Thursday, November 24, 2016

మీనమ్మ


మీనమ్మ 

ప్రతి రోజు ఉదయాన్నే వస్తుంది ఫోన్
టేం అయ్యింది లేవరా అని వినిపిస్తుంది టోన్

మధ్యానం అడుగుతుంది చేసావా బోజనం
చేసాను అంటేనే కుదుట పడుతుంది తన ప్రాణం

సాయంత్రం అడుగుతుంది వచ్చావా క్షేమంగా
తెలుసుకున్నాక పడుతుంది తన మనసు ఎంతో ఆనందంగా 

పడుకునే ముందు తెలుసుకుంటుంది రాత్రి భొజన సమాచారం 
మళ్ళీ మరుసటి రోజు అవుతుంది లేపే అలారం 

పనిలో పడి ఎప్పుడైన పొరపాటున చిరకు చెందిన మారదు పైన పద్దతి
ఎందుకంటే ఆమే మనసు కుదట పడదు తెలుసుకునే అంత వరకు కొడుకు క్షేమ స్థితి   

ఎల్లపుడూ తన మనసు
కోరుకుంటుంది మా శ్రేయస్సు   

దన్యవాదములు అమ్మ 
నీ సంతానమే అవుతాం ప్రతి జన్మ 

జి.సునిల్ 

No comments: