నవ్వుతూ బతకాలిరా (WRITTEN FOR LAUGHTER DAY)
ఎవరో అన్నారు సంతోషం సగం బలం
అలా నవ్వుతూ బతకడం ఆనంద జీవితానికి మూలం
ఈ జీవితం మూణ్ణాళ్ళ ముచ్చట
ప్రతీది అతిగా తీసుకోకుండా వేసుకుందాం ఆనందాల బాట
ఎవరికీ ఉండదు సమస్యలు లేని జీవితం
సమయస్ఫూర్తి పరిష్కారంతో తగ్గుతుంది నీపై వాటి ప్రభావం
ప్రతీది క్లిష్టంగా భావిస్తే దొరకదు దేనికీ నీకు సమాధానం
ఆత్మవిశ్వాసంతో జయించు ఈ జీవన మైదానం
ఆనందం తీసుకెళ్తుంది నీ లక్ష్యం వైపు ముందుకి
పెంచుతుంది నీవు భయపడాల్సిన అవసరం లేదు దేనికి
అప్పుడు నీవు అనుకున్నది అవుతుంది నీ ముందు ప్రత్యక్షం
ప్రపంచంలోని ప్రతీది అవుతుంది నీ పక్షం
ఎంతగా నీ జీవితంలో భాగం అయితే ఆహ్లాదం
అంతగా తగ్గుతుంది నీ జీవితంలో వచ్చే ప్రమాదం
నవ్వుతూ బ్రతకమని ఈ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు
అర్థం చేసుకుంటే అసలైన జీవితాన్ని అనుభవిస్తాడు ప్రతి జీవుడు
ఇకనైనా మార్చుకుందాం మన నైజం
మన సంతోషపు పలుకులు ఇతరుల్లో కూడా నింపుతుంది ఉత్తేజం
అందరితో గడుపుదాం ఆనందంగా
మార్చుకుందాం ప్రపంచాన్ని ఆనంద నిలయంగా
జి.సునిల్
1 comment:
Good one sunil
Post a Comment