నాన్న నువ్వు ఉండీ ఉంటే బాగుండు
నాన్న నేడు నూతన గృహంలో పెడుతున్నాను పాదం
కోరుకుంటున్నాను నీ చల్లని ఆశిర్వాదం
ఎప్పుడూ అలోచించే వాడివి ఉండాలి మనకంటూ ఒక గూడు
నేటితొ నీ ఇరువురు కుమారులు సాదించిన వేళా....
నాన్న నిజంగా నువ్వు ఉంటే బాగుండు
నాన్న నేడు మా ముందు ఉంది నీ కలల ప్రతిరూపం
నిజంగా నువ్వు ఉండి ఉంటే, నేటి ప్రతి క్షణం అయ్యేది ఎంతో అపురూపం
అయినా నిన్ను మా నుంచి దూరం చేయలేకపోయింది చావు
కనిపిస్తున్న ఇంటిలో నువ్వే కనిపిస్తున్నావు నాన్న ప్రతి అనువు
మా మధ్యలోనే నువ్వు ఉండి చూస్తున్నావు అనే అభిప్రాయం మా అందరికి కలుగుతుంది
అందుకే శుభకార్యం జరుగుతున్న ప్రదేశం ఆనందంతో వెలుగుతుంది
ఈ కల సాకారంలో మాకు అనిపించలేదు శ్రమ
అందుకు కారణం ఎక్కడ ఉన్న నువ్వు మాపై కురిపించే ప్రేమ
నేడు విచ్చేసే అందరు తమ చల్లని ఆశిస్సులతో దీవించండి నా ఈ ప్రయత్నం
మీ అందరికి పలుకుతున్నా నా హృదయపూర్వక స్వాగతం
ఇట్లు
మీ సునిల్
No comments:
Post a Comment