Tuesday, December 20, 2022

మన వాయిస్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ on Dec 25 @ CCT, Jubilee Hills

 

మన వాయిస్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

మన వాయిస్మెగాస్టార్ గారి  ప్రతి సేవా భావాలకు స్పందిస్తుంది

దృఢ సంకల్పంతో ఆశయాన్ని సాధిస్తుంది


డిసెంబర్ 25 మన వాయిస్మెగా రక్తదాన శిబిరానికి అందరికి స్వాగతం

విజయవంతం చేసి నిజం చేద్దాం మెగాస్టార్ యొక్క అభిమతం

 

మహా కార్యం సంకల్పించేలా చేసింది చిరు గారి మీద ఉన్న అభిమానం
సేవా హృదయంతో ప్రతి ఒక్కరికీ పలుకుతున్నాం ఘనమైన ఆహ్వానం

ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి సేవా గుణం

తద్వారా  కాపాడ కలుగుతారు మరొకరి ప్రాణం

 

ప్రాణం కన్న-మనకు ఏది కాదు మిన్న
అలాంటి మహా అవకాశాన్ని మనం వదులుకోవద్దురన్నా

అవ్వండి రక్తదానంతో ప్రాణదాత

కాపాడిన  వారి మనసుల్లో మీరే అవుతారు విధాత


శిబిరం తప్పక చేస్తుంది మరొక్క ఆరోగ్యాన్ని లిఫ్ట్
మన భాగస్వామ్యం అన్నయ్యకు ఇచ్చినట్టు అవుతుంది మెగా గిఫ్ట్

సాటి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నమే శిబిరం
దిగ్విజయం చేద్దాం పాల్గొని మనం అందరం

 

LET’S MARK 25TH DECEMBER DATE

LET’S TRY TO BRING HAPPINESS IN ANOTHER’S FATE

 

జి.సునిల్

చిరు మెగా ఫ్యాన్ & మన వాయిస్ మెంబర్

9848888317



Wednesday, October 5, 2022

GODFATHER….BOSS OF BOSSES IS BACK

 

GODFATHER….BOSS OF BOSSES IS BACK

గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ నటనకు ప్రతి ఒక్కరూ పలుకుతున్నారు నీరాజనం

ప్రతి సినీ ప్రేమికునికి  ఈ నిశ్శబ్ద  నట విస్ఫోటనం ఒక బహుమానం


మెగాస్టార్ నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూసారు ఎదురులేని బొమ్మ

ఆ తిరుగులేని సినిమా క్యారెక్టరే బ్రహ్మ

 

తన వారికి ఆపద వస్తే అవుతాడు శివతాండవం ఆడే కాలభైరవుడు

తన వారిని ప్రాణప్రదంగా కాపాడుకునే సైనికుడు


తన పలుకే పార్టీని  నడిపించే ఇంధనం

తన చూపే రాజకీయ వ్యవస్థను నడిపే శాసనం

 

తనను నమ్ముకున్న వ్యక్తుల గుండె బలం

అందుకే తన ఆదేశం మేరకు నడుం బిగుస్తుంది అభిమాన దళం


తన ముందు ఎక్కడా నిలవదు ప్రత్యర్థి వ్యూహం

జరిగే ప్రతి సన్నివేశం నింపింది చప్పట్లతో థియేటర్లో కోలాహలం

 

ప్రతి పాత్ర, టెక్నీషియన్ సినిమాలో చేసారు న్యాయం

ఫలించింది బ్లాక్ బస్టర్ సినిమా అందించాలనే వారి ధ్యేయం


మెగాస్టార్  సినీ ప్రస్థానం ఈ సినిమా మరో మైలు రాయి

బ్రహ్మ స్టైలిష్ నటన ఉంటుంది ప్రతి ఒకరి మదిలో చిరస్థాయి


మళ్ళీ వచ్చింది మా పండుగ వాతావరణం

ఎప్పటికీ ఎన్నటికీ మా గుండెల్లో చెరగనిది ఈ అభిమానం

జి.సునిల్

చిరు మెగా ఫ్యాన్


Saturday, September 10, 2022

ప్రణీత్ కౌంటీ గణేష్ ఉత్సవాలు


ప్రణీత్ కౌంటీ గణేష్ ఉత్సవాలు

 

తక్కువ వ్యవధిలో ఉత్సవ ఏర్పాట్లు చేయటాన్ని కమిటీ తీసుకుంది సవాల్ గా

సమిష్టి కృషితో ఎన్నో వ్యయప్రయాసలతో చేసింది ఉత్సవాలను ఎంతో ఘనంగా

 

ఎంత కష్టమైన వెనుక గణేశుని ఆశీస్సులు ఉంటుందనే కమిటీ ధీమా

తమ కౌంటీ వాసులను ఆశీర్వదించమని తీసుకుని వచ్చారు మట్టి ప్రతిమ

 

ప్రతి రోజు జరిగాయి గణేశుని పూజలు

అందుకున్నారు ప్రతి ఒక్కరు స్వామి వారి దీవెనలు 

 

మొదటి రోజు నుంచి   ప్రారంభమైన చిన్నారుల చిందులు

చివరి రోజు వరకు వారి ఉత్సాహానికి లేకుండా పోయింది అవధులు 

 

వారి చిరు నవ్వులు ప్రతి ఒక్కరికి అయింది ఇష్టం

చూసి ప్రతి ఒకరు మరచి పోయారు పడిన కష్టం

 

మహిళల భాగస్వామ్యంతో అలరించాయి  చిన్నారుల నౄత్యాలు

ప్రతి ఒక్కరి  మనసు దోచుకున్నారు మెరిసిన ఈ తారలు

 

మరిన్ని  కార్యక్రమాలతో  అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాలు

భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరూ పొందారు ప్రోత్సాహకాలు 

 

ప్రతి ఒక్కరు  నమ్మారు స్వామి తోడు జీవితానికి కొండంత బలం

అందుకే రికార్డ్ బద్దలు కొట్టింది  జరిగిన వేలం


ప్రణీత్  కౌంటి చూపింది ఉత్సవాల విషయంలో ఎక్కడా తగ్గేదేలే

స్వామి వారి శోభాయాత్ర ముగిసే అంత వరకు అంతట వినిపించింది స్వామి   జైజైలే

 

భాగస్వామ్యం అయిన  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు 

స్వామి పూర్తి చేయాలి మీ ప్రతి ఆశయాలు

 

అశిస్తు మీ

ప్రణీత్ కౌంటీ ఉత్సవ కమిటీ

 

Saturday, April 30, 2022

రివ్యూలకు అతీతం ....మా అభిమానం

 

రివ్యూలకు అతీతం ....మా అభిమానం


మేము చేస్తున్నాం జరుగుతున్న రివ్యూలను బేకాతరు

మాకు చాలు తెరపై ఉన్న మా చిరు


మెగా పవర్ స్టార్ మాకు బోనస్ కనువిందు

రెండు కనులు చాలలేదు చూడటానికి వారి ఇరువురి చిందు

 

కనిపించింది వయసులో కూడా జోరు తగ్గని మా బాస్ శ్రమ 

నెగటివ్ రివ్యుతో జోరు తగ్గించవచ్చు అనుకుంటే అది వారి భ్రమ

 

మాకు మా అభిమాన హిరోల నటవిశ్వరూపం కలిగించింది పండుగ

రానున్న రోజుల్లో గుణపాఠం పోందనున్నారు ఎవరైతే చేస్తున్నారో దగ

 

మా హిరోలు, అభిమానులను ఆనందపరచాలనుకుంటారు ప్రతి ఫ్రేంలో

సినిమా నచ్చుతుంది, వారు మన కోసం పడే కష్టాన్ని చూసే కోణంలో

 

ఇరువురు అయ్యారు చిరుతపులి

కాపాడారు ధర్మస్థలి

 

ధన్యవాదములు తల్లి ఘట్టమ్మ

మీ వల్ల తెరపై కనిపించింది మా మెగా హీరోల బొమ్మ

 

జయ అపజయాలకు అతీతంగా సాగేదే మా అభిమానం

ఎవరు ఎన్ని అన్నా మారదు వైనం


నెవర్ కేర్ నెగటివ్ టాక్స్

మెగా హీరోస్ వల్లే సాధ్యం బద్దలు కోట్టాలంటే బాక్స్

 


జి.సునిల్

మెగా ఫ్యాన్