ఎవరూ పట్టించుకోని మధ్య తరగతి
ఎవరికీ చెప్పలేకున్నారు మధ్య తరగతి..
ప్రస్తుత్తం వారు అనుభవిస్తున్న పరిస్థితి....
కరోనా గడప దాటనివ్వకుండా చేసింది రాకుండా సంపద..
తప్పకుండా వచ్చే ఖర్చులకు డబ్బులేక పడుతున్నారు వారు బాధ....
ఒకటో తారీకు వచ్చే జీతంతో చక్కగా చేసుకునేవారు ప్లానింగ్..
ఇప్పుడు పని చేసుకోలేని వారి స్థితిపై ఎవరూ చేయటం లేదు కేరింగ్....
అన్ని ఉంటేనే చాల కష్టం మధ్య తరగతి బాధ్యత..
ఎమీ లేని ఈ సమయంలో జీవనం అనుకోవాలి విధి రాసిన రాత....
వచ్చిన సంపద సరిపోక ఎదరు అయ్యేవి ఎన్నో సమస్యలు..
ఆత్మాభిమానం అడ్డు వస్తున్నది చేయాలంటే ఇప్పుడు అప్పు ప్రయత్నాలు....
పేదవారికి కనీసం ప్రభుత్వ చేయూత కొంచెం ఆధారం..
కాని వీరికి మాత్రం ఎవరూ చూపడంలేదు ఎటువంటి పరిష్కారం....
అనిపిస్తుంది ఎటుకాకుండా ఎందుకు పొందాము ఈ మధ్యతరగతి పుట్టుక..
ఎవరికి తెలుపలేక తోందరపాటుతో కొందరు అనుకుంటారు ఈ జీవితం చాలు ఇక....
ఆ తొందర నిర్ణయాలు తీసుకోవద్దని మనవి..
మంచి రోజులు వస్తాయి అని ప్రతి ఒక్కరం అవ్వాలి ఆశాజీవి....
ఎవరు పట్టించుకోని వారి పరిస్థితి నిజంగా పాపం..
ఆశీస్తున్నా ఈ సమస్య త్వరగా సమసిపోయి, పొందాలి వారి జీవన ఆశాదీపం ....
జి.సునిల్
2 comments:
Yes
We have to rethink and reinvent. It's time to give off old and rigid thinking, as corona has changed the way of life. Coming days will be excellent for the middle class provided we have flexibility.
S Kumar
Excellent Sunil.
Post a Comment