Friday, September 25, 2020

మూగబోయిన మా బాలు గారి స్వరం

మూగబోయిన మా బాలు గారి స్వరం 

ఊహించాలంటే లేరని మన గాన గంధర్వుడు

తట్టుకోలేకపోతున్నాడు ఏ సంగీత ప్రేమికుడు 


బాలు గారు అంటే ప్రతీ భారతీయుడికి ఎనలేని ప్రేమ

తన మధుర స్వరం ఇక లేదని కుమిలి పోతుంది చిత్ర పరిశ్రమ


ఈ సంగీతపు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది మీ కంటూ

మేము పెరిగాం మీ మధుర పాటలు వింటూ 


బాలు గారు నిలిచారు తరాల మధ్య వారధి

మేము ఏమీ నేరం చేసామని మా నుంచి మిమ్మల్ని తీసుకెళ్లింది ఆ విధి


మా బాలు గారు మధుర గాన సముద్రం

మా నుంచి దూరం చేసిన ఆ విధాతపై ప్రతి ఒకరు చూపుతున్నారు రౌద్రం


ఎన్నో మధురమైన పాటలతో మా మదిని చేసారు మ్యాజిక్కు

ఇప్పుడు సినీ సంగీత ప్రపంచానికి లేకుండా అయింది పెద్ద దిక్కు


మా జీవితంలో మీ పాట అయ్యింది మమేకం

మీతోనే సాధ్యమయింది స్వరానికి అపురూపమైన అభిషేకం


లేదని తలుచుకోవాలంటే మా బాలు గారి స్వరం

మా మనసులకి కలిగిస్తున్నది ఎవరికి తెలుపలేని భారం


మీమల్ని మా నుంచి దూరం ఈ రోజు మాకు చీకటి రోజు

ఈ రోజు మాకు లెకూండా చేసింది మా పాటల రారాజు


మీరు సాధించారు ప్రతి సంగీతపు మజిలీ

మా అందరి ప్రార్థన మీ ఆత్మకు శాంతి చేకూరాలి


అందుకోండి మా ఘన నివాళి సంగీతపు లెజండ్

మా మదిలో మీకు, మీ పాటలకు ఎప్పుడూ ఉండదు ఎండ్(END) 

  

మీ అభిమాని

జి.సునిల్

Saturday, September 12, 2020

అదిరిపోయే మన జీవిత క్లైమాక్స్ (Written Inspired by Director #PuriMusings)

 అదిరిపోయే మన జీవిత క్లైమాక్స్


మన జీవితంలో ఏ విషయంలో పడవద్దు రాజీ
అప్పుడు ఈ చరిత్రలో మనకంటూ  ఉంటుంది ఒక పేజీ

వయసులో మనం చూపగలిగితే సాధించాలనే కసితో పనితనం
అపుడు ఎవరీ మీద ఆధారపడకుండా హాయిగా ఉంటుంది ముసలితనం

 మనం ఎవరికీ  కాకూడదు భారం
మనతో గడపాలని ఉత్సాహపడాలి మన తర్వాతి తరం

ఆ వయస్సు కాదు చదవటానికి భగవద్గీత
ఆ వయస్సులో నువ్వు అందరినీ ఉత్తేజపరిచి అవ్వాలి జీవితంలో విజేత

ఆ వయస్సు కాదు మూలకు కూర్చోని లేకుండా ఎటువంటి కదలిక
నీ పిల్లలు నీ కోసం చూసేలా చేయాలి నీ రాక 
    
ముసలితనం కాదు కృష్ణా రామా అనుకునే వయస్సు
ప్రపంచాన్ని చేధించి ఉత్సాహ పడాలి మన మనస్సు

ఉండొద్దు అనుకునేలా వీడికి వృధా అన్నం పెట్టే కంచం 
ఉండాలి వీడు మనతో  అనుకునేలా ఈ ప్రపంచం

అనుకుంటున్నా ప్రతీదీ సాధించు
నీ క్లైమాక్స్  ఎంత విలాసంగా ఉంటుందొ చూపించు

చావు గురించి నువ్వు చూడొద్దు క్లాక్
నువ్వు ఇచ్చే క్లైమాక్స్ అవ్వాలి అందరికి మైండ్ బ్లాక్

జి.సునిల్

Wednesday, May 13, 2020

ఇకపై స్వదేశీ వస్తువులు

ఇకపై స్వదేశీ వస్తువులు

పెంచుకోవాలి స్వదేశీ వస్తువులపై అభిమానం
అప్పుడు అభివృద్ధి పథంలో దేశం చేస్తుంది పయనం

గుర్తిద్దాం మన వారి శ్రమ
పెంచుకుందాం ఇక్కడ తయారు అయ్యే వస్తువులపై ప్రేమ

మోదీ గారి పలుకులను స్వాగతిద్దాం
మన దేశం పై ప్రేమ చూపిద్దాం

ప్రస్తుత  పరిస్థితులలో మన కంపెనీలే వచ్చాయి మనకు అండగా
వారి వస్తువులు కొనడమే ఉండాలి ఇక మన అజెండా

 మన వస్తువులు కొంటే మళ్ళీ తోర్పడుతాయి మన దేశ అభివృద్ధికి
మన శ్రేయస్సు చేసే ఆ పనికి ఆలోచన దేనికి???

పెంచుకుందాం స్వదేశీతనం
తగ్గిద్దాం విదేశీ కంపెనీల పెత్తనం 

మన  స్లోగన్ మేడ్ ఇన్ ఇండియా
మన సత్తా చూడాలి ఈ దునియా

జి.సునిల్

Monday, May 4, 2020

గోవిందా గోవిందా (Written After Seeing Que at Bar Shops Today)

గోవిందా గోవిందా 
(Written After Seeing Que at Wine Shops Today)

అంటాం కాపాడు గోవిందా గోవిందా..
వచ్చినప్పుడు మనకు ఆపద....

ఇప్పుడు కాన రావట్లేదు ఆ ఏడుకొండల స్వామి దేవుడు..
ఏనాడైనా అనుకున్నామా వస్తుందని అలాంటి నేడు....

తిరుపతిలో అనువనువు పొందేవాళ్ళం భక్తి పారవశ్యం..
కరోనా మహమ్మారి వలన  లేకుండా అయింది నేడు మనకు ఆ దృశ్యం....

ఓ దేవా..
ఈ కరోనా నుండి మాకు ఎమైన నేర్పాలని అనుకున్నావా??....

అలా ఎలా మారుతాము అనుకున్నావు ప్రభువా..
45 రోజుల శ్రమ ఒక మందు దొరకడంతో మార్చుకున్నాం మా తోవా....

కరోనా కరోనా అంటూ ఇన్ని రోజులు పడ్డాం భయం..
మందు దొరుకుతుంది అంటే ప్రతీది అయింది మాయం....

 దొరికితే చాలు అనుకున్నాం బీరు ..
కరోనా కూడా చేసాం భేకాతరు....

మా ముందు చెల్లవు నీ మాయజలం..
ఎందుకంటే  మేము అనుకుంటాం, మేము ఎదురులేని మానవులం....

చావు మా ముందు దాడి చేయటానికి రేడిగా ఉన్నా నేర్చుకోము.. 
కొద్ది క్షణాల తృప్తి కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలని వదులుకుంటాము....

నీ వల్లే కాకపోతే ఎవరి వల్ల అవుతుంది ఏడు కొండల వాడా..
మమల్ని క్షమించి ఎప్పుడూ మాకు కల్పించు నీ నీడ....

ఎవరికీ లేదు ఇందరి కష్టాన్ని తృణప్రాయంగా వృధా చేసే హక్కు..
మనని మనం కాపాడు కోవడం తప్ప లేదు ఎటువంటి  వేరే మ్యాజిక్కు....

ఆశీస్తున్నాము ప్రతి ఒకరు మారుతారని..
త్వరలో ఈ సమస్య పోయి నిన్ను తిరుపతిలో దర్శించుకోవాలి గోవిందా గోవిందా అని....

జి.సునిల్

Sunday, May 3, 2020

నవ్వుతూ బతకాలిరా (WRITTEN FOR LAUGHTER DAY)

నవ్వుతూ బతకాలిరా (WRITTEN FOR LAUGHTER DAY)

ఎవరో అన్నారు సంతోషం సగం బలం
అలా నవ్వుతూ బతకడం ఆనంద జీవితానికి మూలం

ఈ  జీవితం మూణ్ణాళ్ళ ముచ్చట
ప్రతీది అతిగా తీసుకోకుండా వేసుకుందాం ఆనందాల బాట

ఎవరికీ ఉండదు సమస్యలు లేని జీవితం
సమయస్ఫూర్తి  పరిష్కారంతో తగ్గుతుంది నీపై వాటి ప్రభావం

ప్రతీది క్లిష్టంగా భావిస్తే దొరకదు దేనికీ నీకు సమాధానం
ఆత్మవిశ్వాసంతో జయించు ఈ జీవన మైదానం

ఆనందం తీసుకెళ్తుంది నీ లక్ష్యం వైపు ముందుకి
పెంచుతుంది నీవు భయపడాల్సిన అవసరం లేదు దేనికి

అప్పుడు నీవు అనుకున్నది అవుతుంది నీ ముందు ప్రత్యక్షం
ప్రపంచంలోని ప్రతీది అవుతుంది నీ పక్షం

ఎంతగా నీ జీవితంలో భాగం అయితే ఆహ్లాదం
అంతగా తగ్గుతుంది నీ జీవితంలో వచ్చే ప్రమాదం

నవ్వుతూ బ్రతకమని ఈ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు
అర్థం చేసుకుంటే అసలైన జీవితాన్ని అనుభవిస్తాడు ప్రతి జీవుడు

ఇకనైనా మార్చుకుందాం మన నైజం
మన సంతోషపు పలుకులు ఇతరుల్లో కూడా నింపుతుంది ఉత్తేజం

అందరితో గడుపుదాం ఆనందంగా
మార్చుకుందాం ప్రపంచాన్ని ఆనంద నిలయంగా

జి.సునిల్

Saturday, May 2, 2020

ఎవరూ పట్టించుకోని మధ్య తరగతి



ఎవరూ పట్టించుకోని మధ్య తరగతి 


ఎవరికీ చెప్పలేకున్నారు మధ్య తరగతి.. 
ప్రస్తుత్తం వారు అనుభవిస్తున్న పరిస్థితి....

కరోనా గడప దాటనివ్వకుండా చేసింది రాకుండా సంపద..  
తప్పకుండా వచ్చే ఖర్చులకు డబ్బులేక పడుతున్నారు వారు బాధ....

ఒకటో తారీకు వచ్చే జీతంతో చక్కగా చేసుకునేవారు ప్లానింగ్.. 
ఇప్పుడు పని చేసుకోలేని వారి స్థితిపై ఎవరూ చేయటం లేదు కేరింగ్....

అన్ని ఉంటేనే చాల కష్టం మధ్య తరగతి బాధ్యత.. 
ఎమీ లేని ఈ సమయంలో జీవనం అనుకోవాలి విధి రాసిన రాత....

వచ్చిన సంపద సరిపోక ఎదరు అయ్యేవి ఎన్నో సమస్యలు.. 
ఆత్మాభిమానం అడ్డు వస్తున్నది చేయాలంటే ఇప్పుడు అప్పు ప్రయత్నాలు....

పేదవారికి కనీసం ప్రభుత్వ చేయూత కొంచెం ఆధారం.. 
కాని వీరికి మాత్రం ఎవరూ చూపడంలేదు ఎటువంటి పరిష్కారం....

అనిపిస్తుంది ఎటుకాకుండా ఎందుకు పొందాము ఈ మధ్యతరగతి పుట్టుక.. 
ఎవరికి తెలుపలేక తోందరపాటుతో కొందరు అనుకుంటారు ఈ జీవితం చాలు ఇక....

ఆ తొందర  నిర్ణయాలు తీసుకోవద్దని మనవి.. 
మంచి రోజులు వస్తాయి అని ప్రతి ఒక్కరం అవ్వాలి ఆశాజీవి....

ఎవరు పట్టించుకోని వారి పరిస్థితి నిజంగా పాపం.. 
ఆశీస్తున్నా ఈ సమస్య త్వరగా సమసిపోయి, పొందాలి వారి జీవన ఆశాదీపం ....

జి.సునిల్

Friday, May 1, 2020

వలస కార్మికుల బాసటగా


వలస కార్మికుల బాసటగా

బతుకు జీవనం కోసం చేసారు వలసలు
కష్టించిన సంపాదనతో సాగించారు జీవితాలు

సొంత ఊరి నుంచి వచ్చారు దూరంగా
 బ్రతకడం కోసం భరించారు ఉన్నా ఆ బాధ ఎంతో భారంగా

మహమ్మారి కరోనా మార్చేసింది వారి జీవనం
ప్రశ్నార్థకంగా మారింది వారి భవిష్యత్తు గమనం

అన్ని ఉన్న వారు భారం అనుకుంటున్నారు ఇంట్లో ఉంటున్న బ్రతుకు
కాని ఈ వలస వచ్చిన వారికి గగనం అయింది దొరకడం మెతుకు

తట్టుకోలేకపోయారు విధి వారిపై చూపిన తడాఖా
సొంత ఊరికి ఇక పట్టారు కాలి నడక

లెక్క చేయలేదు చేయాల్సిన సుదూర ప్రయణాలు
బ్రతుకు జీవుడా అనుకుంటూ పట్టారు వారి ఇంటికి దారులు

వారి బాట అంతా కష్టంతో కూడిన కన్నీటి పర్యంతం
ప్రతి మానవత హృదయం చలించింది చూసి ఆ ఉదంతం

వారి కష్టం అయింది మన ప్రతి ఒకరి అభివృద్ధిలో భాగం
సహాయపడి ప్రతి ఒకరు కల్పించాలి వారికి జీవన యోగం

వారికి సహాయ పడాలి ప్రతి మానవాళి
మేమున్నాం అంటూ వారికి బాసటగా కదలాలి

వారికి అండగా ఉంటే సమాజం
అది అవుతుంది వారికి మళ్ళీ జీవితంపై ఆశ కలిగించే బీజం

ఇది ఒకరికోకరు తోడు ఉండాల్సిన సమయం
త్వరగా బయటపడుతాం అర్దం చేసుకోగలితే ప్రతి హృదయం 

జి.సునిల్

Tuesday, April 28, 2020

ఒక్క అడుగు


ఒక్క అడుగు

ప్రారంభించరా నీ మొదటి అడుగు..
అప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగు...

నువ్వు చేస్తే లేటు..
దూరమైపోతుంది నువ్వు కొట్టాలనుకున్న స్పాటు... 

గొప్ప గొప్ప లక్ష్యాలు ఆ ఒక్క అడుగుతో అయ్యింది మొదలు.. 
అలుపెరుగని కృషి పయనంతో సాధించగలవు విజయాలు... 

లేకుండా నీ శ్రమ..
అనుకున్నది సాధించగలను అనుకుంటే నీ భ్రమ...

ఎప్పుడూ అనుకోకు అడుగు వేయటంలో అయ్యింది ఆలస్యం..
అసలంటూ మొదలుపెట్టడంలోనే ఉంది నీ విజయ రహస్యం...

అందుకే చేయి ఇకనైన నీలో కదలిక..
అప్పుడు అవుతుంది నీవు అనుకున్న గమ్యంతో నీ కలయిక...

నీ పోరాటం తెప్పిస్తుంది నీకు ప్రశంసల వర్షం..
నీ అడుగులు ఇతరులకి అవుతుంది ఆదర్శం...

శ్రీ శ్రీ పలుకులు అవ్వాలి ఉత్తేజం నీకు సోదరా..
ఆ ఒక్క అడుగు మొదలుతో ప్రతి విజయం నీదేరా...

మొదలుపెట్టినప్పుడు నీవు అవ్వొచ్చు ఒక్కడివి..
శిఖరం చేరుకున్నప్పుడు అవుతావు అందరి మనసులో నిలిచే చిరంజీవి...

మరువకు నీ విజయం ఉంది నీ చేతుల్లో..
భువి నుంచి వెళ్ళేటప్పుడు అనుకోవాలి "అనుకున్నది సాధించా ఈ జీవితంలో"... 

జి.సునిల్

Monday, April 27, 2020

కరోనా నేర్పిన పాఠం


కరోనా నేర్పిన పాఠం

బ్రతకటానికి ప్రతి ఒక్క జీవుడు
సృష్టించాడు ప్రకృతిని ఆ బ్రహ్మ దేవుడు

అందుకు మనం ప్రవర్తించాం విరుద్దంగా
అందుకే మన జీవితాలు అయ్యాయి ఇలా చిన్నా భిన్నంగా

మన గుప్పిట్లో ఉందనుకున్నాం సర్వం
మానవ జాతి కన్నా గొప్పది ఏదీ లేదు అని పడ్దాం గర్వం

కరోనా రూపంలో ప్రతి ఒక్కరికి  ప్రకృతి ఇచ్చింది గుణపాఠం 
నిర్లక్ష్యం చేస్తే ఇలాగే ఉంటుంది అని ఇచ్చింది అల్టిమేటం 

ఇప్పుడు అందరు పడుతున్నారు తిప్పలు
కాని గ్రహిస్తున్నారా చేసిన తప్పులు???

నేర్చుకుంటే ఉంటుంది జీవించగల భవిష్యత్తు
నేర్చుకోకపోతే ఇక ఎప్పటికీ మన జీవితాలు అవుతాయి ఇలాగే చిత్తు

ఎంతో విలువైనది ప్రకృతి
విలువ ఇచ్చి కాపాడుకుందాం దేవుడు సృష్టించిన ప్రతి జాతి

ఇకనైనా ఆపుదాం అన్ని పాడుచేసుకుంటూ సాధించే అభివృద్ధి వేగం
ప్రకృతి కాపాడుకోవటం కూడా అవ్వాలి మనం సాధించే అభివృద్ధిలో భాగం

నీవు నిర్లక్ష్యం చేసిన విభాగాలు నేడు వచ్చాయి నీకు అండగా
ప్రతి ఒక్కరిని కాపాడుకుని చేసుకుందాం మన జీవితాన్ని అందంగా

పాటిద్దాం సృష్టి ధర్మం
క్రమశిక్షణతో కూడిన జీవనం అవ్వాలి మన ధ్యేయం

సమాజ హితం కోరే విధంగా ఇక నుంచి ఉండాలి నీ పాత్ర
లేకపోతే మానవ జాతి ఉండేది అని చెప్పుకుంటుంది రానున్న చరిత్ర


 జి.సునిల్



Sunday, April 26, 2020

ఆడపిల్ల అయితే ఏంట్రా

ఆడపిల్ల అయితే ఏంట్రా

పిల్లలు పుట్టేటపుడు తేడా చూపించకు అంటూ మగ ఆడ
సమాన ప్రోత్సాహంతో ఎవరైనా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు నీ ఇంటి జాడ

నింపు వారిలో ఉత్సాహం
విజయాలతో పెంచుతారు నీ ఇంటి నామం

కించపరచకు వాళ్ళని నీ చోటు నాలుగు గోడలని
నీ సహాయంతో వారు అవుతారు నీకు అసలైన గని

వాళ్ళు పుట్టలేదు చేయటానికి బండ చాకిరీ
వారికి ఉంది శక్తి దేశానికే చూపే దారి

ఆడపిల్ల అని చూపకు లోపం
నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళే నీకు ప్రేమ అందించే ప్రతిరూపం

సమాజం కించపరిచే మాటలను పక్కకు పెట్టు
నీ అండతో వారిని ఎక్కించు మరో మెట్టు

పెళ్ళి చేయటమే కాకుడదు నీ లక్ష్యం
సరైన దారి చూపించి, చేర్చు వారు సాదించగల గమ్యం

అందించు నీ చేయి
సాధిస్తారు వారి ప్రతి కల మైలురాయి

అందుకే ఆడ మగా అనే తెరను ఇకనైనా దించరా
గ్రహించు వారి విజయంతో జయం మనదేరా

జి.సునిల్
(Written inspired by Dangal Movie)

Monday, April 13, 2020

నీ బాధ్యతని మరువకు (STAY HOME STAY SAFE)

నీ బాధ్యతని మరువకు  

కనపడకుండా మన పై దాడి చేస్తున్న మహమ్మారి కరోనా
పేరు వింటేనే ప్రతి ఒకరు ప్రస్తుతం పడుతున్నారు హైరానా

సమస్య కలగటం లేదు నీ ఒక్కడికి
సమస్య యావత్ జగతిది

కొంచెం నిర్లక్ష్యం చేసినా సమయం
మనకు తప్పదు మహా ప్రళయం

అది గ్రహించగలిగితే నీ మనసులో
మహా సమస్యను అరికట్టే ఆయుధం ఉంటుంది నీ చేతుల్లో

 ప్రభుత్వం యొక్క ప్రతి సూచనలకు చేస్తే నీ వంతు కర్తవ్యం
త్వరగా చేరుతాం కరోనా రహిత సమాజం అనే గమ్యం  

నీ అంకితమైన ప్రస్తుత చర్యలు దేశానికి శక్తి 
చూపిస్తుంది నీ దేశభక్తి 

అన్ని నిబంధనలకు నువ్వు ఇప్పుడు అయితే అంకితం
కాపాడుతావు నీతో పాటు ప్రతి ఒకరి జీవితం

అంకితమైన ప్రభుత్వ అధికారులు మనకు దొరికిన అద్బుతమైన నిధి
మన కోరకు వారి ప్రాణలు పెట్టి చేస్తున్నారు వారు విధి 

నీ అనాలోచిత పనులతో కాకు ఎంతో శ్రమిస్తున్న వారికి భారం
గుర్తుంచుకో మనందరికీ ప్రస్తుతం వారు తప్ప లేరు వేరే ఆధారం

అందుకే అలోచించు సోదరా
నీకు నువ్వే నిబంధనలను అతిక్రమించకుండా వేసుకో పహారా

FOLLOW RULES OF LOCKDOWN
STAY IN SAFEZONE

======================================================================

SOME OTHER WRITINGS

P... Poratame
O.. Oopiri,
L... Lockdownlo
I... Istunna
C... Commitmentki
E... Eduruledu
D... Deivamla
O... Okkadey
C.. Corona
T....Tagginchi
O...Odarchagala
R....Roopam
C... Can
O... Only
R.... Reduce,
O... Obeying
N.... Nation
A... Advise
A... Adopt
P... Precautions,
R.... Relax
I... In
L... Lockdown

A... Anni
P... Paatistu
R.... Relax
I.... In
L... Lockdown

T..Teliyani
E...Enenmypei,
L...Lockdownlo
A...Aayudamgaa
N..Nilavaalani
G...Goppa
A...Aashayamto
N...Nadipistundi
A... Andarini
If anyone asks HELP, INDIA
I... Incredible
N.. Nation
D... Doing
I... Immediate
A... Attention



G.SUNIL