మూగబోయిన మా బాలు గారి స్వరం
ఊహించాలంటే లేరని మన గాన గంధర్వుడు
తట్టుకోలేకపోతున్నాడు ఏ సంగీత ప్రేమికుడు
బాలు గారు అంటే ప్రతీ భారతీయుడికి ఎనలేని ప్రేమ
తన మధుర స్వరం ఇక లేదని కుమిలి పోతుంది చిత్ర పరిశ్రమ
ఈ సంగీతపు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది మీ కంటూ
మేము పెరిగాం మీ మధుర పాటలు వింటూ
బాలు గారు నిలిచారు తరాల మధ్య వారధి
మేము ఏమీ నేరం చేసామని మా నుంచి మిమ్మల్ని తీసుకెళ్లింది ఆ విధి
మా బాలు గారు మధుర గాన సముద్రం
మా నుంచి దూరం చేసిన ఆ విధాతపై ప్రతి ఒకరు చూపుతున్నారు రౌద్రం
ఎన్నో మధురమైన పాటలతో మా మదిని చేసారు మ్యాజిక్కు
ఇప్పుడు సినీ సంగీత ప్రపంచానికి లేకుండా అయింది పెద్ద దిక్కు
మా జీవితంలో మీ పాట అయ్యింది మమేకం
మీతోనే సాధ్యమయింది స్వరానికి అపురూపమైన అభిషేకం
లేదని తలుచుకోవాలంటే మా బాలు గారి స్వరం
మా మనసులకి కలిగిస్తున్నది ఎవరికి తెలుపలేని భారం
మీమల్ని మా నుంచి దూరం ఈ రోజు మాకు చీకటి రోజు
ఈ రోజు మాకు లెకూండా చేసింది మా పాటల రారాజు
మీరు సాధించారు ప్రతి సంగీతపు మజిలీ
మా అందరి ప్రార్థన మీ ఆత్మకు శాంతి చేకూరాలి
అందుకోండి మా ఘన నివాళి సంగీతపు లెజండ్
మా మదిలో మీకు, మీ పాటలకు ఎప్పుడూ ఉండదు ఎండ్(END)
మీ అభిమాని
జి.సునిల్
4 comments:
Great words
Very nice
Very nice
Nice one
Post a Comment