Wednesday, October 2, 2019

మెగా నటనా విజృంభణ (సైరా పై మెగా ఫ్యాన్ స్పందన)


మెగా నటనా విజృంభణ (సైరా పై మెగా ఫ్యాన్ స్పందన)
ఆహా అందరు గర్వించేలా సినిమా తీసాడు మా మెగాస్టార్ కొడుకు
సురెందర్ రెడ్డి దర్శకత్వంలో వెలికితీశాడు మా మెగాస్టార్ అసలైన నటనా సరుకు 

తనకు తగ్గ పాత్ర వస్తే ఎలా ఉంటుందో నట విశ్వరూపం చూపాడు మా మెగా పులి
ఈ సినిమాతో తీర్చుకున్నాడు తనకు నటన పై ఉన్న ఆకలి 

మా మెగాస్టార్ కి సరైన బొమ్మ పడాలి అని ప్రతి మెగా ఫ్యాన్ కలగన్న ఈ రోజు
గర్వంతో సంబరాలు జరుపుతున్నారు సత్తా చాటినందుకు మా బాక్సాఫీస్ రాజు

అంటున్నారు దేకో దునియా....యే హై హమరా మెగాస్టార్ స్టామినా

అందరికీ స్పూర్తినిచ్చి ఉత్తేజ పరచింది మన నరసింహారెడ్డి స్టోరీ
సినిమాలోని ప్రతి శాఖ తమ అద్భుతమైన పని తీరుతో సినిమాకి అందించారు విజయభేరి

రెండు కనులు చాలవు చూడటానికి యోధుడి పాత్రలో మన మెగాస్టార్ చూపిన పౌరుషం
మనం గర్వించేలా ఉంటుంది సినిమాలోని ప్రతి నిమిషం

జరుగుతున్న అన్యాయం చూసి ఆంగ్లేయుల పై చూపుతాడు తన పోరటంతో ప్రతిఘటన
అన్ని వర్గాల నుంచి వస్తుంది అపూర్వమైన ఆదరణ

ప్రతి భారతీయుడు మరచిపోలేనిది నరసింహారెడ్డి చూపిన సాహసం
వర్ణించలేనిది పోరటంలో తను చూపిన రాజసం

నరసింహారెడ్డి మనని వదిలి వెళ్తారు అందించి మహా స్వాతంత్ర్య ఉద్యమ ఆశయం
అటువంటి మహనీయుల త్యాగాలు వల్లే స్వాతంత్ర్యం మనకు అయింది నిశ్చయం

నిజంగా గర్వ పడుతున్నది మన జాతి
సినిమా తెస్తుంది మనకు ఎనలేని ఖ్యాతి


యావత్ ప్రపంచం చూస్తున్నది మన వెండితెర వెలుగు 
గర్విస్తున్నది మన తెలుగు

జి. సునిల్, 
మెగా ఫ్యాన్

No comments: