Saturday, September 3, 2016

మనం మనిషి మనిషి మధ్య మనసిచ్చే మంత్రం


మనం మనిషి మనిషి మధ్య మనసిచ్చే మంత్రం
 


అందరు కలిస్తేనే అనిపిస్తుంది మనం
మనం ఉన్నప్పుడు మనకు కొండంత బలం



మనం ఉన్నప్పుడు చేరుకోవొచ్చు ప్రతి మజిలి
విజయం వస్తుంది మన దెగ్గరకు కదిలి

మనంతొ కలుగుతుంది ఒకరికోకరిపై ఇష్టం
ఆదుకుంటారు వస్తే ఎవరికైన కష్టం 

మనంలోనే ఉంది ప్రేమానుభిమానం
మనం మన జీవితానికి ఒక అందమైన బహుమానం

మనమే మనకు సమస్తం
మనకు సంతోషానిచ్చే మంచి అస్త్రం

మనంతొ ఈ ప్రపంచం
అవుతుంది మన పంచం

మనమే మనకు ఆదారం
మనంతో కొనసాగిద్దాం ఒకరికోకరి మధ్య సహకారం

మనం మనందరిలొ మమకారపు మంత్రం
మనం మరవద్దు మనసులోంచి మాత్రం 

జి.సునిల్

Friday, August 19, 2016

సింధు....భారత క్రీడా కేంద్ర బింధు

సింధు....భారత క్రీడా కేంద్ర బింధు
 
కఠోర శ్రమ చేసి పతకం అన్వేషణలో వేళ్ళావు బ్రజిల్
చివరికీ నీ కష్టంతొ చేరావు నీ మంజిల్
    
శుభాకాంక్షలు సింధు
నీ విజయం ప్రతీ భారతీయునికి అయ్యింది ఎంతో పసందు 
  
నువ్వు సాదించిన రజితం
అవుతుంది చరిత్రలొ సువర్ణ అక్షరాలతో లికితం

పెంచావు దేశ కీర్తి
కలిగించావు ప్రతి ఒకరికి స్పూర్తి

అభినంధనీయం నీ పోరాట పటిమ
సాధించావు ప్రతి భారతీయునీ ప్రేమ 

తెలంగాణ బిడ్డ ఈ గణత సాదించినందుకు వుంది ఇంక ఎంతో గర్వం
ప్రతి ఒకరం అవుతున్నాం ఆనంద పర్వం

నీ గెలుపుతో గర్వంతొ ఎగురుతుంది భారత పతాకం
నీ గెలుపు మార్చాలి మన క్రిడల జాతకం

ఫలించింది లాల్ దర్వాజ అమ్మ వారి ఆశ్శిసులు
ఇంత గర్వ పడే విజయం అందించిన నీకు మా దన్యవాధములు

నీ విజయం చూసి ప్రభుత్వం పట్టాలి క్రిడాకారులకి బ్రహ్మరధం
సాగేలా చేయాలి వారిని విజయ పధం

నీకూ రానున్న రోజుల్లొ అవ్వాలి మర్రిన్ని విజయాలు సొంతం 
నీకు పలుకుతున్నాం మేము అందరం మా హర్దిక స్వాగతం       
 
జి.సునిల్

Friday, August 12, 2016

కూతుర్లకి ప్రేమతొ


కూతుర్లకి ప్రేమతొ 

కూతురు అని చులకన చూసే వారికి మీరు పలకాలి పాఠం
మీరు ఎక్కాలి వారికి అందనంత ఎతైన పీఠం 

మీరు కాకుడదు భారం
మీరు అవ్వాలి మాకు సంతొషాని అందించే తీరం

మీ గమ్యానికి ఇప్పుడు పడుతున్నాయి ఓనమాలు
ఆశీస్తున్న ప్రతి విషయంలొ మీరు పొందుతారు విజయాలు 
   
మీ పయనంలొ నేను అవ్వాలని కోరుకుంటున్న మంచి గురువు
ప్రయత్నం చేస్త మీరు అయ్యేలా మీ గమ్యానికి చేరువు  

మీ సంకల్పంతొ చేరండి విజయపదం 
మీరు అవ్వాలి మాకు భవిషత్తులొ మాకు ఆయుదం   

కంటే కూతుర్నే కనాలి అని ఎందుకు అంటారొ అందరికి తెలుసు
వారికే ఉంటుంది కాబట్టి తల్లితంద్రుల అన్ని సమయాలో తోడు ఉండే మనసు


మీ నాన్న
జి.సునిల్

Tuesday, August 9, 2016

చలొ వరంగల్

చలొ వరంగల్

ఇప్పుడు వారంతరంలొ అంటున్నా చలొ వరంగల్
చేయడానికి అక్కడ నా బంగారాలతొ హల్ చల్

అక్కడ ఉన్నారు నా ముద్దుల కూతుర్లు
చేప్పుకుంటా వాళ్ళ తొ తీపీ కబుర్లు

అలా ఈ వారంతరం
తీరుస్తుంది వారం మొత్తం పొందిన బారం

అలానే ఆ  రోజు కంప్లెంట్ చిట్ట విప్పుతుంది మంజుల
అంటుంది బాగా అల్లరి చేసే ప్రవర్తికతొ ఎలా

అలానే అంటుంది చిన్న కూతురు చేస్తుంది నిద్ర లేని రాత్రులు
అలా చేప్పుకుంటుంది తన కష్టాలు

అన్ని విన్న తర్వాత చేస్తా వారి మధ్య సయొధ్యకి ప్రయత్నం
నేను ఉన్న రోజు ప్రవర్తిక నా మాట వినె ఒక రత్నం

వాళ్ళ అమ్మ అంటుంది అన్ని రోజులు ఇలానే ఉంటే బాగుండు
అంటుంది నేను వెళ్ళిన తర్వాత తీస్తుంది తన బెండు

అలా చూస్తునే గడిచిపోతుంది ఆదివారపు సమయం
మళ్ళీ దూరం అయే వ్యధతొ మళ్ళీ హైదరబాద్ కదుల్తుంది ఈ హృదయం



ఆ త్రయం త్వరగా వస్తే హైదరబాద్ 
ఈ ఒంతరితనం నుంచి అవ్వచ్చు ఆజాద్


జి.సునిల్ 
        

Saturday, July 23, 2016

లక్ష్మి నిలయం

లక్ష్మి నిలయం

నేడు మరొ సారి లక్ష్మి దేవి అయ్యింది మా ఇంట్లొ చేరిక
చాల ఆనందం కలిగించింది అమే కలయిక

అందరు చేసారు షురు
కూతురు పుట్టిందని కలగకు బేజారు

అందరు తేలిపారు శుభాకంక్షలు
అలానే తేలుసుకోమన్నారు రానున్న బరువు భాధ్యతలు 
   
ఓప్పుకోవాలి కూతురు అంటే ఎంతో భాధ్యత
ఆ భాధ్యతను విజయాన్ని వైపు నడిపిస్తుంది వారు చూపే ప్రేమ మమత  
 
చాలా సంతొషంగా ఉంది వాళ్ళ ప్రవర్తిక అక్క 
అంటుంది మొత్తం తన చేళ్ళ భాధ్యత తనదే ఇక 

ఇప్పటి వరకు ప్రవర్తిక వళ్ళ లేదు ఇంట్లొ అల్లరికి డోక
ఇప్పుడు అమే చేళ్ళలి కలయికతొ అవ్వనుంది ఆ అల్లరి డబల్ దమాక  

ఇంట్లొ తనకు దొరికింది స్నేహితురాలి తోడు
ఆశిస్తున్న గర్వ పడేలా చేస్తారు ఈ జోడు

చాల సమస్యలు ఎదుర్కుంటున్నారు ప్రస్తుత సమాజంలొ ఆడవాళ్ళు
ఆశిస్తున్నాం చాలా సమర్దవంతంగా మా జంట ఎదుర్కుంటాం ఆ సవాళ్ళు

ఆశిస్తున్నాం మాకు కలిగిన ఇరువురు పుత్రికలు
తీరుస్తారు మేము కన్న కలలు

వాళ్ళు తేలుసుకూనేలా చేయాలి ఈ సామ్రాజ్యం  
కుతుర్ల వళ్ళ కూడ అవుతుంది ప్రతీది సాధ్యం

శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒకరికి దన్యవాదము
ఆశిస్తున్న మీ ప్రతి ఆశిస్సు అవ్వాలి వారికి విజయాన్ని ఇచ్చే వరము



జి.మంజులసునిల్
 

Tuesday, May 17, 2016

మిస్ యు హని


మిస్ యు హని (6TH POEM ON MY DAUGHTER)


ఇంట్లో వచ్చేది చేంగు చేంగు మని ఒక చిన లేడి
అంటూ డాడి

ఇప్పుడు వినిపిచ్చేలా చేస్తుంది ఫోన్
హాయిగా ఉంటది వినగానే ఆ టోన్  

ప్రతి క్షణం చేస్తుంది నా మదిలొ ఆమే హల్చల్
ఫొన్ చేస్తే అంటుంది డాడి నువ్వు వస్తావ వరంగల్

ఆనంద పరుస్తాయి ఆ తీపీ పలుకులు
అవే ఇక్కడ గడవటానికి తీపి గుర్తులు

రోజు అమే అల్లరి, వాళ్ళ అమ్మ చేప్పే కంప్లేంట్
కాని నాకు వింటుంటే  చేప్తునట్టు అనిపిస్తది కాంప్లీమేంట్

నాన్న పేరు చేప్పి రోజు ఏస్ క్రీం కానిస్తుంది
అమే చేప్పే సాకులు వింటుంటే మనసును అలరిస్తుంది

అడుగుతుంది వాళ్ళ అమ్మను నాన్న ఇంటికి వస్తే తాళం వేసి ఉంటది ఎలా 
వింటే అనిపిస్తుంది మనసుకు హాయి చాలా

వాళ్ళ మేనమామలు అడిగితే, అంటుంది అమ్మ కంటే నాన్న అంటే ఎక్కువ ఇష్టం
ఆమే నుండి ఇక దూరం ఉండటం ఇక కష్టం

తొందరగ ముగించాలి ఈ దూరం
ఆమేను కలవటాని తొందరగ దాటాలి ఈ సముద్రాల తీరం

జి.సునిల్

POEM WHEN SHE STARTED SCHOOL

 

Sunday, May 8, 2016

గుర్తుకోస్తున్నాయి గుర్తుకోస్తున్నాయి (Written for Veeresh Bava)

గుర్తుకోస్తున్నాయి గుర్తుకోస్తున్నాయి

ఎక్కడొ పుట్టి, ఎక్కడొ పెరిగి 16 సంవత్సరాల క్రితం కలిసాం అందరం
మనకు బొధన ఇచ్చి మనను కలిపింది GCPE మందిరం 
 
ఈ రొజు కలిసాం మరొకసారి గుర్తు తేచ్చుకోవటాని ఆ జ్ఞపకాలు 
నిజంగా మళ్ళి రావు గడిపిన ఆ ఆనంద క్షణాలు

మళ్ళీ కలవాటానికి 16సంవత్సరాలు పట్టినందుకు ఉంది బాధ కొంత
కాని ఆ జ్ఞాపకాలు చేస్తుంది నా మనసును పులకింత

అక్కడ ఎర్పడిన మన స్నేహం
అయ్యేల చేసింది గడిపిన ప్రతి క్షణం ఒక ఆనంద ప్రవాహం 

అక్కడే వేసుకున్నాం భవిషత్తు కొరకు పునాదులు
కలిసి కట్టుగా ఆనందంగా భరించాం ఎన్నొ వ్యదలు

చిరు నవ్వుతొ కష్టాలను ఎదుర్కునేలా చేసింది మన స్నేహ బలం
కష్టపడి కలిసి ఎక్కాలనుకున్నాం అందలం 

మనలొ ఉంది కాబట్టే ఆ పట్టుదల
మనం చేరుకోగలిగాం ఈ ఎదుగుదల

నిజంగా ఎంతో సహయ పడింది అక్కడ గురువుల బోధనలు
వారికి మనస్పూర్వకంగా తేలుపుదాం మరొక్కసారి దన్యవాదములు

భావి తరాలకు ఇప్పుడు ఉపయోగ పడుతుంది ఆ శిక్షణ
వారి బంగారు భవిషత్తుకు  అవుతుంది మంచి రక్షణ

అప్పుడు గడిపిన ప్రతి సమయం
16 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం గుర్తు తేచ్చుకుంది ఈ హృదయం
ఆ రోజులు మళ్ళి రావు   
ఆనాటి జ్ఞాపకాలు మన మనసునుండి ఎన్నడు చేరిగిపోవు  

కలిసి ఉంటెనే జీవితానికి ఉంటుంది ఒక అందం
కొనసాగిద్దాం దేవుడు ఇచ్చిన స్నేహ బందం

ఇక్కడ ఉన్న ప్రతి నేస్తం
కొరుకుంటునా జీవితాంతం మీ స్నేహ హస్తం
 

జి.వీరేశ్