Wednesday, September 11, 2019

గ్రీన్ స్టార్ ఉత్సవకమిటి,ఖమ్మం (25yrs Celebrations)


గ్రీన్ స్టార్ ఉత్సవకమిటి,ఖమ్మం
(25yrs Celebrations)
25 సంవత్సరాల క్రితం ప్రారంభం అయ్యింది గ్రీన్ స్టార్ ఉత్సవ కమిటి
అందరి సహకారంతో నేడు అన్ని ఉత్సవ కమటీలలో అనిపించుకుంటుంది మేటి

అందుకు కారణం అప్పుడు ప్రారంభించిన యువతరం
వారు, స్వామి సేవ ఏనాడు భావించలేదు భారం

వారి కృషితో ఒక ఆద్యాత్మిక కేంద్రంగా మారింది బాలాజీ నగర్ ప్రాంగణం
25 సంవత్సరాలుగా ఖమ్మం వాసులు చూడకలుగుతున్నారు వేడుకుల వైభవం

స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం పొందారు ప్రోత్సాహం
స్వామి సేవకే ఎల్లపుడూ చూపారు వారు ఉత్సాహం
’
ప్రతి కార్యక్రమం చేసారు ఎంతో సంప్రదాయ బద్దంగా
స్వామి ప్రసన్నం చేసుకోవటమే ధ్యేయంగా

స్వామి సేవకే వారు ఎల్లపుడూ అంకితం
ఘనమైన వేడుకలు సమిష్టి కృషి యొక్క ఫలితం

మేము ఎప్పుడూ ఘనంగా పలికాం గణపతికి ఆహ్వానం
మేము ఎప్పుడూ చూపించాము భక్తి శ్రద్దలతో వారిపై అభిమానం

నేటి తరం యువత అయ్యింది అప్పటి యువతరంతో పాటు సభ్యులు
మరింత బలంతో ఘనమైన వేడుకలు చేసి పొందాం స్వామి ఆశీస్సులు

మా అదృష్టం, దోరకటం స్వామి సన్నిధి
వారు అయ్యారు మా అందరి అభివృద్ధి వారధి

మేము ఎన్నడూ మరువము స్వామి అందించిన చేయుత
ఎల్లపుడూ స్వామి సేవకే ఉంటాం మా యువత

స్వామి ఆశీస్సులు మా బలం
మేము గర్వంగా చెప్పుకుంటాం మేము బాలాజీ నగర్  వాసులం

ఇట్లు
మీసునిల్

Sunday, March 31, 2019

మా ప్రియమైన మామగారికి పదవి విరమణ మరియు నూతన గృహ ప్రవేశ శుభాకంక్షలు


మా ప్రియమైన మామగారికి పదవి విరమణ మరియు నూతన గృహ ప్రవేశ శుభాకంక్షలు

మా సాయి మామ గారు విధి నిర్వహణలో చూపారు ఎప్పుడూ నిజాయితి
చూపిన అంకిత భావం తనకు తెచ్చింది ఎనలేని ఖ్యాతి

జైలుకి వచ్చిన ఖైదీలతో ఎప్పుడూ ప్రవర్తించలేదు జైలు అధికారిగా
ఎప్పుడూ మెలిగారు వారిని సన్మార్గంలో తీసుకోని వెళ్ళే ఒక కుటుంబ సభ్యుడిగా

మా మామగారి వ్యవహార శైలి ఎంతో సౌమ్యం
విజేతగా నిలిచారు జీవితంలోని ప్రతి గమ్యం

మా మామ గారు చేయగలిగారు అంటే జైత్రయాత్ర
అందులో మరువలేనిది వారికి అండగా నిలిచిన మా అత్త గారి పాత్ర

వారి లక్షణాలని అనుసరిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు
వారి క్రమశిక్షణ దారి వళ్ళే, వారు కూడా నేడు నిలిచారు జీవితంలో విజేతలు

మా మామ గారు నిలిచారు విధిలో తోటి వారికి ప్రేరణ
చాలా సంతృప్తిగా చేసారు పదవి విరమణ

నేడు ప్రవేశం చేస్తున్నారు తన కల అయిన నూతన గృహం
వారి కల సాకారం, మా అందరిలో అవుతున్నది ఆనంద ప్రవాహం

మా మామ గారు జీవితంలో ఎంతో సాధించారు
మా అందరికి ఆదర్శంగా నిలిచారు

అందరు భావిస్తారు ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం
కాని తనను నమ్మిన వారికి ఇంక ఎమైన చేయాలని తపిస్తుంది తన హృదయం

ఇంత ఉన్నత భావలు కలిగిన మా మామ గారు దొరకటం మా అదృష్టం
కోరుకుంటున్నాము చాల హ్యాపిగా సాగాలని వారి శేష జీవితం

ఇట్లు
జి.సునిల్ 

Wednesday, March 27, 2019

St. Francis De Sales High School (SFS) Silver Jubilee Celebrations (Written on request of Aruna Aunty)

 

St. Francis De Sales High School (SFS) Silver Jubilee Celebrations

రేపటి పౌరులను దేశ నిర్దేశించే వారుగా తీర్చాలని Machew Mundamattam గారి కల

ఆ మహోన్నతమైన ఆలోచనకి దృశ్య రూపమే SFS పాఠశాల 
 

ప్రారంభించినప్పుడు ఒక మార్గదర్శకంగా ఉండాలని స్థాపించారు 
ఆ విలువలు పాటించటం వలనే ఖమ్మంలో నెం.1 గా పాఠాశాలను నిలిపారు


మెరుగైన విధ్యతో మార్చాలనుకున్నాము ప్రతి విధ్యార్థి జాతకం
ప్రతి ఒకరి కృషితో ఇక్కడి ప్రతి విధ్యార్థి ఎగురవేస్తున్నారు విజయ పతాకం


ప్రతి తల్లిదండ్రులకు మాట ఇచ్చాం తమ పిల్లలను చేస్తామని అగ్రగ్రామి
సమర్దవంతమైన అధ్యాపకులతో నిలబెట్టుకున్నాము ఆ హామి

ఇక్కడి ప్రతి టీచర్
స్నేహపూర్వక వాతావరణంలో తీర్చిదిద్దుతున్నారు ప్రతి  విధ్యార్థి ఫ్యూచర్

ఈ పాఠశాలకు లభించింది బొంతు ప్రసాద్ గారి నాయకత్వం
వారి దిశా నిర్దేశంలో ముందు అడుగులు వేస్తున్నారు  ఈ దేశా వారసత్వం


అన్ని రంగాలలో పిల్లల గెలుపే మా ఆశయం
పేరంట్స్, స్టూడెంట్స్, అందరి సహకారంతో అవుతున్నాం జయం


ఈ రోజుతో చేసుకుంటున్నాం 25 సంవత్సరాలు పూర్తి
నేడు ఆవిష్కరించే పుస్తకంలో ప్రచురించాము ఇప్పటి వరకు మేము సాధించిన కిర్తి

ఇంతే అంకిత భావంతో సాగుంతాం రాన్నున్న రోజులు
మా ప్రతి ప్రయత్నం, మా పిల్లలని చేయటమే ప్రతి రంగంలో విజేతలు 

OUR EVERY STUDENT SAY LOUD
BEING SFS STUDENT IS A MOMENT OF PROUD

ఉన్నత భావాల సమ్మేళనం...జనసేన




ఉన్నత భావాల సమ్మేళనం...జనసేన

ప్రజా శ్రేయస్సు కోరకు మన జనసేనాని అయ్యారు రేడి
తన ఆశయాలు నచ్చి జత కట్టారు మన జెడి

నిజాయితికి మారు పేరు మన జెడి లక్ష్మీనారాయణ
పదివిలో ఉన్నంత కాలం తన సేవలకు పొందారు ప్రజల అపూర్వ ఆదరణ

ఎప్పుడూ పాటించారు జీవితంలో విలువలు
ప్రజలకు సేవ కన్నా ఎక్కువ కాదు అనుకున్నారు పదవులు

తనకు ఉంది అపారమైన మేధా శక్తి
వారి ప్రతి ఆలోచన చేస్తుంది ప్రజలను బాధ నుంచి విముక్తి

గర్వంతో రెపరెపలాడుతుంది జనసేన జెండ
తన జనసేనానికి జెడి గారి లాంటి వ్యక్తి దొరికినందుకు అండ

ఇరువురు తపిస్తారు తీర్చాలని ప్రజల ఆవేదన
ఇరువురి లక్ష్యం సమ సమాజ స్తాపన

చాలా ఉన్నతమైనది వారి ఇరువురి లక్ష్యం
ఖచ్చితంగా ఇరువురికి చేకూర్చాలి అఖండ విజయం

జనసేన గెలుపు నూతన రాజకీయాలకు శ్రీకారం
ప్రజల మేలు చేసే కార్యక్రమలతోనే ఉంటుంది జనసేన అధికారం

జెడి గారి రాకతో విశాఖ
అభివృద్ధి చేందనుంది ప్రతి శాఖ

గుర్తుంచుకోండి మన గుర్తు గాజు గ్లాసు
ఓటు వేస్తే మన దరి చేరుతుంది ప్రజా సంక్షేమం చేకూర్చే మనసు

జ.... జనం    న.... నచ్ఛే   సే....సేవ   న.. నందిస్తుంది

Tuesday, March 26, 2019

జయహో లక్ష్మీ నరసింహ (BAPATLA MLA CANDIDATE)


జయహో లక్ష్మీ నరసింహ

నరసింహ గారికి ఉన్నాయి ఉన్నత భావాలు
సమాజానికి మంచి చేయాలి అనే వైపు ఎప్పుడూ ఉంటాయి తన ఆలోచనలు

ఎప్పుడూ తీసుకున్నారు సమాజ సేవ చేసే వ్యక్తులను ఆదర్శంగా
వారి ప్రతి సూచనలను చేసుకున్నాడు తన జీవిత భాగంగా  

ఎప్పుడూ విడలేదు నమ్మిన సిద్దాంతం
ఆ లక్షణమే తెచ్చింది జన శ్రేయస్సు కోరే జనసేన టికేట్ సొంతం 

సొంత ఊరి మేలు కోరకు వద్దు అనుకున్నాడు లక్షల ఉద్యోగం
పుట్టిన ఊరి పురోగతిలోనే ఉంది అనుకున్నాడు నిజమైన జీవిత యోగం

నరసింహ గారు టెక్నాలజీ మరియు రైతు కష్టం తెలిసిన నాయకుడు
గెలిపిస్తే అవుతాడు రైతు కష్టం తీర్చే యోధుడు

ప్రజా వ్యతిరేక పనులపై చూపుతాడు లక్ష్మీ నరసింహ ఉగ్రరూపం
ప్రజా శ్రేయస్సు చేసేటప్పుడు అవుతాడు వారి బాధ తీర్చే ప్రతిరూపం

ఎంతో శ్రద్ద చూపుతాడు ప్రజా సమస్య పట్ల
అటువంటి నాయకుడు దోరికితే ప్రగతి పదంలో ఉంటుంది బాపట్ల

ఇస్తే తనకు ఒక అవకాశం
సమస్యలు దరి చేరవు మీ ప్రదేశం

ఇచ్చి చూడండి తనకు ఈ ఎన్నికల్లో ఉన్నత స్తితి
అది బాపట్ల అభివృద్దికి ప్రజలు ఇచ్చే నిజమైన బహుమతి
                                                                                                                       
ఇప్పుడు మనం అందరం ఇస్తే నరసింహ గారికి చేయుత
ప్రతి ఒకరికి ఖచ్చితంగా ఆదర్శం అవుతాడు ఈ యువ నేత 

జ.... జనం    న.... నచ్ఛే   సే....సేవ   న.. నందిస్తుంది

Tuesday, January 1, 2019

నూతన సంవత్సర శుభాకాంక్షలు




నూతన సంవత్సర శుభాకాంక్షలు 


ఎంజాయ్ చేద్దాం డియర్  
వస్తున్నందుకు 2019 న్యూ ఇయర్

సంబరాలతొ పలుకుదాం కొత్త సంవత్సరానికి స్వాగాతం
మరిచిపోదాం ఒక వేళ మన జీవితంలొ జరిగివుంటే చేదు గతం

ఈ కొత్త సంవత్సరం
కావాలి మనం కోరుకునే ప్రతీది ఇచ్చే ఒక అందమైన వరం

ఈ కొత్త సంవత్సరం, తుడిచేయాలి ప్రస్తుతం సమాజంలొ ఉన్న గందరగోళం 
ఆనందనిలయంగా అవ్వాలి ఈ భూగోళం

ఈ కొత్త సంవత్సరంలొ ఈ ప్రపంచం
అవ్వాలి ఎల్లపుడూ అన్ని దేశాలలో శాంతిని కాపాడే కవచం

కొత్త ఆలోచనలతో చేసుకుందాం మన జీవితంలో మెరుగులు 
తద్ద్వార వేద్దాం మున్ముందుకు అడుగులు

గత సంవత్సరపు ప్రతి కష్టం యొక్క ఫలితం
ఈ సంవత్సరం మనకి అవ్వాలి అంకితం


365 రోజులు మన జీవితంలొ ఉండాలి ఆనందం
365
రోజులు మన మధ్య ఉండాలి చక్కటి అనుబంధం

ఈ కొత్త సంవత్సరం మనం కొరుకునే విధంగా ఉంటుంది కచ్చితంగా
ఆ ఆశ తొ గడుపుదాం మొత్తం ఇయర్ సంతోషంగా

అలా అందరం ప్రతి విషయాని తీసుకుందాం పాజిటివ్ గా
అది మన అందరిని ఉండేలా చేస్తుంది ఎల్లప్పుడూ ఎనర్జిటివ్ గా

నూతన సంవత్సర శుభాకాంక్షలతొ

మీ సునిల్



Sunday, December 23, 2018

నాన్న నువ్వు ఉండీ ఉంటే బాగుండు


నాన్న నువ్వు ఉండీ ఉంటే బాగుండు
నాన్న నేడు నూతన గృహంలో పెడుతున్నాను పాదం
కోరుకుంటున్నాను నీ చల్లని ఆశిర్వాదం

ఎప్పుడూ అలోచించే వాడివి ఉండాలి మనకంటూ ఒక గూడు
నేటితొ నీ ఇరువురు కుమారులు సాదించిన వేళా....

నాన్న నిజంగా నువ్వు ఉంటే బాగుండు

నాన్న నేడు మా ముందు ఉంది నీ కలల ప్రతిరూపం
నిజంగా నువ్వు ఉండి ఉంటే, నేటి ప్రతి క్షణం అయ్యేది ఎంతో అపురూపం

అయినా నిన్ను మా నుంచి దూరం చేయలేకపోయింది చావు
కనిపిస్తున్న ఇంటిలో నువ్వే కనిపిస్తున్నావు నాన్న ప్రతి అనువు   

మా మధ్యలోనే నువ్వు ఉండి చూస్తున్నావు అనే అభిప్రాయం మా అందరికి కలుగుతుంది 
అందుకే శుభకార్యం జరుగుతున్న ప్రదేశం ఆనందంతో వెలుగుతుంది

ఈ కల సాకారంలో మాకు అనిపించలేదు శ్రమ
అందుకు కారణం ఎక్కడ ఉన్న నువ్వు మాపై కురిపించే ప్రేమ

నేడు విచ్చేసే అందరు తమ చల్లని ఆశిస్సులతో దీవించండి నా ఈ ప్రయత్నం
మీ అందరికి పలుకుతున్నా నా హృదయపూర్వక స్వాగతం

ఇట్లు
మీ సునిల్


Wednesday, December 12, 2018

అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

 

అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు
నెరవేరాలి మీ జీవితంలో అన్ని ఆకాంక్షలు 

మీరు ఉంటారు ఎప్పుడూ మా గుండేల్లో 
మా ప్రతి అడుగు ఉంటుంది మీరు చూపే దారిలో

మీరు ఉన్నారు మా గుండెల నిండ
మేము ఉంటాం ఎప్పుడూ మీకు అండ 

అన్న, గెలుపు ఓటములు సహజం
స్వచమైన మన బందం మాత్రం నిజం 

అన్న మన బందం ఎంతో దృడమైనది 
ఎన్ని వచిన్నా తట్టుకొని గెలిచే అంత బలమైనది 

తప్పక సాద్దిదాం మన ఆశయం
తప్పక ఉంటుంది మా అందరి సహాయం

కలిసిగట్టుగా సాగుదాం ముందుకు అన్న
మాకు ఎవరు కాదు ఎక్కువ మీ కన్న

మన బందాన్ని ఇలాగే సాగించటం ముఖ్యం 
తప్పక మనం చేరుకుందాం మన లక్ష్యం 

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో
మీ అభిమానులు 

Tuesday, October 16, 2018

వెల్ డన్ శ్రవణ్



                            వెల్ డన్ శ్రవణ్

తన ఆలోచనని అద్బుత దృశ్యంగా చూపాలని ప్రయత్నిస్తాడు ప్రతి డైరక్టర్ 
తను జీవించిన తరువాతే తేరకేక్కిస్తాడు ప్రతి క్యారెక్టర్

అలా జీవించిన తరువాతే ప్రారంబించాడు శ్రవణ్ తన డ్రీం ప్రాజెక్ట్
చాలా మంచి సినిమాతో ప్రయత్నిచాడు అవ్వాలని ప్రతి ఒకరిని కనెక్ట్


తొలి చిత్రంతో ఎవరూ చేయరూ సందేశం ఇచ్చే డేరు 
కాని అలా ప్రయత్నించిన శ్రవణ్ సినిమా మన మదిలో ఎప్పటికి ఉంటుంది స్టొరు  
 
ప్రతి పాటలో ఉంది చాలా గొప్ప బావం
అవీ సినిమాకి ఇచ్చింది చాలా మంచి జీవం

ఎక్కడా తగ్గలేదు మాటల్లొ పదును
ప్రతి మాట మంచి సందేశం అందించే జోను

అందరూ కొత్త నటులతో చేసాడు చాల మంచిగా హాండిల్
ఇప్పటి నుంచే కొత్త వారికి అవకాశం ఇచ్చి చూపాడు తన మంచి దిల్

తన పరిదిని కొంచెం కుదించింది బడ్జెట్ లోటు
ఇంకా కొంచెం ఆర్దిక స్వేచ్చ ఉండుంటే సినిమా ఉండేది ఎవరికి అందని చోటు

అలా అని ఎక్కడా ఇవ్వలేదు తన ఆలోచనని తగ్గించే ఆస్కారం
తన ప్రయత్నానికి తప్పక అందుతుంది అందరి పురస్కారం

సినిమా తయారు చేయటం కోసం పెట్టాడు తన సర్వస్వం 
ఇప్పుడు ఆర్దిక ఇబ్బందుల వళ్ళ తన కలను చూసుకోవటంలో అవ్వుతుంది కొంచెం జాప్యం

ఆశిస్తున్నా త్వరగా దాటుతాడు ఈ కష్టాల గట్టు
రానున్న రోజుల్లో ఉన్నత స్తాయిలో ఉంచనుంది తనకు సినిమ మీద ఉన్న పట్టు

తనకు ఉంది అన్ని శాకల్లో మంచి ప్రావిణ్యం
అందుకు నీదర్శనమే తనను సిని లోకానికి పరిచయం చేస్తున్న సినిమ సైన్యం


సినిమా అందించింది చాల మంచి సందేశం
శ్రవణ్, అందరూ గర్వ పడే స్తాయికి తప్పక తీసుకెళ్తుంది నీ ఈ సిని ప్రవేశం


నీకు ఉన్నాయి నీ తల్లిదండ్రుల ఆశిస్సులు
తప్పక జీవితంలో నేరవేరుతాయి నీ అన్ని ఆశలు



వెల్ డన్ శ్రవణ్
ఆశిస్తున్నాం రానున్న రోజుల్లో అవ్వాలి సిని ప్రపంచాన్ని ఏలే నంబెర్ వన్
 
MOVIE TRAILER:

నీ శ్రేయోభిలాషి
జి.సునిల్   

Monday, October 15, 2018

రాజకీయ ప్రక్షాళణ కోసం జనసైనికుల కవాతు


రాజకీయ ప్రక్షాళణ కోసం జనసైనికుల కవాతు
జనసేన వైపే ఉన్నారు ప్రజలు యావత్తు
రుజువు చేసింది నేడు సత్తా చాట్టిన కావాతు 

జనసేనికులతో నిండిపోయింది దవళేశ్వరం
మోగించారు పవర్ఫుల్ సమరం

జనసైనికులు తల్లి భారత ముద్దు బిడ్డలు
దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కోదమసింహాలు 

కవాతులో జరిగింది అశేష జనసైనికుల ప్రభంజన
సమాయుక్తం అయ్యారు చేయటానికి అవినీతి ప్రక్షాళన

సగటు రాజకీయ వ్యవస్థ అవుతున్నది నిర్వీర్యం
ఒక విప్లవం తెచ్చి కవాతు ద్వార ఇవ్వాలి అనుకున్నారు ప్రజలకి దైర్యం

కవాతు ద్వార జనసైనికులు అయ్యారు సిద్దం
చేయాటానికి కుల్లి పోయిన రాజకియ వ్యవస్థపై యుద్దం

కవాతు ముఖ్య ఉద్దేశంపై ఇచ్చారు క్లారిటీ
తెలిపారు జనసైన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టి

భాద్యతాయుత పదవికి కావాలి అనుభవం
అనుభవజ్ఞుడికి మద్దత్తు ద్వారా 2014 లో చేయాలనుకున్నారు మంచి ప్రభావం 

ఓట్లు చీలకుండా ప్రజా సంక్షేమం కొరకు చేసారు నిస్వార్ద సహాయం
కాని ఆ ప్రయత్నం నేరవేర్చలేదు తన ద్యేయం

వారసత్వంతో రాజకీయ ప్రవేశంకీ పడలేదు బీజం
సి.యం అవ్వాలనే ప్రజల స్వచ్చమైన కోరిక అవుతుంది నిజం


జనసైనికులు తెలుగు జాతిని గౌరవించే వాళ్ళం 
అవమానాలు ఎక్కువ అయితే తాట తీస్తాం

పంచాయితి ఎన్నికలు పేడితే చూపుతాం మా సత్తా చాటుతాం
ప్రజలకు అందవలసిన సంక్షేమ పదకాలు అందేలా చేస్తాం



ప్రజా సంక్షేమం అనే బలమైన ఆలోచనతో ముందుకు వెళ్దాం
దౌర్జన్యమైన వ్యవస్థ ముళ్ళును ముళ్ళుతోనే తాట తీద్దాం

కావాతు  జయప్రదంచేసిన ప్రతి జనసైనికుడికి దన్యవాదము
సమిష్టి కృషితో గెలిచి జనసేన పాలనలో వేద్దాము అభివృద్ది వైపు పాదము

జి.సునిల్ 

Thursday, October 11, 2018

ద్వీతియ సంవత్సరములోకి మా చిన్నారి హిమశ్రీ

ద్వీతియ సంవత్సరములోకి మా చిన్నారి హిమశ్రీ

హిమశ్రీ, నీవు మా జీవితంలోకి వచ్చి నేటితో ఒక సంవత్సరం
గ్రహించి ఉంటావు నీకు కింద రాసిన అందరు నీ సొంతం  

నీకు ఉన్నాడు నాన్న పెంచటానికి అల్లారు ముద్దుగా
నీ కోసం అన్ని సమకూర్చటానికి ఆకాశమే హద్దుగా
నీకు ఉన్నది అమ్మ ప్రేమ లాలన
మంచి మార్గదర్శం అందించే ఆమే పాలన

నీకు ఉంది ఎప్పుడూ మీ అందరిపై ప్రాణం పెట్టుకునే నాని
మీ అందరి అల్లరి కదలికలే అమే అందరికి చేప్పుకునే అందమైన కహాని

నీకు ఉంది ప్రేమ అందించే అమ్మమ
నీకు ఉన్నాడు తాత ఎప్పుడూ అలోచించే ఎమీ చేస్తున్నది నా చిట్టి బొమ్మ

నీకు ఉన్నాడు అండగా ఉండే అన్న
ఎవరూ కాదు తనకు నీకన్న మిన్న

నీకు ఉన్నారు ఇద్దరు ప్రేమించే అక్కలు
మీ ముగ్గురు మార్చాలి ఆడ పిల్లలపై ఉన్నచులకనపు లెక్కలు

నీకు దొరికింది రోజు నిన్ను చూడందే నిద్రపోని మేనత్త
ప్రాణం ఊరుకోదు రోజు హల్లొ చేప్పించుకోకపోతే నీ చేత

నీకు ఉన్నాము మేమందరం
మేము అందించే ఆశిస్సులతో నీవు ఎక్కాలి ఉన్నత శిఖరం

నీకు ఈ  సంవత్సరంలో ఖచ్చితంగా గ్రహించి ఉంటావు ఒక లోటు
కానీ గ్రహించు ప్రసాద్ తాతది ఎప్పుడూ మన మనసుల్లో చేరిగిపోని మరచిపోలేని చోటు
 

నాకు ఎల్లపుడూ నచ్చేది  ఎప్పుడూ కనిపించే నీలోని ప్రశాతంత
ఆ లక్షణమే  ఉంచుతుంది విజయం ఎప్పుడూ నీ చెంత


ఎల్లపుడూ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యములతో సుఖ సంతోషాలతో వర్ధిలాలి అని ఆశిస్తూ

పుట్టినరోజు శుభాకాంక్షలతో

నీ పెద్దనాన్న
సునిల్

Monday, October 8, 2018

వైభవంగా జరగనున్న బతుకమ్మ పండుగ


వైభవంగా జరిగిన బతుకమ్మ పండుగ 

బతుకమ్మలతొ ముస్తాబు అయ్యాయి తెలంగాణ లొని ప్రతి ఊరు
గుర్తు తెచ్చాయి చిన్ననాటి జ్ఞాపకాలు మరొ మారు 

అంగ రంగ వైభవంగా జరిగింది తెలంగాణ బతుకమ్మ
చల్లగ చూడాలి మమ్మల్ని అని, ప్రజల పూజలు అందుకుంది అమ్మ గౌరమ్మ

తమ కష్టాలను తొలగించి సాఫిగా తమ జీవితం సాగాలని ప్రతి ఒకరు చేసారు ప్రార్దన
ఆ గౌరమ్మ తల్లిని వేడుకున్నారు వినాలని తమ వేదన 

అమ్మ, జీవితం బతుకమ్మలా రంగుల సువాసనల పూల వలె, అందంగా ఉండాలని దీవించు 
నీ చల్లని ఆశిస్సుల కోసమే చాల భక్తి శ్రద్దలతొ పూజించింది తెలంగాణ ఆడపడుచు 

వివిధ రంగుల, వివిధ సువాసనల పూలతో బతుకమ్మలను చేసారు  అలంకారం 
ప్రతి పేదవాడికి అందుబాటలో ఉండి ఈ పండుగా వారికి కలిగించదు ఎటువంటి భారం 

కలిసినప్పుడు భాదలొ ఉన్న సోదరికి, తొడు ఉన్నవారు ఇచ్చారు అభయం
చేస్తారు ఆ బాధ తొలగించే సాయం

బతుకమ్మలొని వాడే పూలు కలుషితం కాకుండ చూస్తాయి చేరువులొని నీళ్ళు
దీని బట్టి తెలుస్తుంది, ఒక అర్దం ఉంటుంది ఎది చేసిన మన పెద్దవాళ్ళు 

    బతకమ్మ వేడుకల్లొ చాల కమ్మగా వినిపించింది మా ఆడపడుచుల స్వరం
ఘనంగా జరగాలి ఈ పండుగ ప్రతి సంవత్సరం

తెలంగాణ సాంప్రదాయన్నికి ఈ పండుగ ఒక ప్రతీక…..
చూపుతుంది మా ఆడపడుచుల కలయిక 

మన సంప్రదాయలే మన బలం………
                                             వాటిని మనం చేసుకుందాం పదిలం                                                        

 మీ సునిల్