Friday, January 30, 2009

మా మంచి బావ భిక్షం బావ

మా మంచి బావ భిక్షం బావ
మా బావ గారి పేరు భిక్షం
వారు ఏపుడు అందరికి మిత్ర పక్షం

అన్ని విషాయలలొ మా బావ గారికి ఉంది మంచి ఙ్ణానం 
అందుకే బహుముక ప్రఙ్ణాశాలి అని అందరిలొ వుంది వారికి మంచి స్థానం 

సరదగా ఉన్నప్పుడు ఆయన మాటల తుంటరి
సమస్య పరిష్కారలప్పుడు అయన సాటిలేని నేర్పరి  

చక్కటి పరిష్కారంతొ ముగిస్తాడు తన దెగ్గర వొచ్చిన ప్రతి పంచాయతి
తన ఉద్యొగంలొ ఎప్పుడు చూపించే వాడు నూరు శాతం నిజాయతి

కార్మికుల సమస్యల సమయంలొ పొరాడాడు కొరుతు వారికి న్యాయం
సమస్యలతొ వొచ్చినవారికి భాద పడకు తమ్ముడు అంటు చేసాడు సాయం

అనుపెరుగని ఈ శ్రమజీవునికి ఆ భగవంతుడు ఇద్దాం అనుకున్నాడు విశ్రాంతి
అందుకే రిటేర్మెంట్ కి ఇచ్చాడు అనుమతి

పనిచెసిన్నని రొజులు ఉద్యొగమే ప్రాణంగా పని చెసింది మీ మనస్సు
నీలాంటి మనిషిని కొల్పొతునందుకు భాద పడుతుంది ఆర్టీసి బస్సు    

రాత్రి పూట బస్ లొ ఇప్పటి వరకు కొట్టాడు టికేట్లు
బావ మీకు ఉండవు మీకు ఆ ఇకట్లు    

మీరు డ్యూటీకి వెళ్ళిన ప్రతిసారి క్షేమంగ రావాలని మొక్కేది మా అనుసూయ అక్క
ఇప్పుడు మీరు అమె పక్కనే ఉండడంతొ హాయిగా ఉండొచ్చు యెంచక్క  

మీరు లెనప్పుడు మా అక్కకు ఇంట్లొ కొట్టేది బొరు
అందుకు ఇప్పుడు ఆమేను షికార్లు తిప్పాలి ఓ భిక్షం సారు   

మా బావ, మా అక్క ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకునే దంపతులు
అందరికి ప్రేమను పంచే శ్రిమంతులు   

    భిక్షం బావ
ఇపుడు వరకు సాఫీగా సాగింది మీ జీవిత నావ 

అదే ఆనందంతొ నిండాలి నీ శేశ జీవితం
మీ చిరు నవ్వు మీ మొకంలొ ఎప్పుడు అవ్వాలి శాశ్వతం
 

No comments: