Monday, April 13, 2020

నీ బాధ్యతని మరువకు (STAY HOME STAY SAFE)

నీ బాధ్యతని మరువకు  

కనపడకుండా మన పై దాడి చేస్తున్న మహమ్మారి కరోనా
ఆ పేరు వింటేనే ప్రతి ఒకరు ప్రస్తుతం పడుతున్నారు హైరానా

ఈ సమస్య కలగటం లేదు నీ ఒక్కడికి
ఈ సమస్య యావత్ జగతిది

కొంచెం నిర్లక్ష్యం చేసినా ఈ సమయం
మనకు తప్పదు మహా ప్రళయం

అది గ్రహించగలిగితే నీ మనసులో
ఈ మహా సమస్యను అరికట్టే ఆయుధం ఉంటుంది నీ చేతుల్లో

 ప్రభుత్వం యొక్క ప్రతి సూచనలకు చేస్తే నీ వంతు కర్తవ్యం
త్వరగా చేరుతాం కరోనా రహిత సమాజం అనే గమ్యం  

నీ అంకితమైన ప్రస్తుత చర్యలు దేశానికి శక్తి 
చూపిస్తుంది నీ దేశభక్తి 

అన్ని నిబంధనలకు నువ్వు ఇప్పుడు అయితే అంకితం
కాపాడుతావు నీతో పాటు ప్రతి ఒకరి జీవితం

అంకితమైన ప్రభుత్వ అధికారులు మనకు దొరికిన అద్బుతమైన నిధి
మన కోరకు వారి ప్రాణలు పెట్టి చేస్తున్నారు వారు విధి 

నీ అనాలోచిత పనులతో కాకు ఎంతో శ్రమిస్తున్న వారికి భారం
గుర్తుంచుకో మనందరికీ ప్రస్తుతం వారు తప్ప లేరు వేరే ఆధారం

అందుకే అలోచించు సోదరా
నీకు నువ్వే నిబంధనలను అతిక్రమించకుండా వేసుకో పహారా

FOLLOW RULES OF LOCKDOWN
STAY IN SAFEZONE

======================================================================

SOME OTHER WRITINGS

P... Poratame
O.. Oopiri,
L... Lockdownlo
I... Istunna
C... Commitmentki
E... Eduruledu
D... Deivamla
O... Okkadey
C.. Corona
T....Tagginchi
O...Odarchagala
R....Roopam
C... Can
O... Only
R.... Reduce,
O... Obeying
N.... Nation
A... Advise
A... Adopt
P... Precautions,
R.... Relax
I... In
L... Lockdown

A... Anni
P... Paatistu
R.... Relax
I.... In
L... Lockdown

T..Teliyani
E...Enenmypei,
L...Lockdownlo
A...Aayudamgaa
N..Nilavaalani
G...Goppa
A...Aashayamto
N...Nadipistundi
A... Andarini
If anyone asks HELP, INDIA
I... Incredible
N.. Nation
D... Doing
I... Immediate
A... Attention



G.SUNIL

Saturday, March 7, 2020

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు (Happy Women's Day)


 

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు   

జోహార్లు మహిళలు
ఎవరి వల్ల కాదు మీరు చేసే భాద్యతలు

మీరే ఈ సృష్టికి మూలం 
మీరే కుటుంబ విజయానికి బలం

మీరు చూపే సహనం
ప్రతి ఒక్కరి ఇంటికి బహుమానం

సూర్యుడు రాకముందే మొదలవుతుంది మీ ఉదయం
కష్టిస్తూ చిరునవ్వుతో గడుపుతారు ప్రతి సమయం

ఇంటి పనులలో మీకు ఏనాడు కలగదు అలసట
వేస్తారు కుటుంబానికి బంగారు బాసట

మీతోనే ప్రతి కుటుంబానికి జీవం
మీతోనే ప్రతి కుటుంబానికి వైభవం

సమాజ నిర్మాణంలో అవుతున్నారు మగవారితో సమానం   
కాని మీమ్మల్ని గుర్తించలేని ప్రస్తుత సమాజ వైనం 

మారాలి ఈ పరిస్థితి
మీ భాగసామ్యంతోనే ప్రగతి పథంలోకి వస్తది ఈ జగతి

మీ పోరాట పటిమతోనే చూప కలుగుతున్నారు తెగువ 
 అందుకే మీకు అందరు పలుకుంతున్నారు విజయీభవ  

వెనుకడుగు వేయకుండా కోనసాగించండి మీ శక్తి
 త్వరలోనే సమజంలో జరుగుతున్న అన్యాయం నుండి పొందాలి విముక్తి 


ఆశిస్తూ,శుభాకంక్షలతో 

సునిల్  
   




Friday, January 17, 2020

ప్రతి ఒకరి మదిని దోచే అల వైకుంఠపురములో

ప్రతి ఒకరి మదిని దోచే అల వైకుంఠపురములో


అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం ఉండాలి అనుకున్నారు ఎంతో సరదాగా
మాటల మాంత్రికుడు పదును పెట్టారు వారి పెన్ను ఆ ఆలొచన దిశగా 

ఆ ప్రయత్నానికి దృశ్య రూపం అల వైకుంఠపురములో
సినిమాలోని ప్రతి ఫ్రేము ఉండనుంది ఎప్పటికి ప్రతి సినిప్రేక్షక మదిలో

పిల్లల మార్పిడితో అవుతుంది కధ ప్రారంభం 
ఆ చర్యతో ఒక తండ్రి తన కోడుకుకి చేద్దాం అనుకుంటాడు లాభం

కాని మార్చలేక పోయాడు విధాత రాసిన రాత
విజేతగా నిలిచింది, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్న మమత  

నిజం తెలిసిన తర్వాత హీరో అనుకుంటాడు అమ్మ నాన్న బాగుండాలి 
చేరుతాడు అల వైకుంఠపురము లోగిలి 

కనిపించింది నిజాన్ని దాచే హీరోయిజం 
తన వారిని ప్రాణం పెట్టి కాపాడుకోవడమే హీరో నైజం  

ప్రతి సన్నివేశంలో ప్రతి పాత్ర జీవిస్తుంది
ఒక వినోదాత్మక, ప్రతి హృదయానికి చేరువయ్యే సినిమాగా నిలుస్తుంది 

క్లైమాక్ష్ ఫైట్లో చూపించారు పాటతో వైవిద్యం
ఫైట్లో కూడా వినోదం పంచడం అయ్యింది ఈ సినిమాకే సాధ్యం 

వినోదమైన, ఎమోషన్ అయినా, ప్రతి ఒకటి  ఉంటుంది ఎంతో లైట్
కాని ప్రతి ఒకటి ఈ సినిమాలో ఉంటుంది ఆల్టిమేట్ 

ప్రాణం పెట్టి మ్యూజిక్ అందిచారు తమన్
అద్బుతమైన సంగీతంతో గెలిచాడు ప్రతిఒకరి మన్

చాల గ్రేస్ఫుల్ గా ఉంటుంది మన స్టైలిష్ స్టార్ డాన్స్
ప్రతి పాటలో పండగ చేసుకున్నారు సిని ఫ్యాన్స్

త్రివిక్రమ్ గారు వెలికితీశారు స్టైలిష్ స్టార్ లోని అద్బుత పర్ఫామర్
అందరిని మెప్పించి అయ్యింది సంక్రాంతి విన్నర్


జి.సునిల్
మెగా ఫ్యాన్

Friday, December 6, 2019

JUSTICE SERVED


యావత్ భారత దేశాన్ని కలిచి వేసింది దిశపై జరిగిన సంఘటణ
అనుకున్నారు అన్నిటీలాగే వేచి చూడాల్సిందే న్యాయం కోసం నీరిక్షణ  

కాని కదిలి వచ్చింది ప్రతి మానవత హృదయం
అందరి పోరాటంతో పట్టలేదు అంతటి సమయం

పోలిస్ రూపంలో దేవుడు పంపారు మృగాలని చంపే హంటర్
జరిగింది అందరిని సంతోష పరిచిన ఎంకౌంటర్

దిశ కాల్చిన ప్రదేశంలో చేసారు సీన్ రీ కన్ స్ట్రక్షన్
నలుగిరిని హతమార్చి తెలంగాణ పోలిస్ సృష్టించారు సెన్సేషన్

జరిగిన అన్యాయానికి సమాధానం ఇచ్చింది గన్
తెలంగాణ పోలిస్ థాంక్స్ యే టన్

ఆశీస్తున్నాము ఇకనైనా మారుతుంది ప్రతి ఒక అమ్మాయి దశ
కోరుకుంటున్న సమాజం వెళ్తుందని మంచి దిశ

ఈ చర్య తప్పక  కలిగిస్తుంది దిశ ఆత్మకు శాంతి
ఎవరు చెందొద్దు ఇక ఇలాంటి సంఘటనలు జరగవనే బ్రాంతి 

కొనసాగించాలి ఈ విప్లవం
మరి ఏ ఒక అమ్మాయికి కలగవద్దు మరోకసారి ఈ పరాభవం

కఠినమైన చట్టాలు ఈ సమస్యను చేస్తుంది అంతం
అప్పుడు ఆడపడుచుకి భద్రత కలిచగించే సమాజం అవుతుంది మన  సోంతం

ఏ అమ్మాయి ఉండోద్దు భయం నీడలో
ఆశిస్తున్నాను వస్తుందని ఆ రోజు త్వరలో

జి.సునిల్


Friday, November 29, 2019

ఆడపిల్లగా పుట్టడమే నేరమా?????

ఆడపిల్లగా పుట్టడమే నేరమా?????

అమ్మాయి పుట్టింది అంటే పెంచుతాం అల్లారు ముద్దుగా
లక్ష్మీ నిలయంగా మార్చిన తనకి అందిస్తాం ఆకాశమే హద్దుగా

మోన్నటి వరకు అమ్మాయి పుట్టిన తల్లిదండ్రుల మోకంలో కనిపించేది నవ్వులు
కాని ఇప్పుడు కనిపిస్తున్నది ఎవరికి చోప్పుకోలేని భయాలు

బాపూజీ అర్దరాత్రి స్వాతంత్రం కోరింది మీ మాటలు
పట్టపగలే లేకుండా చేస్తున్నాయి ప్రస్తుత మృగాలు 

ఇది భద్రత లేని సమాజం
ఇది నిజం

అయ్యింది ఓంటరిగా వెళ్ళే అమ్మాయిని కాటేసే లోకం
కలిగిస్తున్నది అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులకు శోకం  

అర్దం కావట్లేఎమైతుందొ మానవత్వం 
భయమేస్తుంది ఎటు తీసుకెళ్తుందో ఈ పైశాచికత్వం 

ఇంకోకసారి జరగకుండ ఉండాలంటే ఇటువంటి గాయం
అలా ఆలోచించే వారి గుండెల్లో పుట్టించాలి భయం 

ఇటువంటి వారికి ఉండకూడొద్దు భిక్ష  
పడాలి అతీ కఠినమైన శిక్ష 

దేవుడా జరగకుండ చూడూ ఇటువంటి దారుణం
ఎవరి వళ్ళ కాదు తట్టుకోవటం చూసి అటువంటి ప్రమాదం 

ఆడపడుచులు తప్పక తీసుకోండి భద్రతా చర్యలు  
సరైన జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టోచ్చు ఈ నేరాలు   

మార్చాలి చట్టాలు
ఉరి తప్ప అటువంటి వారికి శిక్షించలేవు ఏటువంటి కటకటాలు 


జి.సునిల్
ఆడపిల్లల తండ్రి 

Wednesday, October 2, 2019

మెగా నటనా విజృంభణ (సైరా పై మెగా ఫ్యాన్ స్పందన)


మెగా నటనా విజృంభణ (సైరా పై మెగా ఫ్యాన్ స్పందన)
ఆహా అందరు గర్వించేలా సినిమా తీసాడు మా మెగాస్టార్ కొడుకు
సురెందర్ రెడ్డి దర్శకత్వంలో వెలికితీశాడు మా మెగాస్టార్ అసలైన నటనా సరుకు 

తనకు తగ్గ పాత్ర వస్తే ఎలా ఉంటుందో నట విశ్వరూపం చూపాడు మా మెగా పులి
ఈ సినిమాతో తీర్చుకున్నాడు తనకు నటన పై ఉన్న ఆకలి 

మా మెగాస్టార్ కి సరైన బొమ్మ పడాలి అని ప్రతి మెగా ఫ్యాన్ కలగన్న ఈ రోజు
గర్వంతో సంబరాలు జరుపుతున్నారు సత్తా చాటినందుకు మా బాక్సాఫీస్ రాజు

అంటున్నారు దేకో దునియా....యే హై హమరా మెగాస్టార్ స్టామినా

అందరికీ స్పూర్తినిచ్చి ఉత్తేజ పరచింది మన నరసింహారెడ్డి స్టోరీ
సినిమాలోని ప్రతి శాఖ తమ అద్భుతమైన పని తీరుతో సినిమాకి అందించారు విజయభేరి

రెండు కనులు చాలవు చూడటానికి యోధుడి పాత్రలో మన మెగాస్టార్ చూపిన పౌరుషం
మనం గర్వించేలా ఉంటుంది సినిమాలోని ప్రతి నిమిషం

జరుగుతున్న అన్యాయం చూసి ఆంగ్లేయుల పై చూపుతాడు తన పోరటంతో ప్రతిఘటన
అన్ని వర్గాల నుంచి వస్తుంది అపూర్వమైన ఆదరణ

ప్రతి భారతీయుడు మరచిపోలేనిది నరసింహారెడ్డి చూపిన సాహసం
వర్ణించలేనిది పోరటంలో తను చూపిన రాజసం

నరసింహారెడ్డి మనని వదిలి వెళ్తారు అందించి మహా స్వాతంత్ర్య ఉద్యమ ఆశయం
అటువంటి మహనీయుల త్యాగాలు వల్లే స్వాతంత్ర్యం మనకు అయింది నిశ్చయం

నిజంగా గర్వ పడుతున్నది మన జాతి
సినిమా తెస్తుంది మనకు ఎనలేని ఖ్యాతి


యావత్ ప్రపంచం చూస్తున్నది మన వెండితెర వెలుగు 
గర్విస్తున్నది మన తెలుగు

జి. సునిల్, 
మెగా ఫ్యాన్

Sunday, September 22, 2019

సైరా మూవీ ప్రీ-రిలీజ్ (మెగా ఫ్యాన్ స్పందన )


సైరా మూవీ ప్రీ-రిలీజ్ (మెగా ఫ్యాన్ స్పందన )
నేడు మా అంజని పుత్రుడు
సైరా సినిమా లో  అయ్యారు స్వాతంత్ర్య యోధుడు

ఇలాంటి రోల్ లో మా మెగాస్టార్ ని చూడాలనేది మా డ్రీమ్ 
తీర్చినందుకు థాంక్యూ సెరా టీమ్

 సైరా చూపనుంది మన స్వాతంత్ర్య యోధుడి పోరాటం
అవ్వనుంది మనం గర్వించదగ్గ తెలుగు సినిమా కిరీటం

చరిత్ర సైరా సినిమా తో మొదలు అవ్వాలి
తెలుగు సినిమా సత్తా ప్రపంచం చూడాలి

వస్తున్నాడు సింహం
చేయడానికి అన్ని రికార్డ్స్ ని విధ్వంసం

మెగా సంబరం అయ్యింది మొదలు
చూడటానికి చాలవు రెండు కనులు

L.B.స్టేడియంలో ఇసుక వేస్తే రాలనంత జనం
అది కదా మెగా అభిమానం

వర్షంలో కూడా ఘనంగా జరిగింది  ప్రీ-రిలీజ్ ఈవెంట్
అది మా మెగా అభిమానుల కమిట్మెంట్

మెగా ఫ్యాన్ అయ్యినందుకు ప్రతి ఫ్యాన్  అవుతున్నాడు గర్వం
నేడు అవుతున్నాడు చెప్పలేని అమితమయిన ఆనంద పర్వం

సై సైరా.... విజయం మనదేరా

 TRALER-2

ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడి లక్ష్యం  స్వాతంత్రం స్వాతంత్రం  స్వాతంత్రం
ఈ నినాదమే అయ్యింది మనకు స్వాత్రంతం తెచ్చిన మంత్రం

చంపడమో చావడమో ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం
ఈ పటిమే చేకూర్చింది మనకు స్వాతంత్ర లక్ష్యం


అది మనది ! మన ఆత్మగౌరవం !! గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు !!
మీ దేశభక్తి యావత్ భారతావని ఎన్నడూ మరచిపోదు
    
S... స్వాతంత్ర
Y... యుద్దాన్ని
E... ఎగురవేసి,
R...రణ స్ఫూర్తి
A.. అందించిన
A... అమరజీవి


S... సిల్వర్ స్క్రీన్ పై
Y.... ఎల్లపుడూ
E... ఎంటర్టైన్మెంట్
R... రుచి
A... అందించిన
A... యాక్టర

జి. సునిల్, 
మెగా ఫ్యాన్

Sunday, September 15, 2019

లైఫ్ లో సక్సెస్ (WRITTEN AFTER SEEING SAI DHARAM TEJ CHITRALAHARI MOVIE)


లైఫ్ లో సక్సెస్
నీ లైఫ్ అంటే నీకే ఇంపార్టెంట్
అది గ్రహించినప్పుడు వస్తుంది నీ లైఫ్ అసలైన కంటెంట్

జీవితం ఒక అందమైన చిత్రలహిరి
ఆస్వాదించగలిగితే వస్తుంది జీవితం యొక్క అసలైన సిరి

జీవితం ఒక అందమైన సిరివెన్నల
నీ ప్రయత్నంతో సాదించగలవు నీ ప్రతి కల

వచ్చే ప్రతి సమస్యపై పోరాడు
సాదించే వరకు దైర్యంగా నిలబడు

దేనికి ఫలితం లేకుండా పలకకు ముగింపు
ఫలితం పొందే వరకు చేయి నీ యుద్దం కోనసాగింపు

మరిచిపో అపజయం యోక్క గాయం
పట్టుదలతో ముందుకు సాగి పోందు విజయం

అప్పుడే నువ్వు రాయగలవు నీకంటు ఒక చరిత
అవుతావు అసలైన విజేత

నీ ఆత్మవీశ్వాసమే నీకు ఆధారం
అది చూపుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం

WITH FAILURE DON’T STOP
WITH SELF CONFIDENCE, YOU WILL BE ON TOP

ఇట్లు
మీ సునిల్