Monday, November 7, 2016

కార్తీక సోమవారం

కార్తీక సోమవారం

వచ్చింది నేడు ఎంతో విశిష్టమైన కార్తిక సోమవారం
ఉపవాసంతొ ఎంతో భక్తితొ పరమశివుని పూజించాం మనం అందరం

భక్తి పారవశ్యంతొ శివ నామస్వరంతొ మారుమోగాయి దేవాలయాలు
కోరుకుంటు ఆ బోలా శంకరుడిని చేయమని మన జీవితానికి మేలు

తేజొవంతంగా ఉన్నాయి ఆలయంలోని ప్రతి దీపం
ఎక్కడ చూసిన కనిపించింది ఆ త్రినేతృడి జపం   

మది పులకించింది దెవలయాలో ప్రతి వైనం
నయనానికి ఆనందం కలిగించింది దేవుడి దర్శనం

దేవుడా, ఆమోదించు మా ప్రతి విన్నపం
మాకు ఎల్లపూడూ అందించించు నీ ఆశిర్వాదం

మన్నించు మేము తెలియక చేసే తప్పులు
నీ దివ్య ఆశిసులతో మాకు కలిగించు ప్రతి పనిలొ విజయాలు

ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
జి.సునిల్ 

No comments: