Friday, November 25, 2016

ఆదర్శదంపతులు

 ఆదర్శదంపతులు
మేము చేరుకున్నాం మా పెద్ద దిక్కు ఉండే ఊరు  
అదే మా పెద్ద మేనత్త, మామ నివసించే కోదుమురు

అందరం చాలా ఆప్యాయంగా పిలుస్తాం అంటూ పెద్దక్క
ఆమే దెగ్గరికి వెళ్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరకటం పక్క

వారు ఇరువురు నేల తల్లి నమ్ముకున్న రైతులు
ఎంతో కష్టించి పైకి వచ్చారు పుణ్య దంపతులు 

మనకు ఎన్నో నేర్పుతాయి వారి జీవిత ప్రయాణం 
అణ్యోన్య దాంపత్యంకి నిలివెత్తు నిదర్శనం

మా వేడుకలలొ వారే నిలువెత్తు సంప్రదాయం
వారి ఆప్యాయ పలుకుతొ మా కష్టాలు అవుతాయి మాయం

ఎప్పుడూ కొరుకుంటారు ఎల్లప్పుడూ బాగుండాలి అందరి మధ్య బంధాలు
మా ప్రతి పనికి పాటిస్తాం వారు చుపే మార్గదర్శకాలు  

మాకు ఎప్పుడూ మంచి చేస్తాయి మీ ఆలోచన విధానం
అవి మాకు దొరికిన గొప్ప బహుమానం

మాకు దొరికారు ఎల్లప్పుడూ మా వెన్నుదన్నుగా ఉండే పెద్ద దిక్కు
అలా దొరకటం మా అందరి పుర్వ జన్మల చేసుకున్న లక్కు

మాకు ఎప్పుడూ కావాలి మీ పెద్దరికం
మీతొ గడిపిన ప్రతి ఘడియ మా జీవితానికి ఒక మధుర జ్ఞాపకం

దంపతులు, ప్రేమ మమతలు కలయిక
వారి ప్రేమానురాగాలు నూరేళ్ళు సాగాలనేది మా కోరిక  
 
శుభాకాంక్షలతో
 జి.సునిల్,
గోకర రాములు కుటుంబ సభ్యులు

Thursday, November 24, 2016

మీనమ్మ


మీనమ్మ 

ప్రతి రోజు ఉదయాన్నే వస్తుంది ఫోన్
టేం అయ్యింది లేవరా అని వినిపిస్తుంది టోన్

మధ్యానం అడుగుతుంది చేసావా బోజనం
చేసాను అంటేనే కుదుట పడుతుంది తన ప్రాణం

సాయంత్రం అడుగుతుంది వచ్చావా క్షేమంగా
తెలుసుకున్నాక పడుతుంది తన మనసు ఎంతో ఆనందంగా 

పడుకునే ముందు తెలుసుకుంటుంది రాత్రి భొజన సమాచారం 
మళ్ళీ మరుసటి రోజు అవుతుంది లేపే అలారం 

పనిలో పడి ఎప్పుడైన పొరపాటున చిరకు చెందిన మారదు పైన పద్దతి
ఎందుకంటే ఆమే మనసు కుదట పడదు తెలుసుకునే అంత వరకు కొడుకు క్షేమ స్థితి   

ఎల్లపుడూ తన మనసు
కోరుకుంటుంది మా శ్రేయస్సు   

దన్యవాదములు అమ్మ 
నీ సంతానమే అవుతాం ప్రతి జన్మ 

జి.సునిల్ 

Tuesday, November 8, 2016

నల్ల ధనం పై ఉక్కుపాదం

నల్ల ధనం పై ఉక్కుపాదం 


ఈ రోజు మన నరేంద్ర మోడి
సంచలనమైన నిర్ణయంతొ చేసారు నల్ల ధనంపైన దాడి

చాల మంది ప్రదానిని చులకన చేస్తారు అంటు చాయి వాలా
కాని ఆయన నిర్ణయం అందరు అంటున్నారు వాహ్ వాహ్   

దేశ ప్రయోజనాల దృశ్య తప్పదు ఇటువంటి నిర్ణయాలు
అప్పుడే కాపాడు కలుగుతాం దేశ ప్రయొజనాలు

చెల్లవు ప్రస్తుతం ఉన్న 500, 1000 నోట్లు
ఇక మోదలైయ్యాయి నల్ల ధనం దాచుకున్నవాలకు పాట్లు

తగిలాయి వాళ్ళకి పంచులు
ఎమి చేయాలో అర్దం కావటం లేదు నోట్లు దాచుకున్న సంచులు

దొంగ నొట్లకు పలకోచ్చు ముగింపు
చేయగలుగుతాం అరాచక శక్తులను అదుపు 

డబ్బులు తీసుకోవటంలొ తప్పవు కొన్ని రోజులు మనకి తిప్పలు
కాని మార్పు కోసం సహకరించక తప్పదు ప్రజలు

ఈ చారిత్రాత్మక నిర్ణయానికి పలుకుదాం స్వాగతం
మన సహకారంతొ పలుకుదాం ప్రభుత్వానికి సమ్మతం

మోడిజీ మీరు అయ్యారు మా శ్రేయస్సు కలిగించి, రిస్క్ టేకర్
మీరే నవభారత కింగ్ మేకర్
     

జి.సునిల్

Monday, November 7, 2016

కార్తీక సోమవారం

కార్తీక సోమవారం

వచ్చింది నేడు ఎంతో విశిష్టమైన కార్తిక సోమవారం
ఉపవాసంతొ ఎంతో భక్తితొ పరమశివుని పూజించాం మనం అందరం

భక్తి పారవశ్యంతొ శివ నామస్వరంతొ మారుమోగాయి దేవాలయాలు
కోరుకుంటు ఆ బోలా శంకరుడిని చేయమని మన జీవితానికి మేలు

తేజొవంతంగా ఉన్నాయి ఆలయంలోని ప్రతి దీపం
ఎక్కడ చూసిన కనిపించింది ఆ త్రినేతృడి జపం   

మది పులకించింది దెవలయాలో ప్రతి వైనం
నయనానికి ఆనందం కలిగించింది దేవుడి దర్శనం

దేవుడా, ఆమోదించు మా ప్రతి విన్నపం
మాకు ఎల్లపూడూ అందించించు నీ ఆశిర్వాదం

మన్నించు మేము తెలియక చేసే తప్పులు
నీ దివ్య ఆశిసులతో మాకు కలిగించు ప్రతి పనిలొ విజయాలు

ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
జి.సునిల్