Friday, November 29, 2019

ఆడపిల్లగా పుట్టడమే నేరమా?????

ఆడపిల్లగా పుట్టడమే నేరమా?????

అమ్మాయి పుట్టింది అంటే పెంచుతాం అల్లారు ముద్దుగా
లక్ష్మీ నిలయంగా మార్చిన తనకి అందిస్తాం ఆకాశమే హద్దుగా

మోన్నటి వరకు అమ్మాయి పుట్టిన తల్లిదండ్రుల మోకంలో కనిపించేది నవ్వులు
కాని ఇప్పుడు కనిపిస్తున్నది ఎవరికి చోప్పుకోలేని భయాలు

బాపూజీ అర్దరాత్రి స్వాతంత్రం కోరింది మీ మాటలు
పట్టపగలే లేకుండా చేస్తున్నాయి ప్రస్తుత మృగాలు 

ఇది భద్రత లేని సమాజం
ఇది నిజం

అయ్యింది ఓంటరిగా వెళ్ళే అమ్మాయిని కాటేసే లోకం
కలిగిస్తున్నది అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులకు శోకం  

అర్దం కావట్లేఎమైతుందొ మానవత్వం 
భయమేస్తుంది ఎటు తీసుకెళ్తుందో ఈ పైశాచికత్వం 

ఇంకోకసారి జరగకుండ ఉండాలంటే ఇటువంటి గాయం
అలా ఆలోచించే వారి గుండెల్లో పుట్టించాలి భయం 

ఇటువంటి వారికి ఉండకూడొద్దు భిక్ష  
పడాలి అతీ కఠినమైన శిక్ష 

దేవుడా జరగకుండ చూడూ ఇటువంటి దారుణం
ఎవరి వళ్ళ కాదు తట్టుకోవటం చూసి అటువంటి ప్రమాదం 

ఆడపడుచులు తప్పక తీసుకోండి భద్రతా చర్యలు  
సరైన జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టోచ్చు ఈ నేరాలు   

మార్చాలి చట్టాలు
ఉరి తప్ప అటువంటి వారికి శిక్షించలేవు ఏటువంటి కటకటాలు 


జి.సునిల్
ఆడపిల్లల తండ్రి 

No comments: