Saturday, February 20, 2016

మాతృదేవోభవ పితృదేవోభవ

మాతృదేవోభవ పితృదేవోభవ

ప్రేమానురాగాలతొ సాగించారు మీ దాంపత్యం 
మా శ్రేయస్సు కొరకే ఆలోచించారు మీ జీవితంలొ అణునిత్యం

ఆ దేవుని వరము మాకు దొరికిన మీ బందము
ఏమి ఇచ్చిన తీర్చుకోలేము మీ రుణము

పిల్లలు చేయొచ్చేమో తల్లిదండ్రులను నిర్లక్షం 
కాని తల్లిదండ్రులు అలాంటి ఆలోచనే చేయలేరు అనటానికి మీరే సాక్షం

మేము ఎల ఉన్నామో తెలుసుకున్నారు ప్రతి సమయం
అందించారు మేము భాదలొ ఉన్నపుడు మీరు సాయం

మా సంతోషపు జీవనం కొరకు
సాగించారు ప్రతి క్షణం మీ జీవన బ్రతుకు

మాకు ఎటువంటి కష్టం లేకుండ పెంచారు
కష్టాని మీరు ఉంచుకోని ఆనందాని మాకు పంచారు

అలాంటి నిస్వార్ద ప్రేమను అందించటం మీకే సాధ్యం
నాకు కలిగుతున్న అనుభూతి వర్ణనాతీతం రాస్తున్నప్పుడు ఈ పద్యం
     
ఏ జన్మలొ మేము చేసుకున్న పుణ్యం
మీ లాంటి తల్లిదండ్రులు దొరకటం మా దన్యం

అమ్మ నాన్న దీవేనలతొ

జి.సునిల్

No comments: