గోవిందా గోవిందా
(Written After Seeing Que at Wine Shops Today)
అంటాం కాపాడు గోవిందా గోవిందా..
వచ్చినప్పుడు మనకు ఆపద....
ఇప్పుడు కాన రావట్లేదు ఆ ఏడుకొండల స్వామి దేవుడు..
ఏనాడైనా అనుకున్నామా వస్తుందని అలాంటి నేడు....
తిరుపతిలో అనువనువు పొందేవాళ్ళం భక్తి పారవశ్యం..
కరోనా మహమ్మారి వలన లేకుండా అయింది నేడు మనకు ఆ దృశ్యం....
ఓ దేవా..
ఈ కరోనా నుండి మాకు ఎమైన నేర్పాలని అనుకున్నావా??....
అలా ఎలా మారుతాము అనుకున్నావు ప్రభువా..
45 రోజుల శ్రమ ఒక మందు దొరకడంతో మార్చుకున్నాం మా తోవా....
కరోనా కరోనా అంటూ ఇన్ని రోజులు పడ్డాం భయం..
మందు దొరుకుతుంది అంటే ప్రతీది అయింది మాయం....
దొరికితే చాలు అనుకున్నాం బీరు ..
కరోనా కూడా చేసాం భేకాతరు....
మా ముందు చెల్లవు నీ మాయజలం..
ఎందుకంటే మేము అనుకుంటాం, మేము ఎదురులేని మానవులం....
చావు మా ముందు దాడి చేయటానికి రేడిగా ఉన్నా నేర్చుకోము..
కొద్ది క్షణాల తృప్తి కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలని వదులుకుంటాము....
నీ వల్లే కాకపోతే ఎవరి వల్ల అవుతుంది ఏడు కొండల వాడా..
మమల్ని క్షమించి ఎప్పుడూ మాకు కల్పించు నీ నీడ....
ఎవరికీ లేదు ఇందరి కష్టాన్ని తృణప్రాయంగా వృధా చేసే హక్కు..
మనని మనం కాపాడు కోవడం తప్ప లేదు ఎటువంటి వేరే మ్యాజిక్కు....
ఆశీస్తున్నాము ప్రతి ఒకరు మారుతారని..
త్వరలో ఈ సమస్య పోయి నిన్ను తిరుపతిలో దర్శించుకోవాలి గోవిందా గోవిందా అని....
జి.సునిల్
No comments:
Post a Comment