Sunday, March 31, 2019

మా ప్రియమైన మామగారికి పదవి విరమణ మరియు నూతన గృహ ప్రవేశ శుభాకంక్షలు


మా ప్రియమైన మామగారికి పదవి విరమణ మరియు నూతన గృహ ప్రవేశ శుభాకంక్షలు

మా సాయి మామ గారు విధి నిర్వహణలో చూపారు ఎప్పుడూ నిజాయితి
చూపిన అంకిత భావం తనకు తెచ్చింది ఎనలేని ఖ్యాతి

జైలుకి వచ్చిన ఖైదీలతో ఎప్పుడూ ప్రవర్తించలేదు జైలు అధికారిగా
ఎప్పుడూ మెలిగారు వారిని సన్మార్గంలో తీసుకోని వెళ్ళే ఒక కుటుంబ సభ్యుడిగా

మా మామగారి వ్యవహార శైలి ఎంతో సౌమ్యం
విజేతగా నిలిచారు జీవితంలోని ప్రతి గమ్యం

మా మామ గారు చేయగలిగారు అంటే జైత్రయాత్ర
అందులో మరువలేనిది వారికి అండగా నిలిచిన మా అత్త గారి పాత్ర

వారి లక్షణాలని అనుసరిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు
వారి క్రమశిక్షణ దారి వళ్ళే, వారు కూడా నేడు నిలిచారు జీవితంలో విజేతలు

మా మామ గారు నిలిచారు విధిలో తోటి వారికి ప్రేరణ
చాలా సంతృప్తిగా చేసారు పదవి విరమణ

నేడు ప్రవేశం చేస్తున్నారు తన కల అయిన నూతన గృహం
వారి కల సాకారం, మా అందరిలో అవుతున్నది ఆనంద ప్రవాహం

మా మామ గారు జీవితంలో ఎంతో సాధించారు
మా అందరికి ఆదర్శంగా నిలిచారు

అందరు భావిస్తారు ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం
కాని తనను నమ్మిన వారికి ఇంక ఎమైన చేయాలని తపిస్తుంది తన హృదయం

ఇంత ఉన్నత భావలు కలిగిన మా మామ గారు దొరకటం మా అదృష్టం
కోరుకుంటున్నాము చాల హ్యాపిగా సాగాలని వారి శేష జీవితం

ఇట్లు
జి.సునిల్ 

No comments: