Wednesday, October 29, 2025

మా జీవిత ప్రయాణంలో ప్రియమైన ప్రవర్తిక

 

మా జీవిత  ప్రయాణంలో ప్రియమైన ప్రవర్తిక

మా జీవితంలోకి వచ్చాక ప్రవర్తిక

మొదలైంది మా జీవితంలో అసలైన కదలిక

 

మా కలలకు పోసింది ఊపిరి

                                              అయింది మా జీవిత సిరి                                                   

 

తనకు తెలుసు ఎప్పుడూ మేము ఉంటాం తన వెనుక

ఆ ధైర్యంతో ముందుకు సాగుతూ మాకు ఇస్తుంది సంతోష పరిచే కానుక

 

అనుకున్నాము మేము  ఉంటే చాలు ప్రతి విషయంలో తనకి తోడు

తను అయింది మమ్మల్నే ఉత్తేజ పరిచేలా నేడు

 

తన లక్ష్యాలకు  తనే వేసుకుంటుంది ప్రణాళిక

మేము కేవలం అవుతున్నాం తను  వేసుకున్న దారికి కావాల్సిన  ఏర్పాటు చేసే వేదిక

 

అన్ని విషయాల్లో తోడు ఉంటూ న్యాయం చేస్తుంది  పెద్ద కూతురు పాత్ర 

కొన్ని విషయాలలో అయింది మాకు దిశ చూపే నేత్ర

 

తనకు తానే పెంచుకుంది చిత్రాలను వేసే కళా

మాకు ఎంతో సంతోషంగా ఉంది, అందరు తనని అంటుంటే భళా

 

తన పలుకు మార్చింది మా జీవిత ప్రయాణం ఎంతో ఆహ్లాదం

ఛేదించేలా చేసింది జీవితంలోని ప్రతీ అవరోధం

 

ప్రవర్తిక, నిజంగా నువ్వు మా కుటుంబ సభ్యురాలు అవ్వటం మా అదృష్టం

ఈ కవితతో మేము తెలియజేస్తున్నాము ప్రవర్తిక నీపై మా  ఇష్టం

 

పుట్టినరోజు శుభాకాంక్షలతో

నీ  కుటుంబసభ్యులు


Wednesday, September 24, 2025

ప్రతి అభిమాని ఎదురుచూసిన క్షణం OG

 


ప్రతి అభిమాని ఎదురుచూసిన క్షణం OG


పవర్ స్టార్ మాకు ఒక వ్యసనం

తన ప్రతి చర్య మాకు ఉత్తేజపరిచే ఇంధనం

 

వేచి చూసాం పవర్ స్టార్ స్టామినా చూపే  సినిమా కొరకు

ఒక అభిమాని ఇవ్వగలిగాడు అందరి అభిమానులకు కావాల్సిన సరుకు

 

ప్రతి ఫ్రేమ్ లో చూపాడు సుజిత్ తన టాలెంట్

చూపాడు తన అభిమాన స్టార్ అసలైన కంటెంట్

 

చూసాం మా పవర్ స్టార్ నట విశ్వరూపం

ప్రతి సన్నివేశం ప్రతి అభిమానికి అనిపించింది ఎంతో అపురూపం

 

ఇకపై అనాలి కొణిదెల తమన్

మా కోసం ప్రాణం పెట్టి గెలిచాడు ప్రతి అభిమాని మన్

 

నేడు ఆవిష్కరించింది తెలుగు వెండితెర

మా పవర్ఫుల్ ఓజస్ గంభీర

 

OG తో బాక్స్ ఆఫీస్ కి వచ్చింది తూఫాన్ హెచ్చరిక

ఇక ఉన్న రికార్డులు కావాలి, ఇక కదలిక

 

THEY CALL HIM OG ( Original Gangster)

సృష్టించబోతున్నాడు రికార్డుల నూతన పేజీ

 

OG సినిమా పవర్ స్టార్ సత్తా మళ్ళీ చూపింది

ప్రతి అభిమాని ఆకలి తీర్చింది

 

OG టీం అందుకోండి ప్రతి అభిమాని గ్రీట్

అందించినందుకు మాకు కావలసిన ట్రీట్

 

జి.సునిల్

      https://sunil-megafan.blogspot.com/


Friday, June 6, 2025

ఓ అభిమాని ….ఇది నీకు తగునా

 


ఓ అభిమాని ….ఇది నీకు తగునా

నీ  వెలకట్టలేని అభిమానం

నువ్వు ఆరాధించే వారికి నిజంగా ఒక బహుమానం

 

మీ ఇరువురిలో ఆ ప్రేమ చేస్తుంది ఉత్సాహం

పరిధిలో ఉంచుకో కలిగితే జీవితాంతం ఉంటుంది ఆ ప్రేమ ప్రవాహం

 

కాని నీ అభిమానం దాటుతుంది హద్దు

నీ జీవితాన్ని అర్దాంతరంగా చేస్తున్నది రద్దు

 

నిన్ను ఆరాధించే ప్రతి ఒకరిని బాధిస్తున్నావు

వారిని జీవితాంతం వేదిస్తున్నావు

 

నీ రాక కొరకు  వారు సాగిస్తున్నారు వారి ఆయువు

అందరాని లోకానికి వెళ్తున్నావు భువి మీద వదిలి నీ తనువు

 

నీ పై పెట్టుకున్నారు వారు ప్రాణం

నువ్వు వేస్తున్నావు వారిపై జీవితాంతం బాధ పెట్టే బాణం

 

నీ గురించి రెండు రోజులు చర్చించుకుంటది ఈ సమాజం

తరువాత నీ వాళ్ళు తప్ప ఎవరు గుర్తుచేసుకోరు, ఇది  నిజం

 

ఇకనైన మేలుకో

నీ జీవితం విలువైనది , అది తెలుసుకో


ఇకనైనా తగ్గించు నీ ఆవేశం

నీ అభిమానం ఉండాలి సాధించేలా  నీ జీవిత దిశానిర్దేశం

 

నువ్వు అభిమానించే వారు కూడా నిన్ను చూసి గర్వపడేలా ప్రయత్నించు

అభిమానానికి  నిజమైన అర్థం  సమాజానికి చూపించు

 

జి.సునిల్