మళ్ళీ అంటున్న చలో వరంగల్
వస్తుందంటే వరంగల్ చేరుగా
కలుగుతుంది నా మనస్సు పట్టలేని హాయిగా
కలుగుతుంది నా మనస్సు పట్టలేని హాయిగా
చెయలేను మనసును ఏ మాత్రం నియంత్రణ
ఎందుకంటే ఈ క్షణం కోసం చేస్తా వారమంత నిరీక్షణ
ఎందుకంటే ఈ క్షణం కోసం చేస్తా వారమంత నిరీక్షణ
అక్కడ కలవబోతున్నా నా బంగారాలు
చూడ కలుగుతా వారు నాన్న కోసం చూపే ఆనందమయ నవ్వుళ్ళు
చూడ కలుగుతా వారు నాన్న కోసం చూపే ఆనందమయ నవ్వుళ్ళు
పెద్ద అమ్మాయితో షికార్లు
చిన్న పాపతో కబుర్లు
చిన్న పాపతో కబుర్లు
గడిచిపోతుంది రోజు ఒక క్షణంలా
తిరుగు ప్రయాణం ఆలోచనతో పడుతుంది మనసు డీలా
తిరుగు ప్రయాణం ఆలోచనతో పడుతుంది మనసు డీలా
కాని వెళ్తా మధుర జ్ఞాపకాలు మోస్తూ
మళ్ళీ వచ్చే సండే కోసం ఎదురు చూస్తూ
మళ్ళీ వచ్చే సండే కోసం ఎదురు చూస్తూ
మళ్ళీ అంటాకి కారణం, ఇంతకు ముందు ఒక సంవత్సరం గడిపా అలా చలో వరంగల్ అంటు, అప్పటి జ్ఞాపాకాలు కిందవి
https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post_30.html
https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post.html
https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post_30.html
https://sunil-megafan.blogspot.in/2017/01/blog-post.html
https://sunil-megafan.blogspot.in/2016/05/blog-post.html
జి.సునిల్
No comments:
Post a Comment