శ్రీ సీతారాముల కళ్యాణం
శ్రీ
సీతారాముల కళ్యాణం చూతము రారండి
ఆ
పుణ్య దంపతుల ఆశీర్వాదం పొందుదాంరండి
వారి కళ్యాణం కోరకు అంగరంగ వైభవంగా ముస్తాబు అయినది భద్రాద్రి
గర్వ పడుదాం ఆ మహా పుణ్యక్షేత్రము అయినందుకు
మనది
శ్రీ సీతారాముల కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చ తోరణం
ఆ కళ్యాణం చూడటనికి చాలవు మన నయనం
ఆ దంపతులు వేసుకునే తలంబ్రాలు
అవి ఆణిముత్యాలు
కళ్యాణం కోసం ముస్తాబు అవుతుంది ప్రతి వీది
ఆ కళ్యాణం దోచుకుంటుంది అందరి మది
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
వారి ఆశీర్వాదం పొందినవారి జన్మ ధన్యం అవటం ఖాయం
శ్రీ రామ ఆలయం శ్రీ రామ ఆలయం
సందర్శించుకోవచ్చు ఈ జగత్ సమస్తం
శ్రీరాముడు పితృవాక్య పాలకుడు
శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు
శ్రీరాముడు తండ్రి మాట కొసం
చేసాడు అరణ్యవాసం
ప్రతి ఆడవారు కంటారు కల
ఉండాలని తమ భర్త రాముడిల
ఈ కళ్యాణం సందర్బంగా కళ్యాణం పడుతుంది గోదావరి
పొంగుతుంది తనువుతీరి
జపించండి అంటు "శ్రీ రామ"
అది పాటించే భక్తులకు తమకి ఏమి జరగదు అని ఉంటుంది ధీమా
పెంచుకోండి దేవుడిపై భక్తి
పొందండి విముక్తి
ఎల్లపుడూ ఈ దిగువ "తారక మంత్రం"ని పటించండి
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే, |
సహస్ర నామతత్తుల్యం
రామనామ వరాననే |
జి.సునిల్
No comments:
Post a Comment