Friday, June 29, 2018

మిస్ యు బ్రదర్

మిస్ యు బ్రదర్ 

నీవు లేవనే వార్త వినగానే తమ్ముడు
నిజంగా అనిపించింది ఉన్నాడా ఆ దేవుడు

ఇంత కష్టపడిన నీకు చేస్తాడు అనుకున్నాం సాయం
కలలో కూడా అనుకోలేదు చేస్తాడు ఇంతటి అన్యాయం

నీ పోరాట పటిమ చూసి అనుకున్నాం అవుతావు విజేత
కాని ఆ దేవుడు తన కఠొర హృదయంతో పాటించమన్నాడు విది రాత

నీ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టింది మాతృత్వం
చివరికి ఆ త్యాగానికి  లేకుండా చేసాడు ఆ దేవుడు ఫలితం

ఈ వయస్సులో ఆసర అవుతావు అనుకున్నాడు బాబాయి
ఇప్పుడు తట్టుకోలేకున్నాడు బాధ, లేనందుకు ఇక తన సహయపడే ఒక చేయి

నిజంగా జోహార్లు పలకాలి నీ సహదర్మచారిణికి
భూమి కూడా తల వంచక తప్పుదు ఆమే సహనానికి


అనుకున్నది నువ్వు ఉంటే చాలు
ఆమే కష్టానికి ఫలితం దొరికితే నిజంగా ఉండేది ఎంతో మేలు


ఎల్లపూడూ నువ్వు కోలుకోవాలని శ్రమించారు తోబుట్టువులు
ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకొని నయం అవ్వాలని ప్రార్ధించారు బందువులు

 అర్దం అవ్వటం లేదు ఎందుకు వినలేదు ఇందరి గోడు
విని ఉంటే నిజంగా ఎంత బాగుండేదో నేడు

అనిపిస్తుంది నిన్ను తన దెగ్గరికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు చూపాడు తన స్వార్దం
మంచి వాడివేన నిన్ను తన దెగ్గర ఉంచుకోవాలని మా అందరికి మిగిల్చాడు ఈ అనర్దం

మేము అనుకున్నం నీ ఉద్యోగంలో చేరుతావు ఉన్నత స్తితి
కాని అనుకోలేదు చూడవలసి వస్తుందని నీ చితి

మాకు ఎప్పుడూ మనస్సులో గుర్తు ఉంటుంది నీ నిస్వార్థ చిరు నవ్వు
ఎవరూ మరిపించలేరు నువ్వు చూపిన  అందరిపై ఆప్యాయమైన లవ్వు

మిస్ అవుతాం నీ సవాసం
ఆత్మ సాంతి చేకూర్చాలని దేవుడిని కోరుతాం నీ కోసం

జి.సునిల్ 

Sunday, May 13, 2018

భరత్ లాంటి సి.యం దోరికితే

భరత్ లాంటి సి.యం దోరికితే

మొదలుపెడుతాడు ప్రజలకు మేలు చేసే నూతన శకం
చూపుతాడు ప్రజలకు కొత్త బంగారు లోకం

ఒక సారి చేసాడంటే ప్రామిస్
తన ప్రాణం పోయిన అవ్వనివ్వడు అది ప్రజలకు మిస్

చేస్తాడు ప్రతి ఫనిని అంత:కరణ శుద్దితో
ప్రతి పని నడుస్తాడు ప్రజా హితం అనే ఆలోచనతో

అవ్వుతారు ప్రజలు బాధ్యత కలిగిన పౌరులు
వేసుకోగలుగుతారు ప్రజలు తమ హితం చూపే దారులు


ప్రజలకు ఉండదు అంధకారం
ప్రజలకి ఇస్తాడు అధికారం

అభివృద్ది ప్రతి ఒకరి దెగ్గర చేరు
సిరుల నేల అవుతుంది పల్లేటూరు 

బలహీనులకు నింపుతాడు ఉత్తేజం
సహాయం ఇస్తాడు వారి కలలను చేసేటందుకు నిజం

ప్రజల చిరునవ్వుకి అవుతాడు కారకుడు
పాలకుడి కంటే అవుతాడు ప్రజల సేవకుడు

అతను అవ్వుతాడు ప్రజలు మెచ్చే నాయకుడు
నిజంగా ప్రజల అదృష్టం దోరికితే అటువంటి జాతకుడు

అటువంటి నాయకుడిని ప్రజలే కాపాడుకుంటారు దెగ్గరుండి
కట్టుకుంటారు తమ గుండేల్లొ వారి శ్రేయస్సు కోరే దేవుడికి గుడి 


ప్రజలు ఎప్పుడూ ఆశాజీవి
ఆశిద్దాం  ప్రస్తుత ప్రతీ నాయకుడు అవ్వాలని భరత్ లా ప్రజల ప్రేమి

జి.సునిల్

Friday, May 11, 2018

మళ్ళీ అంటున్న చలో వరంగల్


మళ్ళీ అంటున్న చలో వరంగల్

వస్తుందంటే వరంగల్ చేరుగా
కలుగుతుంది నా మనస్సు పట్టలేని హాయిగా

చెయలేను మనసును ఏ మాత్రం నియంత్రణ
ఎందుకంటే ఈ క్షణం కోసం చేస్తా వారమంత నిరీక్షణ 
 
అక్కడ కలవబోతున్నా నా బంగారాలు
చూడ కలుగుతా వారు నాన్న కోసం చూపే ఆనందమయ నవ్వుళ్ళు

పెద్ద అమ్మాయితో షికార్లు
చిన్న పాపతో కబుర్లు

గడిచిపోతుంది రోజు ఒక క్షణంలా
తిరుగు ప్రయాణం ఆలోచనతో పడుతుంది మనసు డీలా  

కాని వెళ్తా మధుర జ్ఞాపకాలు మోస్తూ
మళ్ళీ వచ్చే సండే కోసం ఎదురు చూస్తూ 


మళ్ళీ అంటాకి కారణం, ఇంతకు ముందు ఒక సంవత్సరం గడిపా అలా చలో వరంగల్  అంటు, అప్పటి జ్ఞాపాకాలు కిందవి

https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post_30.html

https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post.html




        https://sunil-megafan.blogspot.in/2016/05/blog-post.html



జి.సునిల్ 

Friday, March 30, 2018

రంజింపచేసిన రంగస్థలం


రంజింపచేసిన రంగస్థలం

వారేవ్వా చిట్టిబాబు
నీ నటన లా జవాబు

తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు
మన మెగా వారసుడు

చూసాం మెగా పవర్ స్టార్ నట విశ్వరూపం
ప్రతి సన్నివేశం ఎంతో అపురూపం

చూపించాడు తన నటనలోని Variations
మించాడు అందరి Expectations
  
80వ దశకంలోకి తీసుకోని వెళ్తుంది సినిమా రంగస్థలం
ప్రతి ఒకరి అద్భుత నటన ఈ సినిమా బలం

పక్కా పల్లేటూరు వాతావరణంలోకి తీసుకోని వెళ్తాడు దర్శకుడు సుక్కు
చేసాడు ప్రతి ఒకరి నుండి మైమరిపించే నటన రాబట్టే మ్యాజిక్కు

రామలక్ష్మీగా అలరిస్తుంది సాం
లవ్లీ నటనతో తేచ్చుకుంటుంది బహూత్ నాం

విలనిజం పతాకస్థాయిలో చూపుతాడు మన జగపతి
హీరో వల్లే తెలుస్తుంది తన పేరు ఫణీంధ్ర భూపతి

రంగమత్తలా వచ్చి అనసూయ చూపింది తన నటన స్థాయి
మన హీరోతో తన ప్రతి సీన్ కలిగిస్తుంది ఎంతో హాయి

ప్రతి పాట ఎంతో చూడ చక్కగ ఉన్నది
ఆ క్రేడిట్ అంతా మన మెగా మ్యూజిక్ డైరక్టర్ దేవీది  
      
ఆది పినిశేట్టి, అన్న పాత్రలో అవ్వాలనుకుంటాడు ఊరికి నాయకుడు     
తనను కనురెప్పల కాపాడు కోవటానికి ప్రయత్నిస్తాడు మన చిట్టిబాబు లక్ష్మణుడు     

చాలా ప్రయత్నించిన కూడా తన అన్నను కోల్పోతాడు    
తన అన్న చావుకు కారణం అయిన వాళ్ళా అంతు చూస్తాడు

ఈ సినిమా ఫార్ములాకు అతీతం
అద్భుతమైన విజయం ప్రతి ఒకరి కష్ట ఫలితం
 
విభిన్నమైన కధలకు ఈ సినిమా తీసింది డోర్
ఈ లాంటి సినిమాలను కోరుకుంటున్నారు ప్రతి తెలుగు ప్రేక్షకుడు మోర్

ఇలాంటి సినిమాలు వస్తే ఆదరణ పెంచుకుంటుంది వెండితెర
మెగా అభిమానులకి ఈ సినిమా  ఒక మెగా పండుగ జాతర

జి.సునిల్
మెగా ఫ్యాన్

Saturday, March 17, 2018

అన్నప్రాసన ఆహ్వానం



అన్నప్రాసన ఆహ్వానం


నూతన సంవత్సరం నాడు పలికాం మా గోకర వారి ఆహ్వానం
మీ ఆత్మియ హృదయాలతో నిండాలని మా మేడిపల్లి నివాస ప్రాంగణం


అక్కడ వేచి ఉన్నది మా హిమశ్రీ చిన్నారి
మీ ప్రేమమయ ఆశిర్వాదం కోరి

మీ సమక్షంలో చేసుకోవాలి అనుకుంటున్నది తన అన్న ప్రాసన మహోత్సవం
తనకు ఉండదు మీ రాకను మించిన ఆనందం

తన జీవితంలో జరగనుంది ఒక ముఖ్యమైన పండుగా
మీ రాకతో అవుతుంది కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా

తను ఆన్నపూర్ణమ్మ కృపతో ఆన్నం ముట్టే సమయం
మీ రాకతో తన జీవితంలో ఎప్పుడూ ఆష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటుంది ఆ చిన్ని హృదయం   
   
అందుకోండి పెద్ద పండుగ నాడు ఈ చిరు ప్రాయంలో అందిస్తున్న పెద్ద స్వాగతం
మీ ఆశిర్వాదంతో కోరుకుంటున్నది తన జీవితంలోని ప్రతి అడుగులో జయం

మీ రాకతో కొంచమైన తీర్చుకోవాలని అనుకుంటున్నది ప్రసాద్ తాత లేని లోటు
రాకుండ చేయకండి పసి హౄదాయాన్ని గాయ పరిచే పోరపాటు

మీ సమక్షంలో ఆన్నం ముట్టించటం
అనుకోండి మా చిన్నారికి జీవితంలో కావాల్సిన ప్రతిది అందిచటం


మీ రాకకై
రవి  సుచిత్ర

Sunday, February 25, 2018

అతిలోక సుందరి



అతిలోక సుందరి 

స్వర్గం నుంచి వచ్చి నేడు స్వర్గానికి వెళ్ళారు మన అభిమాన శ్రీదేవి

ఓదార్చలేని బాధలో మునిగిపోయారు ప్రతి సిని అభిమాన జీవి 


నిజంగానే బ్రహ్మ దేవుడు మన కొంప ముంచాడు 

లేక పోతే షాకింగ్ న్యూస్ తో నిద్ర లేపాడు నేడు


ఆమే మనకు దొరికిన ఎప్పటికి మన మనుసుల్లో నిలిచే వజ్రం
అలాంటి నటి మళ్ళీ మనం చూడలేం అనేది నిజం

 

ఆమే మనకు దొరికిన అందాల ఏంజిల్
మనను అలరింప చేసింది అమే నటనలోని ప్రతి యాంగిల్

 

అందంతో పాటు అమేది ఎవరిని నొపించని గుణం
ఆమే జీవితం, నటనతో సాగింది క్షణం-క్షణం 

 

మనతో పాటు, బాలివూడ్ ని కూడా ఏలింది మన చాందిని
అందూకే యావత్ దేశం బాధ పడుతుంది ఆమే మరణ వార్త విని
 

ఆమే ప్రతి ఒకరి హృదాయలను దోచుకున్న అతిలోక సుందరి
అందరికి స్పూర్తిదాయకం ఆమే అనుసరించిన జీవితంలోని ప్రతి దారి

 

ఆమే పిల్లలకు ఉండాలనుకుంది బంగారు భవిష్యత్తు
ఫలించకుండాపోయింది ఆమే ప్రారంబించిన కసరత్తు

 

ఎంతో కష్టపడి జయించింది జీవితంలోని ప్రతి వార్
అందుకే అయింది సినిమా లోకం ఏలిన ఎకైక సూపర్ స్టార్

 

నమ్మలేని నిజం మనకు ఇక లేరని మన మకుటం లేని మహారాణి
ఎప్పటికి మన మనసుల్లో ఉంటుంది "అచ్చిక బుచ్చిక" అని పలికిన కమ్మనైన వాణి

 

ఆమే ఎప్పటికి మన మనసుల్లో నిలిచే అందమైన జ్యోతి
కోరుకుందాం దేవుడిని అందివాలని ఆమే ఆత్మకు శాంతి

 

జి.సునిల్

Sunday, December 3, 2017

కూతుర్ల సందడి






కూతుర్ల సందడి



మోన్నటి వరకు అలరించాయి హని కేరింతలు
ఇప్పుడు ఆరు (Aaradhya) రాకతో అవి అయ్యాయి రెండు ఇంతలు 
    
ఒక పక్క ప్రవర్తిక హుషారు
మరో పక్క కెరింతలతో ఆరు

ఇరువురు వళ్ళ ఇల్లు అయ్యింది అల్లరి కోలాహలం
మాకు ఆనందం అందించే కోండంత బలం

ప్రేమ వాత్సల్యం ఉంది వారి మాటల్లొ
వారి ప్రతి పలుకులు పరవల్లు ప్రాయం అవుతుంది మా గుండలోతుల్లొ

నాన్న నాన్న అంటు ఆకట్టుకుంటుంది చిన్నది
ఆమే ప్రేమ పలుకులు వర్ణించటానికి చాలవు మాటలు పరిది

చక్కటి బొమ్మలతో చూపిస్తున్నది హని తన నైపుణ్యం
కోరుకుంటున్న ఇలానే కొనసాగించాలి తన ప్రావిణ్యం

పాట వస్తే స్టెప్పులతొ మోతమోగిస్తున్నాం మా త్రయం
మంజుల వళ్ళ అవటం లేదు తట్టుకోవటం ఈ గోల మయం
 
చాల అణ్యోయంగా ఉంటున్నారు అక్కాచెల్లెళ్లు  
వారి ప్రేమ వర్ణించటానికి రావటం లేదు మాటలు



కోనసాగించాలి కోరుకుంటున్న వారి చురుకు
దేవుడిని కోరుకుంటున్నా వాళ్ళకి కావలసిన సమకుర్చే శక్తి ఇవ్వమని మాకు



తీర్చ కలిగితే వారి ఆశలు
ఈ జన్మకి అదే చాలు



జి.సునిల్

Thursday, October 5, 2017

ప్రేమ మూర్తి మా అమ్మమ

ప్రేమ మూర్తి మా అమ్మమ


 కేసముద్రం వెళ్తున్నాం అంటే ఎప్పుడూ కలిగేది మాకు చెప్పలేని ఆనందం
అక్కడ దొరికేది మా అమ్మమ మరియు మా అమ్మ తోబుట్టువులు అభిమానం
మా అమ్మమ పేరు అనసూర్య
అందరు బాగుండాలి అని ఆలొచిస్తుంది తను ప్రతి ఘడియ

ఆమే మా మల్లేశం తాతకు దొరికిన బంగారు దీపిక
ఎవరికి లేదు ఆమేకు ఉన్న అంత ఓపిక

మా తాత ఏలాడంటే సారా సామ్రాజ్యం
అందుకు కారణం వెనుక ఉండి మా అమ్మమ ఇచ్చిన దైర్యం 
 
ఒక పక్క అందరికి అందించేది మురిపాలు
మరో పక్క వంటి చేత్తో నడిపించేది ఇంటి కార్యకలపాలు

అమేకు ఉండేది భూదేవికి ఉండే సహనం
ఆ ఓర్పు వల్లే సాఫిగా సాగింది అంత పిల్లలతో కూడ జీవనం
  
ఎంత పని చేసిన మా అమ్మమ శ్రమ అని అనుకోలేదు ఏ నిమిషం
అమే శ్రమను మరిపించేలా చేసేది తన పిల్లలు పొందే సంతోషం

అండగా నిలిచింది ఎప్పుడైన తన పిల్లలు పడుతుంటే పాట్లు
వేసింది తన పిల్లలు పైకి ఎదగటానికి మెట్లు
ఆమే వల్లే ఇల్లు అయ్యింది ఆనందాల హరివిల్లు
ఆమే వల్లే ఇంట్లో ఎప్పుడూ ఉండేది సిరిజల్లు

ఎప్పుడూ మా అమ్మమది ప్రేమ అందించే మనస్తత్వం
అందుకే వారి పిల్లలు కూడ అంది పుచ్చుకున్నరు ఆ ప్రేమ అందించే వారసత్వం

పరిపూర్ణ మాతృమూర్తికి మా అమ్మమ ప్రతీక
అమేతో మేము గడిపిన ప్రతి క్షణం మా అందరి జీవితంలొ ఒక మధుర జ్ఞాపిక 

మా అందరి అదృష్టం దొరికినందుకు తన బందనం
అమే అందించిన ప్రేమకు వహిస్తున్నాం సిరస్సు వంచి వందనం

జి.సునిల్

Saturday, August 12, 2017

గుండెల్లో అలజడి


గుండెల్లో అలజడి

లేదు ఇంట్లొ నా కుతుర్ల హడవుడి
గుండెల్లొ మొదలు అయ్యింది అలజడి

మనసు అంటుంది చల్
పరుగులు తీయి వరంగల్

కాని వెళ్ళకుండ చేసింది వృత్తి పరిమితి 
ఇధే విధి ఆడే వింత పరిస్థితి

కనబడుట లేదు డ్యాన్స్ చేసే ప్రవర్తిక 
మళ్ళీ వచ్చే అంత వరకు ఇంట్లో సందడి లేదు ఇక  

నాన్న నాన్న అంటుందంట చిన్న సుందరి
మిస్ అవుతున్నా మా రోజు వారి సంగితపు కచేరి

ఇంక రోండు రోజులు 
చూడాలంటే నా ప్రేమ కలిగిన అల్లరి అమ్మాయిలు 

ఘనంగా చేసుకోబోతున్నాం  మన పంద్ర ఆగష్ట్ మహోత్సవము
ఆ రోజు  కలగనుంది ఈ బాధ నుంచి నాకు కూడ స్వాతంత్ర్యము   

జి.సునిల్  

Saturday, July 22, 2017

ఆత్మియ బంధము "మా ఆరాధ్య"



ఆత్మియ బంధము "మా ఆరాధ్య"

మా జీవితంలోకి ప్రవేశించింది ఆరాధ్య
తన అక్క లాగా మాకు ఆనందంతొ చేసింది మరింత సయోధ్య

అప్పుడే ఒక సంవత్సరం పూర్తి అయ్యిందా అని కలుగుతుంది మాకు ఆశ్చర్యము 
అలా మమ్మల్ని మైమరిపించేలా చేసింది తన ప్రేమతోకూడిన స్వరము  
 
పొందింది తన అక్కతో పాటు సమానమైన స్థానము
ఎంతో ప్రేమతో ఉంటుంది తను చూపే ఆత్మియము

ఆరాధ్య ఆఫిస్ నుంచి వచ్చే నాకు ఇస్తుంది హార్దిక స్వాగతము
తన చిరు నవ్వు చూసిన వెంటనే నా భాదలు అవుతాయి అంతము

తను మాకు దొరికిన గాన కోకిల
రోజు మా ఇంట్లొ వినిపిస్తుంది సంగితపు గల గల

తన అక్కతో పోల్చుకుంటే చాలా విషయాల్లో తను చూపుతుంది మోనము
అలా అని అనుకునేలోపలే కొన్ని విషయాల్లో నేగ్గించుకుంటుంది తన పంతము

ఇంట్లో ఎక్కడ చూసిన కనిపిస్తుంది తన ఆందించే ఆనందపూ ప్రవాహము
మమ్మల్ని ఎంతో ఉత్తేజ పరుస్తుంది తను చూపే ఉత్సాహము

తన అక్కకి తన చెల్లి అంటే చాల ఇష్టము
ఒకరికోకరు మంచి స్నేహితులు అవుతారు అనేది చాల స్పష్టము


ఇంట్లో పాట మోదలు అయ్యింది అంటే స్టార్ట్ అవుతాయి మా ముగ్గిరి స్టెప్పులు
మా ముగ్గిరి గోలతో తప్పవు మంజులకి తిప్పలు 


మాకు దొరికిన ఇరువురు కూమార్తేలు
మాకు రెండు కనులు


ఎంతో ఆనందంతో చేసాము మా జీవితంలో ఇరువురిని ఆహ్వానము
ఆశిస్తున్నాము వారు జీవితంలో ప్రతి విషయంలో పొందితారు విజయ మార్గము


మా అదృష్టం మాకు దొరికిన ఈ ఇరువురి బంధము
మాకు ఒకటే కోరిక వారి జీవితంలో ఎప్పుడూ అవ్వాలి ఆనందం శాశ్వతము


ఈ రోజు తనను ఆశిర్వదించిన ప్రతి ఒకరికి దన్యవాదము
మీ ప్రతి ఒకరి దీవేనలు అవ్వాలి తన జీవితంకి కోడంత బలము


జి.సునిల్

Sunday, June 25, 2017

రైతు సంక్షేమ నేత కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు (Written on request of my colleague)

 రైతు సంక్షేమ నేత కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు

కెసిఆర్ గారు రైతుల గురించి ఆలోచిస్తారు అనునిత్యం
ఇది మన అందరికి తెలిసిన సత్యం

కెసిఆర్ గారికి ప్రాణం రైతన్న
వారికి అందివాలి అనుకున్నారు ఎల్లప్పుడూ రైతులకు అభయంగా ఉండే అన్న

వారు ఎంచుకున్నారు కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారి లాంటి రైతు ప్రేమి
రైతు కష్టాలు తీర్చే వారి రాకతో ఆనందంతొ ఉప్పోంగిపొతుంది తెలంగాణ భూమి 

ఎంతో నమ్మకంతో వారికి ఈ బాధ్యతలు ఇచ్చారు మన తెలంగాణ రధసారధి
కెసిఆర్ గారికి నమ్మకం వారు ఖచ్చితంగా అవుతారు ప్రభుత్వాని రైతులకు మధ్య నమ్మకమైన వారధి

ఉద్యమనేతకు  ఇచ్చారు కెసిఆర్ గారు సముచిత స్థానం
కష్ట పడ్డ ప్రతి ఒకరిని కెసీర్ గారు మరువరు అనటానికి మరొక్క నిదర్శనం  
 
22 సంవత్సరాలు అందించారు సహకార సంఘం అధ్యక్షుడిగా సేవలు
ప్రతి నిమిషం శ్రమించారు రైతు మొఖంలొ చూడటానికి చిరునవ్వులు 
 
కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు రైతు సమస్యలు తెలిసిన రైతు బిడ్డ
ఎప్పుడూ కొరుకుంటారు పసిడి పంటలతో ఉండాలని తెలంగాణ గడ్డ

ఎల్లప్పుడూ కోరుకుంటారు రైతు సంక్షేమం
రైతు కళ్ళలో ఆనందం చూడటమే వారి జీవిత ద్యేయం   

మీ నాయకత్వం లొ రావాలి రైతు కష్టాలను పరిష్కరించే దారులు
రైతులు పండించాలి సిరులు 

బంగారు తెలంగాణ  ఆ మహా నేత లక్ష్యం
మీ లాంటి నాయకుల సహకారంతొ త్వరగా మన ముందు అవ్వాలి ప్రత్యక్షం  

మీపై నమ్మకంతొ కెసిఆర్ గారు అందించారు ఈ మహోన్నతమైన బాధ్యత
కోరుకుంటున్నాం రైతు కష్టాలు తీర్చిఅవ్వాలి  మీరు  విజేత

మీ రాకతొ మారలి రైతుల తలరాత
సుఖంగా ఉండాలి మన తెలంగాణ అన్నదాత

అందుకోండి మా అందరి హృదయ పూర్వక శుభాకాంక్షలు
రైతు సంక్షేమం చేసి అందుకోండి  వారి చల్లని ఆశిస్సులు  


ఇట్లు
మీ శ్రేయోభిలాషులు

Tuesday, April 4, 2017

మా పెదన్న సోంతిల్లు....ఆనందాల హరివిల్లు


మా పెదన్న సోంతిల్లు....ఆనందాల హరివిల్లు
సొంత ఇంటి గురించి ప్రతి ఒకరు కంటారు ఎన్నో కలలు
ఈ రోజు ఆ కలను నిజం చేసుకుంటున్న మా చంద్రన్నకు మా హృదయపూర్వక అభినందనలు
  
చిన్నపట్టి నుంచి పడ్డాడు ఎంతో శ్రమ
కాని ఎప్పుడూ తనలొ ఉంచుకున్నాడు తను విజయం సాదిస్తా అనే ధీమ
ఈ కల ఆ శ్రమ, ధీమ ఫలితం
సంతోషంగా ఉంది మా మనసున్న పెద్దన్నకు అయిన్నందుకు ఈ మధుర క్షణాలు అంకితం
తనకు తోడయ్యింది కుటుంబ సభ్యుల సహకారం
ఆ తోడు అయ్యేటట్టు చేసింది ఈ కలను సాకారం
పాత ఇంట్లోనే తన పెద్ద కోడుక్కి మా పెద్దనాన్న పెద్దమ్మ వేశారు ఈ అడుగులు
ఇప్పుడు ఈ గృహప్రవేశంతో చేందుతుంది వారి మనసులు ఆనందంతో పరుగులు
మా అన్నకు దేవుడు జత చేసాడు అర్దం చేసుకునే రాధిక వదిన జోడు
చాలా అండగా నిలిచింది మా అన్నకు తన తోడు
అన్నకు దొరికాడు ఎప్పుడూ అండగ నిలిచే సోదరుడు
తన విజయానికి మరోక్క కారకుడు

అన్నకు కుతుర్ల రూపంలో ఎప్పుడో దొరికింది లక్ష్మి దేవి కటాక్షం
అందుకే నేడు తన కల కళ్ళ ముందు అయ్యింది ప్రత్యక్షం
తనకు దొరికాడు బావ వెన్నట్టు ఉండే బావమరిది
అందరి సహకారంతో, శ్రేయోభిలాషుల ఆశిస్సులతో ఈ ముఖ్య గట్టంలొ అయ్యాడు విజయసారధి
అన్న, ఈ లక్ష్యాన్ని పొందావు ఎంతో ప్రణాలిక బద్దంగా
మా అందరికి నమ్మకం ఉంది నువ్వు సాదిస్తావ్ నీ మిగిత జీవిత లక్షాలను ఎంతో అవలీలగా
క్రమబద్ధ జీవితానికి తను మారు పేరు

కోరుకుంటున్న ఆ దేవుడునిని చేయాలని తనకు ప్రతి కల యొక్క విజయాన్ని ఖరారు


అభినందలనతో

నీ సోదరుడు
సునిల్