Thursday, October 5, 2017

ప్రేమ మూర్తి మా అమ్మమ

ప్రేమ మూర్తి మా అమ్మమ


 కేసముద్రం వెళ్తున్నాం అంటే ఎప్పుడూ కలిగేది మాకు చెప్పలేని ఆనందం
అక్కడ దొరికేది మా అమ్మమ మరియు మా అమ్మ తోబుట్టువులు అభిమానం
మా అమ్మమ పేరు అనసూర్య
అందరు బాగుండాలి అని ఆలొచిస్తుంది తను ప్రతి ఘడియ

ఆమే మా మల్లేశం తాతకు దొరికిన బంగారు దీపిక
ఎవరికి లేదు ఆమేకు ఉన్న అంత ఓపిక

మా తాత ఏలాడంటే సారా సామ్రాజ్యం
అందుకు కారణం వెనుక ఉండి మా అమ్మమ ఇచ్చిన దైర్యం 
 
ఒక పక్క అందరికి అందించేది మురిపాలు
మరో పక్క వంటి చేత్తో నడిపించేది ఇంటి కార్యకలపాలు

అమేకు ఉండేది భూదేవికి ఉండే సహనం
ఆ ఓర్పు వల్లే సాఫిగా సాగింది అంత పిల్లలతో కూడ జీవనం
  
ఎంత పని చేసిన మా అమ్మమ శ్రమ అని అనుకోలేదు ఏ నిమిషం
అమే శ్రమను మరిపించేలా చేసేది తన పిల్లలు పొందే సంతోషం

అండగా నిలిచింది ఎప్పుడైన తన పిల్లలు పడుతుంటే పాట్లు
వేసింది తన పిల్లలు పైకి ఎదగటానికి మెట్లు
ఆమే వల్లే ఇల్లు అయ్యింది ఆనందాల హరివిల్లు
ఆమే వల్లే ఇంట్లో ఎప్పుడూ ఉండేది సిరిజల్లు

ఎప్పుడూ మా అమ్మమది ప్రేమ అందించే మనస్తత్వం
అందుకే వారి పిల్లలు కూడ అంది పుచ్చుకున్నరు ఆ ప్రేమ అందించే వారసత్వం

పరిపూర్ణ మాతృమూర్తికి మా అమ్మమ ప్రతీక
అమేతో మేము గడిపిన ప్రతి క్షణం మా అందరి జీవితంలొ ఒక మధుర జ్ఞాపిక 

మా అందరి అదృష్టం దొరికినందుకు తన బందనం
అమే అందించిన ప్రేమకు వహిస్తున్నాం సిరస్సు వంచి వందనం

జి.సునిల్

1 comment:

Unknown said...

Super alludu chaala baagundi....Thank u verymuch