Friday, July 29, 2011

అవినీతి లేని భారతం


అవినీతి లేని భారతం
ప్రతి దశలొ ఉండటంతొ అవినీతి
అవుతున్నది దేశ భవిషత్తు అదోగతి

లంచం అయ్యింది డబ్బు సంపాందించే యంత్రం
అందుకనే వెలుగులోకి వస్తున్నాయి భారి కుంభకోణాలైన 2G స్పెక్ట్రం

డబ్బులు సంపాదించటానికి వెతుకుతున్నారు అడ్డ దారులు
చాల ఈజిగా అవుతున్నారు అపర కుభేరులు

ప్రజలు తలుచుకుంటే,అటువంటి వారి మాయాజాలం
సాగదు ఎంతొ కాలం

ప్రజలు లంచం వ్యతిరేకంగా పోరాడాలి అయ్యి ఒక టీం
అందరు కలిస్తేనే సాధించొచ్చు అవినీతి లేని సమాజం, అనే మన డ్రీం

ఈ విషయంలొ భవాని గారికి నా అభినందన
A.C.T ద్వార విజయనగరంలొ అవినీతి వ్యతిరేకంగా తెలుపుతున్నందుకు తన స్పందన

ఎప్పుడయితే ప్రజలు పడుతారొ లంచం తీసుకునే వారి భరతం
చూడొచ్చు మనం అవినీతిలేని భారతం


జి.సునిల్.

Sunday, July 24, 2011

దొంగ స్వాములు ఉన్నారు జాగ్రత్త

దొంగ స్వాములు ఉన్నారు జాగ్రత్త
స్వాములను పూజించే భక్తులు
ముందు తెలుసుకోండి,ఎలాంటి వారో మీరు పూజించే వ్యక్తులు

పుణ్యం వస్తుందని కంటున్నారేమో కలలు
ముందు తెలుసుకోండి అక్కడ జరుగుతున్న రాసలీలలు

మంచి పనులకని విరాళాలు ఇస్తున్నారు జనం
కాని స్వార్ద పరుల చేతుల్లొకి వెళ్తున్నది ఆ దనం

పెద్ద వాళ్ళు స్వాములకు చేప్తున్నారు థ్యాంక్
ఎందుకంటే ఆ ఆశ్రమాలు,వారికి మరొ స్విజ్ బ్యాంక్

ఇక అక్కడ భక్తికి లేదు ఆస్కారం
అది ఒక బంగారపు ఘనుల బండారం

ప్రజల్లొ రానంత వరకు చైతన్యం
ఎవరు చేర్చలేరు వారిని మంచి గమ్యం

ప్రజలు,తెలుసుకోండి, మీరు వెళ్తున్న ప్రదేశం మారింది స్వార్ద పరుల అడ్డాగా
మీరునమ్మోద్దు వారిని ఇక గుడ్డిగా

పేద ప్రజలకు మీరే స్వయంగా చేయండి దానం
అలా నిలపండి ప్రాణం

అప్పుడు అందరి మదిలో ఆనందం అవుతుంది ప్రత్యక్షం
తప్పక లభిస్తుంది మీరు కోరుకునే మోక్షం

జి.సునిల్

Saturday, July 23, 2011

కాంచన



కాంచన

మంచి థ్రిల్లర్ ఎంటర్ టైనర్ చూద్దాం అని మీరు వెళ్తే కాంచన
మీ అంచనాలను చేయదు ఎటువంటి వంచన

ఇప్పటి వరకు అనుకున్నాం లారెన్స్ చేస్తాడు సూపర్ గా డ్యాన్స్
కాని నటనతొ, దర్శకత్వంతొ ఇరగతీసాడు లారెన్స్

చాలా సూపర్ గా తీసాడు హారర్
చాలా సందర్బంలొ ప్రతి ఒక్కరు పడుతారు టెర్రర్

సినిమ మొత్తం చాలా ఉత్కంఠ చెందుతాడు ప్రతి ఒక ప్రేక్షకుడు
చాలా ఎంజాయ్ ఫుల్ సినిమ చూసాం అని తెలుపుతాడు చూసిన ప్రతి వీక్షకుడు

లారెన్స్ ఈ సినీమా లొ, అంటే దయ్యం
పడుతాడు భయ్యం

అన్యాయం గురి అయిన కాంచన తనని చేస్తుంది ఆవాహన
తన శత్రువులను చంపి తీర్చుకుంటుంది తన ఆత్మ పడుతున్న సంఘర్షణ

చివరికి లారెన్స్, కాంచన జరిగిన అన్యాయం తెలుసుకోని చేస్తాడు సహకారం
హిజ్రా డాక్టర్ గా హస్పిటల్ పెట్టాలి అని కాంచన్ ఆశయానికి చేస్తాడు సాకారం

మెచ్చుకోవాలి హిజ్రాగా, కాంచన పాత్రలొ చేసిన శరత్ కుమార్ నటన
ప్రతి ఒక్కరిని ఆలొచింప చేస్తుంది సమాజం లొ వారిపై జరుగుతున్న సంఘటన

ప్రజలు సహకరిస్తే ఈ సమజం లొ హిజ్రాలు,
చూపిస్తుంది ఈ సినిమా, వాళ్ళు అవుతారు దేశం మెచ్చే వజ్రాలు

చాలా డేరింగ్ తొ సినిమా తీసి లారెన్స్ చూపించాడు ఇందులొ హిజ్రాల ఆవేదన
ప్రజలను ఆలొచింప చేసి, తప్పక ఈ సినిమా పొందుతుంది ఆదరణ

లారెన్స్ చూపిన ఈ ఆలొచన
తప్పక మార్చనుంది, ప్రజలకు హిజ్రాల పై ఉన్న భావన

జి.సునిల్

Friday, July 15, 2011

నాన్న ప్రేమ


నాన్న ప్రేమ

నాన్న, మనకు దొరికిన జీవితకాలపు ఫ్రెండు
మన కొసం ఎంత వరకైన అవుతాడు బెండు


భావిస్తాడు కుటుంబ క్షేమం తన విధి
తన చూపే ప్రేమ వెల కట్టలేనిది


అటువంటి గొప్ప ప్రేమ
చూపిస్తుంది నాన్న సినిమ


ఈ సినిమాలొ కనిపించరు నటులు
కనిపిస్తాయి కేవలం జివించే పాత్రలు


చాల బాగా నటించాడు విక్రం
తన నటనని తెలుగు ప్రజులు తప్పక చేస్తారు వెల్కం


ఇందులొ తను నటించాడు మానసికంగా ఎదగని వ్యక్తిగా
కాని ఆ లొపం, అడ్డుకోదు తండ్రి ప్రేమ విషయంలొ ఏ విధంగా


సినిమాలొ విక్రం అమ్మాయి వెన్నల నటనలో ఉంది చాల మెట్యూరిటీ
ఆ అమ్మయికి అవార్ద్ రావటం గ్యారంటి


అనుష్క ఇందులొ ఒక లాయర్
చేస్తుంది అ తండ్రి-కూతుర్ల దూరం ని క్లియర్


కాని నాన్న గ్రహిస్తాడు, అమ్మాయి అభివృద్ది కి అవరోదం ప్రస్తుతం ఉన్న తన పరిస్థితి
అందుకని తన దెగ్గర వచ్చిన పాపను దూరం ఉంచుతాడు కలగాలని తనకి పదోన్నతి


తెలుగు దర్శకులారా, ఇటువంటి కధలు కూడ చేయండి జర
ఇటువంటి సినిమాలు చూపించి ప్రేక్షకులని ఆనంద పరచాలి అనుకుంటున్నది తెలుగు తెర

జి.సునిల్

Thursday, July 14, 2011

ముంబాయి పై మరోసారి దాడి



ముంబాయి పై మరోసారి దాడి 
ఉగ్రవాదులు మరొ సారి తలపెట్టారు ఘోరం
మళ్ళి బలి అయింది మన భారత వాణిజ్య కేంద్రం

చాల సార్లు టార్గేట్ అవుతున్నది మన ముంబాయి
మన చేత కాని తనం వల్ల దాడులు చేస్తూ వారు చేస్తున్నారు ఎంజాయి

అయ్యా చిదంబరం
ఎం చేసారు మన దేశ జనాబ నేరం?

మన మీద దాడి చేసిన వాడికి భారి ఖర్చుతొ అందిస్తున్నారు భద్రత
కాని మిమ్మల్ని గద్ద ఎక్కించిన ప్రజలకు మిగుల్చుతున్నారు కడుపు కోత

మన దేశ రక్షణ అని ఎన్నొ కోట్లు చేస్తున్నారు వ్యయం
అయినా జరుగుతు వస్తునది మనకి అన్యాయం

మారపోతే సిష్టం
ఈ పరిస్థితిని మార్చటం కష్టం

అలాగే రాజకీయ నాయకులు ప్రదర్శించాలి చిత్తశుద్ది
ఇలాగే కొనసాగితే ప్రజలు తప్పక తెలుపుతారు బుద్ది


ప్రస్తుతం ప్రజలు వహిస్తున్నారు ఓర్పు
ఒక్క సారి అది నశించిననాడు చాల కష్టం వారిని చేయటం అదుపు

పకడ్బంది చర్యలతొ ఇకనైన చేద్దాం అన్ని కరెక్ట్
ప్రతి నిమిషం ఉందాం అలర్ట్


జి.సునిల్