Wednesday, June 29, 2011

హ్యాపి భర్త్ డే టు గౌరవి (MY BROTHER IN LAW DAUGHTER)

హ్యాపి బర్త్ డే టు గౌరవి
హ్యాపి బర్త్ డే టు గౌరవి

అష్ట ఐశ్వర్యాలతొ, ఆనందంతొ ఎల్లపుడూ నువ్వు నిలవాలి చిరంజీవి

మాటలలొ తను చాల చలాకీ

ఆమె మాట్లాడటం స్టార్ట్ చేస్తే, ఇక ఎక్కు పెట్టినట్టే తుపాకీ

ఎవరూ తట్టుకోలేరు ఆమె నుంచి వచ్చే మాటల బుల్లెట్లు

ఆ దెబ్బ కి పడిపోవలసిందే ఎదుటి వారి వికెట్లు

తను ఉంటే ఇల్లంత ఉంటుంది కోలాహలం

ఆమె నవ్వు చూస్తే, బాధలొ ఉన్న వారికి కూడ వస్తుంది కొండంత బలం

తనకి ఉంది దేవుడిపై అమితమైన భక్తి

నాకు ఆశ్చర్యం కలిగింది చూడటంతొ తనలొ ఉన్న ఈ ఆసక్తి

ఇంట్లో అందరు తనకు పంచుతారు ఎంతో ఆప్యాయత

తన ఇష్టాలు తీర్చడానికి అందరు ఇస్తారు ప్రాదాన్యత

తన పేరేంట్స్ తన కరియర్ కొసం అన్ని ఎర్పాట్లు చేస్తు వెళ్తున్నారు పద్దతి ప్రకారం

వారి పర్యవేక్షణలొ ఆమె తప్పక అదిరోహిస్తుంది ఉన్నత శిఖరం

తను ఖచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటుందని మా అందరి ధీమ

ప్రత్యేక అభినందనలు పలుకుతున్నాడు ఈ మామ

గౌరవి, నువ్వు అవ్వాలి విజయానికి అడ్రెస్

అందుకొ మా అందరి నుంచి బెస్ట్ విషేస్

జి.సునిల్

Tuesday, June 28, 2011

మెగా అభిమానులకు మెగా షాక్ ఇచ్చిన మెగాస్టార్


మెగా అభిమానులకు మెగా షాక్ ఇచ్చిన మెగాస్టార్
కొడితే కొట్టాలి అనుకుంటున్నారు బాస్ సిక్స్
అందుకే సి.యం సీట్ కి అయ్యారు ఫిక్స్

కాని 150 వ సినిమ చూడాలి అనే అభిమానుల కోరికను మరిచారు
తన మన్సులొ ఉన్న మాటను బయట పరిచారు

యు టి.వి ప్రారంబోత్సవం లొ జరిగింది ఈ సంఘటణ
ఇక సినిమాలు చేయను అని చేసారు సంచలన ప్రకటణ

బాస్ మీరు ప్రకటించిన ఈ రిటైర్మెంట్
మాకు లేకుండ చేస్తుంది ఆ మెగా ఎంటర్ టైన్మెంట్

మీ ప్రకటన ప్రతి ఒకరి అభిమాని మది లొ లేకుండ చేసింది ఉత్తేజం
మీ నిర్ణయం ఎవరికి ఇష్టం లేదు అనేది నిజం

మీరు సినిమాలకి అవుతుండటంతొ దూరం
ఆ కళామతల్లి మీద పడింది మోయలేని భారం
మొన్న విలేకరుల ప్రశ్నకి మీరు పలికి ఉంటే మౌనం
మున్ముందు పరిస్థుతుల బట్టి మర్చుకోని ఉండే వారు మీ విధానం
బాగుంది మీరు ప్రజా జీవితం కి అంకితం అవ్వాలనే ఆలొచన
అందుకు ముగుంపు పలకాల్సిన అవసరం లేదు మీరు నటన
ప్రజల్లొకి మీ అలోచనలు మరింత తీసుకోని పోడానికి ఉపయోగ పడుతుంది సినిమా మాద్యమం
అలాంటి అస్త్రాన్ని మీరు వదులుకోవటం కాదు బావ్యం
నేను సి.యం రేసు లొ ఉన్నాను అని చొప్పడమే అయ్యి ఉండొచ్చు మీ ద్యేయం
కాని ఆ ప్రకటన మీకు మేలు కంటే చెడు ఎక్కువ చేస్తునదనే మా అభిప్రాయం

రక్త సంబంధం లేకున్న మీతొ మాకు ఎర్పడింది విడతియలేని బందం
మీరు సి.యం అవుతున్నారంటే అందరికంటే మాకు కలుగుతుంది ఎక్కువ ఆనందం
సినిమా నటిస్తు కూడ టార్గెట్ చెయ్యొచ్చు సి.యం
సినిమా ద్వార కొనసాగే మెగా ఇమేజ్ మీకు ఆ ఉన్నత పదవి చేస్తుంది ఖాయం
అందుకనే అమోదించండి మా విజ్ఞప్తి
150 సినిమా తీసి కలిగించండి మాకు మెగా తృప్తి

జి.సునిల్
మెగా ఫ్యాన్

Friday, June 17, 2011

వాడు-వీడు

వాడు-వీడు

సినిమా లొ ఉంటే వైవిథ్యము
విజయం తథ్యము

అని నిరుపిస్తున్నాడు తన చిత్రాలతొ బాల
అతని దెగ్గర నుంచి మన దర్శకులు నేర్చుకోవాలి చాల

రియాల్టికి దెగ్గరగా తీసాడు బాల వాడు-వీడు చిత్రం
సినిమ అందదు రోటిన్ చిత్రాలకు ఏ మాత్రం

చిత్రం లొ ప్రతి ఒకరు చూపించారు తమ విశ్వరూపం
ప్రతి సన్నివేశం అనిపిస్తుంది ఎంతొ అపురూపం

కథ పట్టించుకోకుండ మన వాళ్ళు చేస్తున్నారు చాల కర్చు
కాని బాల చిత్రాలు వాళ్ళ అభిప్రాయల్ని కచ్చితంగా మార్చు

విశాల్ పక్కన పెట్టాడు స్టార్ డం కార్డ్
తన నటనకి ఆశించొచ్చు జాతియ అవార్డ్

చిత్రం కనిపిస్తుంది మాంచి మాస్ మసాల
మాస్ అంటె ఇష్ట పడే వాళ్ళు చెస్తారు హాల్ లొ గొల

నుతనత్వాన్ని మన తెలుగు వారు ఎప్పుడూ ఆదరించారు
అందుకె ఈ సినిమాకు తమ ప్రేమను పంచారు

జి.సునిల్

Friday, June 10, 2011

భారీతనం తొ మెప్పించిన బద్రీనాథ్



మెప్పించిన బద్రీనాథ్

చ్చింది మెగా అభిమానులు ఎదురుచూసిన బద్రీనాథ్ రిలీజ్ అయ్యే మెగా డే
అన్ని థియేటర్స్ మెగా అభిమానులతొ నిండింది ఆల్ ది వే

విడుదలకు ముందు భారీ అంచనాలతొ అందరిలొ క్రియేట్ చేసింది హీట్
అందరి అంచనాలను నిజం చేస్తూ సినిమా ఇచ్చింది అందరికి మెగా ట్రీట్

అర్జున్ కి మెగా హిట్ ఇవ్వాలని అరవింద్ గారు ఖర్చు చేసారు చాల దనం
అందుకే ప్రతి ఫ్రేం లొ కనిపించింది ఆ భారీ తనం

మరోక్క సారి గీతా ఆర్ట్స్
తమ ప్రోడక్షన్ వ్యాల్యుస్ తొ కొల్లకొట్టింది అందరి హార్ట్స్

వి.వి.వినాయక్ వహించాడు ఈ సినిమాకు మెగా దర్శకత్వం
తన ప్రతి సినిమాలాగే ఈ సినిమాలోను చూపించాడు తన భారీ తత్వం

తన గురువు దెగ్గర బద్రీనాథ్ శిక్షణ పొంది అవుతాడు క్షేత్రపాలకుడు
నియమించపడుతాడు బద్రీనాథ్ ఆలయానికి రక్షకుడు

బద్రీనాథ్ ఆలయం తొ పాటు, నయనానందం కలిగిస్తుంది అక్కడ ఉన్న వసుదార
రెండు కనులు చాలవు చూడటానికి అక్కడ ప్రదేశపు అందాలు,తనువుతీర

బద్రీనాథ్ తెలుసుకుంటాడు తమన్న కు ఉందని అపాయం
ఇస్తాడు తనకి,ఆలయం తెరిచిన రోజు మళ్ళి జ్యొతి దర్శనం చేయిస్తా,అనే అభయం

గురువు శిక్షణ లొ బద్రీనాథ్ అవుతాడు ఎవరు ఎదిరించలేని శక్తి
తమన్న కోసం వచ్చిన దుండగులు బద్రీని గాయ పరుస్తారు ఉపయోగించుకొని దైవ భక్తి

ఇచ్చిన మాట కోసం బద్రీ,బళ్ళారి వెళ్తాడు తీసుకొని రావటం కోసం అలకనంద
దాని వల్ల బద్రినాధ్ పడాల్సి వస్తుంది దైవత్వం మరిచాడు అనే అపనింద

అలకనంద ప్రేమని గ్రహించి,గురువు తెలుపుతాడు బద్రీ అవ్వనవసరం లేదు తనకు వారసుడు
అవ్వమంటాడు అలకనంద కి ప్రేమికుడు

భారీతనం తొ ఈ సినిమా అందరి మనసుని దోచుతుంది
దైవత్వం,ప్రేమ ప్రాముఖ్యతని మరొసారి చాటుతుంది


జి.సునిల్
మెగా ఫ్యాన్ 


Sunday, June 5, 2011

ఉన్మాద చర్యలు ఆపాలి

ఉన్మాద చర్యలు ఆపాలి

మరొసారి ఖమ్మం లొ ఘోరమెన చర్యకి పాల్పడింది ఉన్మాదం
కఠినమైన చర్యలు తీసుకొవటం లేదు కనుకనే ప్రతి సారి ఇది చేయటాని దొరుకుతుంది ఆమోదం

సంఘటన జరిగినపుడల్ల జరుగుతుంది హడవుడి
ఎంత జరిగిన శరమాములుగా జరుగుతు వొస్తుంది ఈ దాడి

ఒకరి ప్రాణం అన్యాయంగా తీసుకొడానికి ఏవరు ఇచ్చారు వాళ్ళకి హక్కు
కఠినమైన శిక్షతొ దీనికి పెట్టాలి చేక్కు

ఎన్నాళ్ళు ఇలా బలి అవ్వాలి స్త్రీ
అర్దరాత్రి కాదుకద పగలే తిరగలేకున్నారు వారు ఫ్రీ

బలి అయిన అమ్మాయిల తల్లితండ్రులు వారికి వుంటుంది అనుకున్నారు బంగారు భవిత
ఇలా జరగటం వళ్ళ వారు చెందుతున్నారు కలత

కాలేజ్ వెళ్ళిన అమ్మాయి క్షేమంగా వస్తుంది అనుకుంటారు ఇంటికి
ఇలాంటి ఉన్మాద చెర్యల వల్ల కనిపించకుండ పొతున్నారు ఆ అశలు పెట్టుకున్న తల్లితండ్రుల కంటికి

ఈ చర్య చెసిన అతని తల్లితండ్రులు కూడ అతని బంగారు బవిషత్తుపై చెస్తుండొచ్చు కలలు
అతని ఈ పేశాచిక చర్య వల్ల ఇప్పుడు ఎత్తలేకున్నారు వారి తలలు

ఈ చర్య వళ్ళ ఏవరికి కలిగింది సంతొషం?
ఏవరికి ఆనందం కలిగించనపుడు ఏందుకు పాల్పడాలి ఇలాంటి అమానుషం?

ఇలాంటి వాటికి పాటుపడిన వారిని చూస్తే అనిపిస్తుంది ఛీ ఛీ ఛీ
ఆంధ్రలో ఉన్న ప్రతీ ఆడవారితో చెప్పుతో కొట్టించాలి వారిని చాచి

చాలా ప్రభావితం చేస్తుంది సినిమా సమాజం
అందుకే ఇలాంటి సంఘటనలు అయ్యాయి సహజం

ఆడవారిని గొరవించే దేశమిది
అలాంటి దెశంలొ ఉండకూడొద్దు ఉన్మాది

అందరు కలిసి ఇలాంటి చర్యలు పాలు పడెవాళ్ళకి బుద్ది చొప్పాలి
తత్ద్వార ఈ అమానుషాని ఆపాలి

"యత్ర నార్యస్తు పూజంతె రమంతె తత్ర దెవతా"
ఇట్లు
జి. సునీల్