ఆదర్శదంపతులు
మేము చేరుకున్నాం మా పెద్ద దిక్కు ఉండే ఊరు
అదే మా పెద్ద మేనత్త, మామ నివసించే కోదుమురు
అందరం చాలా ఆప్యాయంగా పిలుస్తాం అంటూ పెద్దక్క
ఆమే దెగ్గరికి వెళ్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరకటం పక్క
వారు ఇరువురు నేల తల్లి నమ్ముకున్న రైతులు
ఎంతో కష్టించి పైకి వచ్చారు ఈ పుణ్య దంపతులు
మనకు ఎన్నో నేర్పుతాయి వారి జీవిత ప్రయాణం
అణ్యోన్య దాంపత్యంకి నిలివెత్తు నిదర్శనం
మా వేడుకలలొ వారే నిలువెత్తు సంప్రదాయం
వారి ఆప్యాయ పలుకుతొ మా కష్టాలు అవుతాయి మాయం
ఎప్పుడూ కొరుకుంటారు ఎల్లప్పుడూ బాగుండాలి అందరి మధ్య బంధాలు
మా ప్రతి పనికి పాటిస్తాం వారు చుపే మార్గదర్శకాలు
మాకు ఎప్పుడూ మంచి చేస్తాయి మీ ఆలోచన విధానం
అవి మాకు దొరికిన గొప్ప బహుమానం
మాకు దొరికారు ఎల్లప్పుడూ మా వెన్నుదన్నుగా
ఉండే పెద్ద దిక్కు
అలా దొరకటం మా అందరి పుర్వ జన్మల చేసుకున్న
లక్కు
మాకు ఎప్పుడూ కావాలి మీ పెద్దరికం
మీతొ గడిపిన ప్రతి ఘడియ మా జీవితానికి ఒక మధుర జ్ఞాపకం
ఈ దంపతులు, ప్రేమ మమతలు కలయిక
వారి ప్రేమానురాగాలు నూరేళ్ళు సాగాలనేది మా కోరిక
శుభాకాంక్షలతో
జి.సునిల్,
గోకర రాములు కుటుంబ సభ్యులు
No comments:
Post a Comment