Wednesday, October 5, 2022

GODFATHER….BOSS OF BOSSES IS BACK

 

GODFATHER….BOSS OF BOSSES IS BACK

గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ నటనకు ప్రతి ఒక్కరూ పలుకుతున్నారు నీరాజనం

ప్రతి సినీ ప్రేమికునికి  ఈ నిశ్శబ్ద  నట విస్ఫోటనం ఒక బహుమానం


మెగాస్టార్ నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూసారు ఎదురులేని బొమ్మ

ఆ తిరుగులేని సినిమా క్యారెక్టరే బ్రహ్మ

 

తన వారికి ఆపద వస్తే అవుతాడు శివతాండవం ఆడే కాలభైరవుడు

తన వారిని ప్రాణప్రదంగా కాపాడుకునే సైనికుడు


తన పలుకే పార్టీని  నడిపించే ఇంధనం

తన చూపే రాజకీయ వ్యవస్థను నడిపే శాసనం

 

తనను నమ్ముకున్న వ్యక్తుల గుండె బలం

అందుకే తన ఆదేశం మేరకు నడుం బిగుస్తుంది అభిమాన దళం


తన ముందు ఎక్కడా నిలవదు ప్రత్యర్థి వ్యూహం

జరిగే ప్రతి సన్నివేశం నింపింది చప్పట్లతో థియేటర్లో కోలాహలం

 

ప్రతి పాత్ర, టెక్నీషియన్ సినిమాలో చేసారు న్యాయం

ఫలించింది బ్లాక్ బస్టర్ సినిమా అందించాలనే వారి ధ్యేయం


మెగాస్టార్  సినీ ప్రస్థానం ఈ సినిమా మరో మైలు రాయి

బ్రహ్మ స్టైలిష్ నటన ఉంటుంది ప్రతి ఒకరి మదిలో చిరస్థాయి


మళ్ళీ వచ్చింది మా పండుగ వాతావరణం

ఎప్పటికీ ఎన్నటికీ మా గుండెల్లో చెరగనిది ఈ అభిమానం

జి.సునిల్

చిరు మెగా ఫ్యాన్


No comments: