్వార్దంగా
మనం బ్రతక కలిగేవాలమ ఇంత ఉన్నతంగా?  
  
మన శ్రేయస్సు కోరకే శ్రమించారు వారి ప్రతి జీవన భాగం
నేడు కోరుకుంటున్నారు మన నుంచి కొంత వారిపై అనురాగం 

వారు అడగటం లేదు ఆస్తులు
మన పలుకులతో ఇవ్వమంటున్నారు వారికి మధుర జ్ఞాపకాలు


సమయం లేదు తెలిపితే కారణం
ఉండదు నీ గురించి బ్రతికిన వారిపై అంత కంటే దారుణం

వారికి అందించటం ఆత్మియత 
మన అందరి భాధ్యత

మనం వారి కోరకు కేటాయించగలిగితే కొంచం సమయం
వారి వ్యధ అవుతది మాయం

ఆప్యాయతతొ ఉండాలి ప్రతి లొగిలు
అపుడు ప్రేమతొ ఉంటుంది అన్ని బంధాలు

మన రాకతో కలిగిద్దాం తల్లిదండ్రులకు మరుపురాని అనుభూతి
వారి ప్రేమతొ కూడిన ఆశిస్సులే ప్రతి ఒకరికి అవుతుంది శతమానం భవతి

జి.సునిల్

No comments: