అదిరిపోయే మన జీవిత క్లైమాక్స్
మన జీవితంలో ఏ విషయంలో పడవద్దు రాజీ
అప్పుడు ఈ చరిత్రలో మనకంటూ ఉంటుంది ఒక పేజీ
వయసులో మనం చూపగలిగితే సాధించాలనే కసితో పనితనం
అపుడు ఎవరీ మీద ఆధారపడకుండా హాయిగా ఉంటుంది ముసలితనం
మనం ఎవరికీ కాకూడదు భారం
మనతో గడపాలని ఉత్సాహపడాలి మన తర్వాతి తరం
ఆ వయస్సు కాదు చదవటానికి భగవద్గీత
ఆ వయస్సులో నువ్వు అందరినీ ఉత్తేజపరిచి అవ్వాలి జీవితంలో విజేత
ఆ వయస్సు కాదు మూలకు కూర్చోని లేకుండా ఎటువంటి కదలిక
నీ పిల్లలు నీ కోసం చూసేలా చేయాలి నీ రాక
ముసలితనం కాదు కృష్ణా రామా అనుకునే వయస్సు
ప్రపంచాన్ని చేధించి ఉత్సాహ పడాలి మన మనస్సు
ఉండొద్దు అనుకునేలా వీడికి వృధా అన్నం పెట్టే కంచం
ఉండాలి వీడు మనతో అనుకునేలా ఈ ప్రపంచం
అనుకుంటున్నా ప్రతీదీ సాధించు
నీ క్లైమాక్స్ ఎంత విలాసంగా ఉంటుందొ చూపించు
చావు గురించి నువ్వు చూడొద్దు క్లాక్
నువ్వు ఇచ్చే క్లైమాక్స్ అవ్వాలి అందరికి మైండ్ బ్లాక్
జి.సునిల్
1 comment:
Wow...real truth about old age life
Post a Comment