Friday, August 19, 2016

సింధు....భారత క్రీడా కేంద్ర బింధు

సింధు....భారత క్రీడా కేంద్ర బింధు
 
కఠోర శ్రమ చేసి పతకం అన్వేషణలో వేళ్ళావు బ్రజిల్
చివరికీ నీ కష్టంతొ చేరావు నీ మంజిల్
    
శుభాకాంక్షలు సింధు
నీ విజయం ప్రతీ భారతీయునికి అయ్యింది ఎంతో పసందు 
  
నువ్వు సాదించిన రజితం
అవుతుంది చరిత్రలొ సువర్ణ అక్షరాలతో లికితం

పెంచావు దేశ కీర్తి
కలిగించావు ప్రతి ఒకరికి స్పూర్తి

అభినంధనీయం నీ పోరాట పటిమ
సాధించావు ప్రతి భారతీయునీ ప్రేమ 

తెలంగాణ బిడ్డ ఈ గణత సాదించినందుకు వుంది ఇంక ఎంతో గర్వం
ప్రతి ఒకరం అవుతున్నాం ఆనంద పర్వం

నీ గెలుపుతో గర్వంతొ ఎగురుతుంది భారత పతాకం
నీ గెలుపు మార్చాలి మన క్రిడల జాతకం

ఫలించింది లాల్ దర్వాజ అమ్మ వారి ఆశ్శిసులు
ఇంత గర్వ పడే విజయం అందించిన నీకు మా దన్యవాధములు

నీ విజయం చూసి ప్రభుత్వం పట్టాలి క్రిడాకారులకి బ్రహ్మరధం
సాగేలా చేయాలి వారిని విజయ పధం

నీకూ రానున్న రోజుల్లొ అవ్వాలి మర్రిన్ని విజయాలు సొంతం 
నీకు పలుకుతున్నాం మేము అందరం మా హర్దిక స్వాగతం       
 
జి.సునిల్

No comments: