Thursday, June 4, 2026

నట విశ్వరూపం చూపిన పెద్ది

 



నట విశ్వరూపం చూపిన పెద్ది


పెద్ది సినిమాతో మరో స్థాయికి చేరింది రామ్ చరణ్ నటన

ప్రతి సన్నివేశం అయింది ప్రతి సినీప్రేమికుడికి ఒక నజరానా


పెద్ది సినిమా రామ్ చరణ్ రెండేళ్ల కష్టం

సినీ అభిమానుల కోసం దేనికైనా రెడీ అని మరోసారి చేశారు స్పష్టం


ఆటే తన పొగరు

ఏ క్రీడ చూసినా మారుమోగుతుంది తన పేరు


తను ఒక క్రాసోవర్ అథ్లెట్

పోరాటంతో సాధిస్తాడు తన ఊరికి రైలు తేవాలనే టార్గెట్


ప్రాణాన్ని కూడా లెక్క చేయడు పొందడానికి వారి ఆత్మగౌరవం

మెగా వారసుడు సమకూర్చాడు ఈ పాత్రకి కావాల్సిన జీవం


ప్రతి ఒక్కరిలో అత్యుత్తమ నటనను వెలికితీశారు బుచ్చిబాబు

తనకు సినిమాపై ఉన్న ప్రేమకు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు కితాబు


ప్రతి సన్నివేశం ఉత్తేజపరిచింది రెహమాన్ సంగీతం

ఇతర నటులు కూడా తమ అత్యుత్తమ నటనతో చేశారు అందరిని ప్రభావితం


ఈ సినిమా తెలుపుతుంది జీవితంలో ఎంత ముఖ్యమో గెలుపు

ప్రతి ఒక్కరు దాని కోసం ప్రయత్నిస్తే పొందుతారు జీవితంలో మలుపు


సినిమా చూడని వాళ్లు ఇక లేటేంటి

భూమిపై మళ్లీ పుడతామా ఏంటి


తిరుగులేని మూవీ మా పెద్ది

ప్రతి సినీ అభిమాని చెబుతున్నాడు బల్ల గుద్ది.


బ్లాక్ బస్టర్ కొట్టినందుకు మెగా అభిమానులు మెలేస్తున్నారు మీసం

నిజంగా అదృష్టం దొరికినందుకు మెగా పవర్ స్టార్ లాంటి హీరో మా కోసం

 

జి.సునిల్, మెగా ఫ్యాన్

No comments: