Thursday, October 11, 2018

ద్వీతియ సంవత్సరములోకి మా చిన్నారి హిమశ్రీ

ద్వీతియ సంవత్సరములోకి మా చిన్నారి హిమశ్రీ

హిమశ్రీ, నీవు మా జీవితంలోకి వచ్చి నేటితో ఒక సంవత్సరం
గ్రహించి ఉంటావు నీకు కింద రాసిన అందరు నీ సొంతం  

నీకు ఉన్నాడు నాన్న పెంచటానికి అల్లారు ముద్దుగా
నీ కోసం అన్ని సమకూర్చటానికి ఆకాశమే హద్దుగా
నీకు ఉన్నది అమ్మ ప్రేమ లాలన
మంచి మార్గదర్శం అందించే ఆమే పాలన

నీకు ఉంది ఎప్పుడూ మీ అందరిపై ప్రాణం పెట్టుకునే నాని
మీ అందరి అల్లరి కదలికలే అమే అందరికి చేప్పుకునే అందమైన కహాని

నీకు ఉంది ప్రేమ అందించే అమ్మమ
నీకు ఉన్నాడు తాత ఎప్పుడూ అలోచించే ఎమీ చేస్తున్నది నా చిట్టి బొమ్మ

నీకు ఉన్నాడు అండగా ఉండే అన్న
ఎవరూ కాదు తనకు నీకన్న మిన్న

నీకు ఉన్నారు ఇద్దరు ప్రేమించే అక్కలు
మీ ముగ్గురు మార్చాలి ఆడ పిల్లలపై ఉన్నచులకనపు లెక్కలు

నీకు దొరికింది రోజు నిన్ను చూడందే నిద్రపోని మేనత్త
ప్రాణం ఊరుకోదు రోజు హల్లొ చేప్పించుకోకపోతే నీ చేత

నీకు ఉన్నాము మేమందరం
మేము అందించే ఆశిస్సులతో నీవు ఎక్కాలి ఉన్నత శిఖరం

నీకు ఈ  సంవత్సరంలో ఖచ్చితంగా గ్రహించి ఉంటావు ఒక లోటు
కానీ గ్రహించు ప్రసాద్ తాతది ఎప్పుడూ మన మనసుల్లో చేరిగిపోని మరచిపోలేని చోటు
 

నాకు ఎల్లపుడూ నచ్చేది  ఎప్పుడూ కనిపించే నీలోని ప్రశాతంత
ఆ లక్షణమే  ఉంచుతుంది విజయం ఎప్పుడూ నీ చెంత


ఎల్లపుడూ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యములతో సుఖ సంతోషాలతో వర్ధిలాలి అని ఆశిస్తూ

పుట్టినరోజు శుభాకాంక్షలతో

నీ పెద్దనాన్న
సునిల్