మిస్ యు బ్రదర్
నీవు లేవనే వార్త వినగానే తమ్ముడు
నిజంగా అనిపించింది ఉన్నాడా ఆ దేవుడు
నిజంగా అనిపించింది ఉన్నాడా ఆ దేవుడు
ఇంత కష్టపడిన నీకు చేస్తాడు అనుకున్నాం సాయం
కలలో కూడా అనుకోలేదు చేస్తాడు ఇంతటి అన్యాయం
కలలో కూడా అనుకోలేదు చేస్తాడు ఇంతటి అన్యాయం
నీ పోరాట పటిమ చూసి అనుకున్నాం అవుతావు విజేత
కాని ఆ దేవుడు తన కఠొర హృదయంతో పాటించమన్నాడు విది రాత
కాని ఆ దేవుడు తన కఠొర హృదయంతో పాటించమన్నాడు విది రాత
నీ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టింది మాతృత్వం
చివరికి ఆ త్యాగానికి లేకుండా చేసాడు ఆ దేవుడు ఫలితం
చివరికి ఆ త్యాగానికి లేకుండా చేసాడు ఆ దేవుడు ఫలితం
ఈ వయస్సులో ఆసర అవుతావు అనుకున్నాడు బాబాయి
ఇప్పుడు తట్టుకోలేకున్నాడు బాధ, లేనందుకు ఇక తన సహయపడే ఒక చేయి
ఇప్పుడు తట్టుకోలేకున్నాడు బాధ, లేనందుకు ఇక తన సహయపడే ఒక చేయి
నిజంగా జోహార్లు పలకాలి నీ సహదర్మచారిణికి
భూమి కూడా తల వంచక తప్పుదు ఆమే సహనానికి
భూమి కూడా తల వంచక తప్పుదు ఆమే సహనానికి
అనుకున్నది నువ్వు ఉంటే చాలు
ఆమే కష్టానికి ఫలితం దొరికితే నిజంగా ఉండేది ఎంతో మేలు
ఆమే కష్టానికి ఫలితం దొరికితే నిజంగా ఉండేది ఎంతో మేలు
ఎల్లపూడూ నువ్వు కోలుకోవాలని శ్రమించారు తోబుట్టువులు
ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకొని నయం అవ్వాలని ప్రార్ధించారు బందువులు
ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకొని నయం అవ్వాలని ప్రార్ధించారు బందువులు
అర్దం అవ్వటం లేదు ఎందుకు వినలేదు ఇందరి గోడు
విని ఉంటే నిజంగా ఎంత బాగుండేదో నేడు
విని ఉంటే నిజంగా ఎంత బాగుండేదో నేడు
అనిపిస్తుంది నిన్ను తన దెగ్గరికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు చూపాడు తన స్వార్దం
మంచి వాడివేన నిన్ను తన దెగ్గర ఉంచుకోవాలని మా అందరికి మిగిల్చాడు ఈ అనర్దం
మేము అనుకున్నం నీ ఉద్యోగంలో చేరుతావు ఉన్నత స్తితి
కాని అనుకోలేదు చూడవలసి వస్తుందని నీ చితి
కాని అనుకోలేదు చూడవలసి వస్తుందని నీ చితి
మాకు ఎప్పుడూ మనస్సులో గుర్తు ఉంటుంది నీ నిస్వార్థ చిరు నవ్వు
ఎవరూ మరిపించలేరు నువ్వు చూపిన అందరిపై ఆప్యాయమైన లవ్వు
ఎవరూ మరిపించలేరు నువ్వు చూపిన అందరిపై ఆప్యాయమైన లవ్వు
మిస్ అవుతాం నీ సవాసం
ఆత్మ సాంతి చేకూర్చాలని దేవుడిని కోరుతాం నీ కోసం
ఆత్మ సాంతి చేకూర్చాలని దేవుడిని కోరుతాం నీ కోసం
జి.సునిల్
No comments:
Post a Comment