Sunday, July 24, 2011

దొంగ స్వాములు ఉన్నారు జాగ్రత్త

దొంగ స్వాములు ఉన్నారు జాగ్రత్త
స్వాములను పూజించే భక్తులు
ముందు తెలుసుకోండి,ఎలాంటి వారో మీరు పూజించే వ్యక్తులు

పుణ్యం వస్తుందని కంటున్నారేమో కలలు
ముందు తెలుసుకోండి అక్కడ జరుగుతున్న రాసలీలలు

మంచి పనులకని విరాళాలు ఇస్తున్నారు జనం
కాని స్వార్ద పరుల చేతుల్లొకి వెళ్తున్నది ఆ దనం

పెద్ద వాళ్ళు స్వాములకు చేప్తున్నారు థ్యాంక్
ఎందుకంటే ఆ ఆశ్రమాలు,వారికి మరొ స్విజ్ బ్యాంక్

ఇక అక్కడ భక్తికి లేదు ఆస్కారం
అది ఒక బంగారపు ఘనుల బండారం

ప్రజల్లొ రానంత వరకు చైతన్యం
ఎవరు చేర్చలేరు వారిని మంచి గమ్యం

ప్రజలు,తెలుసుకోండి, మీరు వెళ్తున్న ప్రదేశం మారింది స్వార్ద పరుల అడ్డాగా
మీరునమ్మోద్దు వారిని ఇక గుడ్డిగా

పేద ప్రజలకు మీరే స్వయంగా చేయండి దానం
అలా నిలపండి ప్రాణం

అప్పుడు అందరి మదిలో ఆనందం అవుతుంది ప్రత్యక్షం
తప్పక లభిస్తుంది మీరు కోరుకునే మోక్షం

జి.సునిల్

1 comment:

Anonymous said...

not only swamulu..there are imams, church pasters, dirty politicians like jagan are looting india.