Thursday, December 9, 2010

మా ఖమ్మం జిల్లా



మా ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా మా సొంత ఊరు
మా మనసు పులకరిస్తుంది వినగానే ఆ పేరు

ఖమ్మం వెళ్తున్నాం అంటే ఆనంద పర్యంతం అవుతుంది మా మది
అక్కడ మాకు ఘన స్వాగతం పలుకుతుంది మాకు సుపరిచితం అయిన ప్రతి వీధి

అన్ని సంస్కృతుల కలయిక మా ఖమ్మం మెట్టు
వచ్చిన ప్రతి వారిని చేస్తుంది ఆకట్టు

నరసింహుడు కొలవు అయిన ప్రదేశమే మా స్తంబాద్రి
మాకే సొంతం శ్రీరాముడు పాదం మోపిన భద్రాద్రి

అంగ రంగ వైభవంగా జరుగుతుంది సీతారాముల కళ్యాణ వేడుక
భక్తుల కనులకు ఆనందం కలిగించి, వారికి ఈ దక్షిణ అయొధ్య ఇస్తుంది మధుర జ్ఞాపిక

మా జిల్లాలొ పవిత్ర భద్రాద్రి దెగ్గర పారుతుంది జీవనది గోదావరి
ఎన్నొ ప్రాజెక్ట్ ల ద్వార పంటల్లొ మా రైతులు పండిస్తారు సిరి

కష్టించే కార్మికులతొ నల్ల బంగారాన్ని వెలికితీస్తుంది మా సింగరేణి గనులు
గిరిజన సంస్కృతి తొ కనిపిస్తుంది మా జిల్లాలొ దట్టమైన అడవులు

మా కార్మికుల కష్ట ఫలితమే కె.టి.పి.యస్ లొ ఉత్పత్తి అయే విద్యుత్తు
అది ఇస్తుంది మా ప్రాంతం వారికి కాంతివంతమైన భవిషత్తు

కిన్నెరసాని, పాపి కోండలు, పర్నశాల లాంటి పర్యాటక కేంద్రాలతొ ఆకట్టూకుంటుంది మా జిల్లా
పట్టణంలొ అందరిని ఆకట్టుకునే ప్రదేశం మా ఖమ్మం ఖిల్లా

ఇక్కడ నాయకుల్లొ ఉన్నాయి విప్లవ భావాలు
వాటితొనే విరోచితంగా ఎదుర్కున్నారు నైజాం నవాబు నుంచి వచ్చిన సవాలు

ఖమ్మం జిల్లా ఎన్నికలు ఎప్పుడూ అందరిలొ కలిగిస్తుంది ఆసక్తి
ఎందుకంటే అన్ని పార్టిలకు ఇక్కడ ఉంది ఇంచుమించు సమానమైన శక్తి

సంచలనాలతో ఎప్పుడూ మా జిల్లా ఉంటుంది కేంద్ర బిందువు
అచంచల మేధొ సంపత్తియే మా జిల్లా ఆయువు

అన్ని రంగాలలొ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిన మేదావులు
వారు అదిరొహిస్తున్నారు ఉన్నత పదవులు

ఇక్కడ గడిపిన క్షణాలు మా జీవితంలొ నుంచి ఎప్పుడూ తుడిచిపోదు
మా జిల్లాని మా ఆఖరి శ్వాస వరకు మా మనసు మరచిపొదు

జి.సునిల్

No comments: