గుర్తుకోస్తున్నాయి గుర్తుకోస్తున్నాయి
ఎక్కడొ పుట్టి, ఎక్కడొ పెరిగి 16 సంవత్సరాల క్రితం కలిసాం అందరం
మనకు బొధన ఇచ్చి మనను కలిపింది GCPE మందిరం
మనకు బొధన ఇచ్చి మనను కలిపింది GCPE మందిరం
ఈ రొజు కలిసాం మరొకసారి గుర్తు తేచ్చుకోవటాని ఆ జ్ఞపకాలు
నిజంగా మళ్ళి రావు గడిపిన ఆ ఆనంద క్షణాలు
నిజంగా మళ్ళి రావు గడిపిన ఆ ఆనంద క్షణాలు
మళ్ళీ కలవాటానికి 16సంవత్సరాలు పట్టినందుకు ఉంది బాధ కొంత
కాని ఆ జ్ఞాపకాలు చేస్తుంది నా మనసును పులకింత
కాని ఆ జ్ఞాపకాలు చేస్తుంది నా మనసును పులకింత
అక్కడ ఎర్పడిన మన స్నేహం
అయ్యేల చేసింది గడిపిన ప్రతి క్షణం ఒక ఆనంద ప్రవాహం
అయ్యేల చేసింది గడిపిన ప్రతి క్షణం ఒక ఆనంద ప్రవాహం
అక్కడే వేసుకున్నాం భవిషత్తు కొరకు పునాదులు
కలిసి కట్టుగా ఆనందంగా భరించాం ఎన్నొ వ్యదలు
కలిసి కట్టుగా ఆనందంగా భరించాం ఎన్నొ వ్యదలు
చిరు నవ్వుతొ కష్టాలను ఎదుర్కునేలా చేసింది మన స్నేహ బలం
కష్టపడి కలిసి ఎక్కాలనుకున్నాం అందలం
కష్టపడి కలిసి ఎక్కాలనుకున్నాం అందలం
మనలొ ఉంది కాబట్టే ఆ పట్టుదల
మనం చేరుకోగలిగాం ఈ ఎదుగుదల
మనం చేరుకోగలిగాం ఈ ఎదుగుదల
నిజంగా ఎంతో సహయ పడింది అక్కడ గురువుల బోధనలు
వారికి మనస్పూర్వకంగా తేలుపుదాం మరొక్కసారి దన్యవాదములు
వారికి మనస్పూర్వకంగా తేలుపుదాం మరొక్కసారి దన్యవాదములు
భావి తరాలకు ఇప్పుడు ఉపయోగ పడుతుంది ఆ శిక్షణ
వారి బంగారు భవిషత్తుకు అవుతుంది మంచి రక్షణ
వారి బంగారు భవిషత్తుకు అవుతుంది మంచి రక్షణ
అప్పుడు గడిపిన ప్రతి సమయం
16 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం గుర్తు తేచ్చుకుంది ఈ హృదయం
16 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం గుర్తు తేచ్చుకుంది ఈ హృదయం
ఆ రోజులు మళ్ళి రావు
ఆనాటి జ్ఞాపకాలు మన మనసునుండి ఎన్నడు చేరిగిపోవు
ఆనాటి జ్ఞాపకాలు మన మనసునుండి ఎన్నడు చేరిగిపోవు
కలిసి ఉంటెనే జీవితానికి ఉంటుంది ఒక అందం
కొనసాగిద్దాం దేవుడు ఇచ్చిన స్నేహ బందం
కొనసాగిద్దాం దేవుడు ఇచ్చిన స్నేహ బందం
ఇక్కడ ఉన్న ప్రతి నేస్తం
కొరుకుంటునా జీవితాంతం మీ స్నేహ హస్తం
కొరుకుంటునా జీవితాంతం మీ స్నేహ హస్తం
జి.వీరేశ్
No comments:
Post a Comment