Wednesday, April 20, 2022

నాన్నా మిస్ యూ

                                               నాన్నా మిస్ యూ


 నీ జీవితాన్ని చేసావు నిర్లక్ష్యం

చేకూర్చాలని నీ పిల్లలకు బంగారు భవిషత్తు లక్ష్యం

 

నిరంతరం తపించావు మా బాగోగులు

ధైర్యంగా ఎదుర్కున్నావు జీవితంలోని కష్టాలు

 

భావించావు పిల్లల భవిష్యత్తే  నీ భవిష్యత్తు

ఎన్ని ఆటుపోట్లు ఎదురు అయినా చేర్చావు నీ పిల్లల్ని ఎంతో ఎత్తు

 

నీ కష్టానికి పిల్లల బంగారు భవిషత్తుతో అవుతుంది అనుకున్నావు సుఖాంతం

అంతలోనే మమ్మల్ని విడిచి, చేసావు మమ్మల్ని ఏకాంతం

 

ఎన్నీ ఉన్నా మాకు ఎవరూ భర్తీ చేయలేరు నీ చోటు

మాకు ఎప్పుడూ ఉంటుంది నీలా ధైర్యాన్ని అందించే లోటు 

 

నీ చెంత చేరేవాడిని కష్టం వచ్చిన మరు క్షణం

ఇప్పుడు అర్దం కావట్లే ఎటు వెళ్ళలో వస్తే అటువంటి తరుణం

 

ఎవరూ పూడ్చలేనిది నీ స్థానం

ఎవరూ చేయలేరు నీలా నిస్వార్థ ప్రేమ వైనం

 

నాన్నా మిస్ యూ

ఎప్పటికీ పై నుంచి నీ చల్లని ఆశీర్వాదంతో అందించు మా పై నీ వ్యూ

 

 

జి.సునిల్

(Written on 20.04.22)

No comments: