Monday, October 8, 2018

వైభవంగా జరగనున్న బతుకమ్మ పండుగ


వైభవంగా జరిగిన బతుకమ్మ పండుగ 

బతుకమ్మలతొ ముస్తాబు అయ్యాయి తెలంగాణ లొని ప్రతి ఊరు
గుర్తు తెచ్చాయి చిన్ననాటి జ్ఞాపకాలు మరొ మారు 

అంగ రంగ వైభవంగా జరిగింది తెలంగాణ బతుకమ్మ
చల్లగ చూడాలి మమ్మల్ని అని, ప్రజల పూజలు అందుకుంది అమ్మ గౌరమ్మ

తమ కష్టాలను తొలగించి సాఫిగా తమ జీవితం సాగాలని ప్రతి ఒకరు చేసారు ప్రార్దన
ఆ గౌరమ్మ తల్లిని వేడుకున్నారు వినాలని తమ వేదన 

అమ్మ, జీవితం బతుకమ్మలా రంగుల సువాసనల పూల వలె, అందంగా ఉండాలని దీవించు 
నీ చల్లని ఆశిస్సుల కోసమే చాల భక్తి శ్రద్దలతొ పూజించింది తెలంగాణ ఆడపడుచు 

వివిధ రంగుల, వివిధ సువాసనల పూలతో బతుకమ్మలను చేసారు  అలంకారం 
ప్రతి పేదవాడికి అందుబాటలో ఉండి ఈ పండుగా వారికి కలిగించదు ఎటువంటి భారం 

కలిసినప్పుడు భాదలొ ఉన్న సోదరికి, తొడు ఉన్నవారు ఇచ్చారు అభయం
చేస్తారు ఆ బాధ తొలగించే సాయం

బతుకమ్మలొని వాడే పూలు కలుషితం కాకుండ చూస్తాయి చేరువులొని నీళ్ళు
దీని బట్టి తెలుస్తుంది, ఒక అర్దం ఉంటుంది ఎది చేసిన మన పెద్దవాళ్ళు 

    బతకమ్మ వేడుకల్లొ చాల కమ్మగా వినిపించింది మా ఆడపడుచుల స్వరం
ఘనంగా జరగాలి ఈ పండుగ ప్రతి సంవత్సరం

తెలంగాణ సాంప్రదాయన్నికి ఈ పండుగ ఒక ప్రతీక…..
చూపుతుంది మా ఆడపడుచుల కలయిక 

మన సంప్రదాయలే మన బలం………
                                             వాటిని మనం చేసుకుందాం పదిలం                                                        

 మీ సునిల్ 

No comments: